Tata Motors: త్వరలో నాలుగు కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న టాటా - పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా!
ప్రముఖ కార్ల బ్రాండ్ టాటా తన కొత్త ఎస్‌యూవీలను త్వరలో లాంచ్ చేయనుంది.
Tata Motors New SUVs: టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా హ్యుందాయ్ మోటార్ ఇండియాను అధిగమించి దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. దీని కోసం కంపెనీ రాబోయే కొన్ని నెలల్లో కొత్త ట్రిమ్‌లు, ప్రత్యేక ఎడిషన్‌లు, ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌లతో కొన్ని మోడళ్లను విడుదల చేయనుంది.
కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన నాలుగు ఎస్‌యూవీలను అప్‌డేట్ చేయనుంది. టాటా నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ మిడ్ లైఫ్ అప్‌డేట్ చేయనుంది. ఇది కాకుండా టాటా రెండో బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన పంచ్‌లో సీఎన్‌జీ వేరియంట్, ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా విడుదల కానున్నాయి. ఇప్పుడు వీటి వివరాలు తెలుసుకుందాం.
టాటా పంచ్ సీఎన్‌జీ, ఈవీ
టాటా మోటార్స్ తన పంచ్ సీఎన్‌జీని వచ్చే నెలలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది టాటా డ్యూయల్ సిలిండర్ సీఎన్‌జీ టెక్నాలజీతో కూడిన 1.2 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. దీని సీఎన్‌జీ వేరియంట్ 72 బీహెచ్‌పీ పవర్, 102 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. 'i-CNG' బ్యాడ్జింగ్ దాని టెయిల్‌గేట్‌లో చూడవచ్చు. ఇది దాని ఐసీఈ మోడల్‌ను పోలి ఉంటుంది. పంచ్ ఈవీ వెర్షన్‌లో లోపల, వెలుపల చాలా మార్పులు కనిపిస్తాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల రేంజ్‌ను అందించవచ్చని అంచనా.
టాటా నెక్సాన్, నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్
కొత్త నెక్సాన్, నెక్సాన్ ఈవీలు మంచి డిజైన్‌తో పాటు చాలా కొత్త ఫీచర్లను పొందుతాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, కొత్త డీసీటీ గేర్‌బాక్స్‌ను పొందవచ్చు. ఈ ఇంజన్ 125 బీహెచ్‌పీ పవర్, 225 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టాటా కర్వ్ కాన్సెప్ట్ డిజైన్ తరహాలో ఈ ఎస్‌యూవీని డిజైన్ చేశారు.
టాటా హారియర్, సఫారీ ఫేస్‌లిఫ్ట్
టాటా కొత్త హారియర్ మరియు సఫారి ఫేస్‌లిఫ్ట్ లాంచ్ తేదీలు ఇంకా అనౌన్స్ అవ్వలేదు. అయితే ఈ ఏడాది దీపావళి సీజన్‌లో వీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు ఎస్‌యూవీలు కొత్త 1.5 లీటర్ టర్బో DI పెట్రోల్ ఇంజన్‌ను పొందుతాయి. ఇది బీఎస్6 స్టేజ్ II ఎమిషన్ రూల్స్‌కు అనుగుణంగా ఉంటుంది. ఇది 170 బీహెచ్‌పీ, 280 ఎన్ఎం అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేస్తుంది.
Creating a legacy of timeless design, Tata Motors launched the Tata Estate in 1992, which gained iconic status in the Indian automobile industry. Stay tuned for more interesting automotive trivia with #TataMotorsClassics. #TataMotors #ConnectingAspirations pic.twitter.com/VWfKVWXNx4
— Tata Motors (@TataMotors) July 26, 2023
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial