అన్వేషించండి

New Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వస్తోంది, మీ స్కూటర్‌ను పాత సామానుకు వేయాల్సిందే!

Upcoming Electric Scooter: మనం మరిచిపోయిన ఒక ప్రసిద్ధ కంపెనీ, త్వరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. ఆ స్కూటర్‌లో చాలా ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.

Upcoming Kinetic Electric Scooter: మీరు 80s కిడ్స్‌ అయితే మీకు కైనెటిక్‌ స్కూటర్లు గుర్తుండే ఉంటాయి. ఒకప్పుడు మార్కెట్‌లో మంట పుట్టించిన, అప్పటి కాలానికి అత్యాధునిక రూపంతో కుర్రకారు మనసు దోచుకున్న స్కూటర్‌ ఇది. ఆ తర్వాత, వివిధ కారణాల వల్ల మార్కెట్‌ నుంచి క్రమంగా కనుమరుగైంది. ఇప్పుడు, కైనెటిక్ గ్రూప్ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో, కైనెటిక్‌ పేరు మళ్లీ వినిపిస్తోంది. పునరాగమనం చేస్తున్న ఈ బండి గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. 

Hero Vida, TVS iQube, Bajaj Chetak & Ola S1 వంటి స్కూటర్‌లకు పోటీగా కైనెటిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను కైనెటిక్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ - కైనెటిక్ వాట్స్ & వోల్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ స్కూటర్‌ను పుణెలో టెస్ట్‌ చేస్తున్నారు.

డిజైన్ ఎలా ఉంది?
కైనెటిక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పాత కైనెటిక్ హోండా ZX లాగానే కనిపిస్తుంది. రెట్రో స్టైల్ & మోడర్న్‌ ఫీచర్లతో తయారైంది. ముందు భాగంలో చదరపు ఆకారపు LED హెడ్‌ల్యాంప్‌ ఇచ్చారు. ఇది ఈ బండికి క్లాసిక్ & ఆధునిక రూపాన్ని ఆపాదిస్తోంది. చిన్న విండ్‌షీల్డ్ & ఫాక్స్ ఫ్లైస్క్రీన్‌ను కూడా జత చేశారు, ఇది ఈ స్కూటర్‌కు కొద్దిగా స్పోర్టీ లుక్‌ను కూడా ఇస్తోంది.

ఈ స్కూటర్‌లో పెద్ద & స్ట్రెయిట్ ఫ్లోర్‌బోర్డ్‌ ఉంది & కుటుంబ అవసరాల కోసం ఇలా తయారు చేశారని ఈ బాక్సీ డిజైన్ చూపిస్తుంది. ఈ టూవీలర్‌కు సింగిల్ గ్రాబ్ రైల్ & ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, ఇది రైడ్‌ను సౌకర్యవంతంగా చేస్తుంది. టెస్టింగ్‌ టైమ్‌లో.. దీర్ఘచతురస్రాకార హెడ్‌లైట్లు, 3-స్పోక్ అల్లాయ్ వీల్స్ & ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ కూడా కనిపించాయి. దీని పరిమాణం & రూపం TVS iQube, Ola S1 & Bajaj Chetak వంటి స్కూటర్‌ల మాదిరిగానే ఉంటుంది. అంటే, Kinetic ఈ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో నేరుగా పోటీ పడటానికి సిద్ధమవుతోందని స్పష్టం అవుతోంది.

పవర్‌ & పెర్ఫార్మెన్స్‌
పవర్‌ & పెర్ఫార్మెన్స్‌ విషయాని వస్తే... దీనికి హబ్-మౌంటెడ్ మోటార్‌ ఉండే అవకాశం ఉంది, ఇది సరళమైన & తక్కువ ధర EV డ్రైవ్‌ట్రెయిన్‌లో భాగం అవుతుంది. మెరుగైన స్థిరత్వం కోసం డ్యూయల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ & డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు అందిస్తున్నారు. దీనికి మిడ్‌ సైజ్‌ బ్యాటరీ ఉండవచ్చు, ఇది 100 నుంచి 120 కి.మీ. రేంజ్‌ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ విషయం ఇంకా అధికారికంగా తెలియలేదు.

ప్రొడక్షన్‌ & లాంచింగ్‌ టైమ్‌
కైనెటిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మహారాష్ట్రలోని అహల్యా నగర్‌లో ఉన్న కైనెటిక్ కొత్త EV యూనిట్ 'వాట్స్ & వోల్ట్స్ లిమిటెడ్' తయారీ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కంపెనీ, కైనెటిక్ గ్రీన్ బ్రాండింగ్ కింద దీనిని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ 2025 చివరి త్రైమాసికంలో లేదా 2026 ప్రారంభంలో భారత మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget