అన్వేషించండి

Tata Tiago vs Maruti Celerio: మొదటి ఉద్యోగంలో చేరినవాళ్లకు ఏ కారు బెస్ట్‌?, మైలేజ్‌, సేఫ్టీ మాటేమిటి?

Small Car Comparison India: టాటా టియాగో & మారుతి సెలెరియోలలో ఏ కారు ఎక్కువ పొదుపుగా ఉంటుంది & మెరుగైన మైలేజీని ఇస్తుంది? ఈ కార్ల ధర, లక్షణాలు & పనితీరు గురించి తెలుసుకుందాం.

Tata Tiago vs Maruti Celerio Comparison: టాటా టియాగో, షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, హనీకాంబ్‌ గ్రిల్‌ డిజైన్‌తో స్పోర్టీగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మారుతి సెలెరియో సింపుల్‌గా ఉన్నా మోడర్న్‌ లుక్‌తో, సాఫ్ట్‌ కర్వ్స్‌ కలిగిన బాడీ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. టియాగోలోని కాంట్రాస్ట్‌ కలర్‌ రూఫ్‌, స్టైలిష్‌ అలాయ్‌ వీల్స్‌ దానికి యూత్‌ఫుల్‌ ఫీలింగ్‌ ఇస్తాయి. సెలెరియోలోని కాంపాక్ట్‌ ప్రొపోర్షన్స్‌, క్లీన్‌ లైన్స్‌ నగర రోడ్లపై స్మార్ట్‌గా కనిపించేలా చేస్తాయి. ఈ రెండు కార్లు బెస్ట్‌ మైలేజీని ఇస్తాయి.

మీరు మీ మొదటి ఉద్యోగంలో చేస్తూ, తక్కువ ధరకు మంచి మైలేజీని ఇచ్చే కార్‌ కొనాలని చూస్తుంటే, టాటా టియాగో CNG లేదా మారుతి సెలెరియో CNG లో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఆ కార్ల ధర, ఫీచర్లు & మైలేజ్‌ వివరాలు తెలుసుకుంటే, మీకు  ఏ కారు సరైనదో మీరే ఈజీగా అర్ధం చేసుకోవచ్చు.

ధర
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో టాటా టియాగో CNG ధర దాదాపు రూ. 6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ. 8.75 లక్షల వరకు ఉంటుంది. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది - XE, XM, XT & XZ+, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్‌ ఒక ప్రత్యేకమైన ఆఫర్. మరోవైపు, మారుతి సెలెరియో CNG ఒకే ఒక వేరియంట్ (VXI)లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 6.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). 

ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది?
టాటా టియాగో CNG విషయంలో, కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ మాన్యువల్ మోడ్‌లో 26.49 కి.మీ./కిలో & ఆటోమేటిక్ మోడ్‌లో 28 కి.మీ./కిలో. అయితే, నిజ జీవితంలో డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇది సగటున 24–25 కిమీ/కిలో ఇస్తుంది. దీని అర్ధం ఏంటంటే, టాటా టియాగో సిటీ ట్రాఫిక్‌లో ఇంధనాన్ని పొదుపుగా వాడుకోగలదు. మరోవైపు, మారుతి సెలెరియో CNG క్లెయిమ్డ్‌ మైలేజ్ 35.60 కి.మీ./కిలో. ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్లతో పోలిస్తే సెలెరియో CNG ఇస్తున్న నంబర్‌ అన్నిటికంటే అధికం. ఈ కారు, ఇంధన సామర్థ్యం పరంగా టాటా టియాగో CNG కంటే చాలా ముందుంది. రోజువారీ ప్రయాణికులకు, ముఖ్యంగా ఇంధన ధరలు పెరిగిన ఈ తరుణంలో ఇది పెద్ద ప్రయోజనం అవుతుంది.

ఫీచర్లు & ఇంటీరియర్
టాటా టియాగో CNG చాలా ఫీచర్లతో కూడిన కారు. దీనికి LED DRLsతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ వంటి ఉన్నాయి. ఇంకా, ట్విన్-సిలిండర్ టెక్నాలజీ కారణంగా బూట్ స్పేస్ ఇతర CNG కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. మారుతి సెలెరియో CNG లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పుష్-బటన్ స్టార్ట్ & పవర్ విండోస్‌ ఉన్నాయి, ఇవి డ్రైవింగ్‌లో మోడర్న్‌ టచ్‌ను అందిస్తాయి. అయితే, దీనికి AMT ఎంపిక లేదు లేదా బూట్ స్పేస్ కూడా టియాగో లాగా సౌకర్యవంతంగా ఉండదు.

భద్రత పరంగా ఏ కారు ఎక్కువ సురక్షితం?
భద్రత పరంగా, టాటా టియాగో CNG కారు గ్లోబల్ NCAP నుంచి 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, వెనుక కెమెరా, CNG లీక్ డిటెక్షన్ సిస్టమ్ & మైక్రో-స్విచ్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. మారుతి సెలెరియో CNG లో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇస్తున్నారు, ఇది పెద్ద అప్‌గ్రేడ్. అయితే, దాని క్రాష్ టెస్ట్ రికార్డ్ టియాగో తరహాలో బలంగా లేదు. అందువల్ల, సురక్షితమైన డ్రైవింగ్ పరంగా టియాగో ఇప్పటికీ ఒక అడుగు ముందుంది.

సేఫ్టీ ఫీచర్లు, ఇంటీరియర్‌, మైలేజ్‌, లుక్స్‌ను బట్టి మీ అవసరానికి ఏ కారు తగినదో మీరు ఊహించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Embed widget