అన్వేషించండి

Best EV Under 10 Lakh: భారత్‌లో 10 లక్షల లోపు లభించే అత్యుత్తమ ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా పది లక్షల బడ్జెట్‌ విభాగంలో బాస్ వంటి వినూత్న ఆర్థిక నమూనాలు, కొత్త మోడళ్ల రాకతో సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పది లక్షల లోపు బడ్జెట్‌లో మంచి ఈవీ కార్లు అందుబాటులోకి వచ్చాయి.
  • వాయ్‌ మొబిలిటీ ఈవా, ఎంజీ కామెట్‌ ఈవీ నగర ప్రయాణాలకు అనువైనవి.
  • టాటా టియాగో ఈవీ, పంచ్‌ ఈవీ కుటుంబాలకు, భద్రతకు మంచి ఎంపికలు.
  • సిట్రోయెన్‌ eC3 విశాలమైన క్యాబిన్‌తో వస్తుంది, భద్రత ఒక ఆందోళన.

Best EV Under 10 Lakh: భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవం ఇప్పుడు కేవలం విలాసవంతమైన వినియోగదారులకే పరిమితం కాలేదు. ఎంట్రీ లెవల్ ఈవీల విబాగం గణనీయమైన మార్పులకు లోనైంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, బ్యాటరీ సాంకేతికతలో మెరుగుదలకు ఇందుకు ప్రధాన కారణాలు. 

గతంలో ఎలక్ట్రిక్‌ కార్లు అంటే భారీ ధరలు ఉంటాయనే అపోహ ఉండేది. కానీ నేడు పది లక్షల లోపు బడ్జెట్‌లో విభిన్నమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మార్పునకు ప్రధానంగా బ్యాటరీ యూజ్‌ ఏ సర్వీస్‌ అనే సరికొత్త విధానం ఊతన్నిచ్చింది. దీని ద్వారా కారు ధర నుంచి బ్యాటరీ ఖర్చును వేరు చేసి, కారును తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ వినియోగాన్ని కిలోమీటర్‌కు కొంత మొత్తం చెల్లించే వెసులుబాటు కలిగింది. 

వినూత్న వాయ్‌ మొబలిలిటీ ఈవా

దేశంలో అత్యంత చవకైన వినూత్నమైన ఈవీలలో వాయ్‌ మొబిలిటీ ఈవా ఒకటి. ఇది నగర ప్రయాణాల కోసం రూపొందించింది. దీని ప్రారంభ ధర 3.99 లక్షలు కాగా, బాస్ ఆప్షన్ కింద 3.25 లక్షలకే లభిస్తుంది. ఈ కారుపై సోలార్ రూఫ్ ఉంటుంది. ఇది రోజుకు అదనంగా పది కిలోమీటర్ల రేంజ్‌ను సూర్యరశ్మి ద్వారా అందిస్తుంది. ఇది 12.6-18 kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. 

ఎంజీ కామెట్‌ ఈవీ 

ఎంజీ కామెట్‌ ఈవీ అనేది అత్యంత కంపాక్ట్‌ డిజైన్‌తో కూడిన ప్యూచరిస్టిక్‌ కారు. ఇరుకైన వీధుల్లో ప్రయాణించడానికి, పార్కింగ్ సమస్యలు ఉన్న వారికి సరైన ఆప్షన్. దీని ఎక్స్‌షోరూమ్ ధర 7.50 లక్షల నుంచి 9.97 లక్షల వరకు ఉంటుంది. బాస్ స్కీమ్ కింద దీని కేవలం 4.99 లక్షలకే పొందవచ్చు. 17.3kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 230 కిలోమీటర్ల ఆరై రేంజ్ అందిస్తుంది. 7.4 kw చార్జర్‌తో దీనిని 3.5 గంటల్లో పూర్తి ఛార్జ్ చేయవచ్చు. లోపల డ్యూయల్‌ 1.025 ఇంచ్‌ స్క్రీన్‌లు, వైరలె్‌ అండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 

టాటా టియాగో ఈవీ 

బడ్జెట్‌ ధరలో పూర్తి స్థాయి ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి టాటా టియాగో ఈవీ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. దీని ధర 7.99 లక్షల నుంచి 11.14 లక్షల మధ్య ఉంటుంది. ఇది మీడియం రేంజ్ , లాంగ్ రేంజ్ అనే రెండు రకాలుగా లభిస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్‌ 315 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్‌లో ఇది నాలుగు స్టార్‌లను సాధించింది. ఇది బడ్జెట్‌ విభాగంలో సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. 

టాటా పంచ్‌ ఈవీ 

ఎస్‌యూవీ స్టైలింగ్ ఇష్టపడే వారికి టాటా పంచ్ ఈవీ ఒక మంచి ఎంపిక. 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మరిన్ని కొత్త ఫీచర్లో వచ్చింది. దీని ధర 9.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బాస్ ఆప్షన్ ఎంచుకుంటే 6. 49 లక్షలకే లభిస్తుంది. ఇందులో 30kWh, 40 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ 468 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది భారత్‌ ఎన్‌ క్యాప్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించి, భారత్‌లో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 

సిట్రోయెన్ eC3

సిట్రోయెన్ eC3 విశాలమైన క్యాబిన్, మెరుగైన రైడ్ క్వాలిటీకి పేరుగాంచింది. దీని లైవ్ వేరియంట్‌ సుమారు 10.30 లక్ష వద్ద అందుబాటులోకి రానుంది. ఇందులో 29.2kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 320 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ప్రధాన లోపం గ్లోబల్ ఎన్‌క్యాప్ లో 0స్టార్ రేటింగ్ రావడం. ఇది భద్రత విషయంలో ఆందోళనకు గురి చేసే అంశం. 

ఎలాంటి వినియోగదారులు ఏ వాహనాలను ఎంచుకోవాలి?

మీ ప్రయాణం రోజుకు 50 కిలోమీటర్ల లోపు ఉంటే ఎంజీ కామెట్ సరిపోతుంది. లాంగ్ డ్రైవ్ చేసే వారైతే టాటా పంచ్ ఈవీ లేదా టియాగో ఈవీ మంచిది. భద్రత, ఆల్‌రౌండర్ ప్రదర్శన కావాలనుకుంటే ఈ రెండు ఎంచుకోవచ్చు. నగరంలో సులభమైన డ్రవ్, టెక్నాలజీ కావాలనుకునే వారికి ఎంజీ కామెట్ సరైంది. కేవలం లోకల్ ప్రయాణాల కోసం వినూత్నమైన పరిషాకం కావాలనుకుంటే వాయ్‌ ఈవా చూడొచ్చు. 

మీ ఇంటి వద్ద ఆఫీసులో 15A సాకెట్ సౌకర్యం ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మెట్రో నగరాల్లో పబ్లిక్ పాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ విస్తరిస్తోంది. దాదాపు అన్ని కంపెనీలు బ్యాటరీ, మోటార్‌పై 8ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నాయి. 

Frequently Asked Questions

₹10 లక్షల లోపు భారతదేశంలో లభించే కొన్ని ఎలక్ట్రిక్ కార్లు ఏవి?

₹10 లక్షల లోపు భారతదేశంలో వినూత్న వాయ్ మొబిలిటీ ఈవా, ఎంజీ కామెట్ ఈవీ, టాటా టియాగో ఈవీ, మరియు టాటా పంచ్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాచ్ యూజ్ ఏ సర్వీస్ (Battery Use as a Service) అంటే ఏమిటి?

ఈ విధానంలో కారు ధర నుండి బ్యాటరీ ఖర్చును వేరు చేస్తారు. దీని ద్వారా కారును తక్కువ ధరకు కొని, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు కొంత మొత్తం చెల్లించవచ్చు.

రోజుకు 50 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు ఏ ఈవీ ఉత్తమమైనది?

రోజుకు 50 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు ఎంజీ కామెట్ ఈవీ ఒక మంచి ఎంపిక. ఇది నగర ప్రయాణాలకు, పార్కింగ్ సమస్యలు ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది.

భద్రత పరంగా టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఏవి?

భద్రత విషయంలో టాటా పంచ్ ఈవీ 5-స్టార్ రేటింగ్ తో, టాటా టియాగో ఈవీ 4-స్టార్ రేటింగ్ తో అత్యంత సురక్షితమైన కార్లుగా నిలిచాయి.

టాప్ హెడ్ లైన్స్

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget