అన్వేషించండి

Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?

Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ స్మార్ట్19, ప్యూర్‌ ప్లస్ 19 వేరియంట్ల మధ్య ధర, ఫీచర్లు, టెక్నాలజీ వ్యత్యాసాలు విశ్లేషిస్తూ సరైన కారు ఏదో తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టియాగో EV స్మార్ట్ 19, ప్యూర్ ప్లస్ 19 మధ్య ధర, ఫీచర్లలో తేడా.
  • ఇంజిన్, రేంజ్ ఒకటే, ప్యూర్ ప్లస్‌లో ఆధునిక ఫీచర్లు.
  • ప్యూర్ ప్లస్‌ టచ్‌స్క్రీన్, పవర్ విండోస్, వెనుక కెమెరా అదనం.
  • నగర ప్రయాణాలకు స్మార్ట్ 19, సౌకర్యాలకు ప్యూర్ ప్లస్.

Tiago EV Smart 19 vs Pure Plus 19: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ విప్లవం వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని టాటా మోటార్స్ ప్రవేశ పెట్టిన టియాగో ఈవీ ఈ మార్కెట్‌లో ఒక సంచలనం. అయితే ఈ కారులో ఏ వేరియంట్‌ కొనుగోలు చేయాలని విషయంలో చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. ముఖ్యంగా బేస్ వేరియంట్‌ అయిన స్మార్ట్19, దాని తర్వాతి వెర్షన్ ప్యూర్‌ ప్లస్‌ 19 మధ్య ఏది ఉత్తమం. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడాలేంటీ? అనే అంశాలను లోతుగా చూద్దాం. 

ధర వ్యత్యాసం, ఏది మీ జేబుకు భారం?

టాటా టియాగో ఈవీ ధరల విషయానికి వస్తే, ఈ రెండు వేరియంట్ల మధ్య గణనీయమైన తేడా ఉంది. టాటా డియాగో ఈవీ స్మార్ట్ 6.99 లక్షలు, టాటా టియాగో ఈవీ ప్యూర్‌ ప్లస్‌ 19 8.49 లక్షలు అంటే కేవలం ఫీచర్ల కోసం మీరు అదనంగా 1.5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ అదనపు ధరతో మీకు లభించే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. 

Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?

ఒకే ఇంజిన్- ఒకటే పవర్

సాంకేతికపరంగా ఈ రెండు వేరియంట్లలో ఎలాంటి మార్పులు లేవు. రెండింటిలోనూ ఒకే రకమైన బ్యాటరీ ప్యాక్, మోటార్‌ను ఉపయోగించారు. 19.2kWh బ్యాటరీ సామర్థ్యంతో 61.18hp, గరిష్ట టార్క్‌ 110Nm, కలిగి ఉంటుంది. పర్మనెంట్ మాగ్నెట్‌ సింక్రోనస్‌ మోటార్‌ వాడారు. ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ లే అవుట్‌తో వస్తోంది. ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ కలిగి ఉంది. 

Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?

రేంజ్‌, ఛార్జింగ్‌లో తేడాలు?

ఎలక్ట్రిక్‌్ కార్ల కొనుగోలుదారులు ప్రధానంగా చూసేది రేంజ్, స్మార్ట్‌ 19, ప్యూర్‌ ప్లస్‌ 19 వేరియంట్లు రెండూ ఒకే రకమైన రేంజ్‌ను అందిస్తాయి. ఈ రెండు కూడా 226 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చారు. 3.3kW AC ఛార్జర్‌తో పది నుంచి 100శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 6.9 గంటలు పడుతుంది. ఈ రెండు కార్లలోనూ మల్టిపుల్‌ డ్రైవ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ ప్రయాణం అవసరాలకు అనుగుణంగా శక్తిని సర్దుబాటు చేస్తాయి. 

This may contain: an orange car is shown on a white background with no people in the image or description

ఫీచర్ల పోలిక 

నిజమైన వ్యత్యాసం ఫీచర్ల దగ్గరే మొదలవుతుంది. 1.5 లక్షల వ్యత్యాసంలో టాటా మోటార్స్ ప్యూర్‌ ప్లస్‌ 19లో అందించి అదనపు హంగులు ఉన్నాయి. 

స్మార్ట్ 19 ఈ వేరియంట్‌లో టువంటి ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌, స్పీకర్లు ఉండవు. ఇది కేవలం బేసిక్ మోడల్ మాత్రమే. ప్యూర్ ప్లస్ 19లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. దీంతోపాటు వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే సౌకర్యం ఉంది. అలాగే ప్రయాణంలో సంగీతం వినడానికి 4 స్పీకర్లు, మొబైల్ ఛార్జింగ్ కోసం 2 టైప్‌ సీ యూఎస్‌బీ పోర్టులు అందించారు. 

This may contain: a small blue car is shown on a white background

స్మార్ట్ 19లో పవర్‌ విండోస్ సౌకర్యం గురించి స్పష్టత లేదు. కానీ ప్యూర్ ప్లస్ 19లో ముందు, వెనుక రెండు వైపులా పవర్‌ విండోస్ లభిస్తాయి. స్మార్ట్ 19కేవలం స్టీల్‌ రిమ్స్‌తో వస్తుంది. కానీ ప్యూర్ ప్లస్ 19లో వీల్ కవర్లతో కూడిన స్టీల్ రిమ్స్‌ ఉంటాయి. ప్యూర్ ప్లస్‌ 19లో స్టైలిష్ షార్క్ ఫిన్ యాంటెన్నా ఉంటుంది. ఇది స్మార్ట్ 19లో లేదు. 

భద్రతలో తేడా ఏంటీ?

భద్రత విషయంలో టాటా ఎప్పుడూ రాజీ పడదు. ఈ రెండు వేరియంట్లలోనూ కొన్ని కీలకమైన సేఫ్టీ ఫీచర్లు సమానంగా ఉన్నాయి.  రెండు వేరియంట్లలోనూ ఉంది. పార్కింగ్‌ సెన్సార్లు వెనుకవైపు పార్కింగ్‌ సెన్సార్లు రెండింటిలోనూ ఉన్నాయి. టైర్లలో గాలి తక్కువగా ఉంటే వార్నింగ్ ఇచ్చే సిస్టమ్‌ రెండు మోడళ్లలోనూ అందుబాటులో ఉంది. ప్యూర్‌ ప్లస్‌ 19లో అదనంగా రియర్ పార్కింగ్‌ కెమెరా లభిస్తుంది. ఇది కారు రివర్స్ తీసేటప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డైమెన్షన్స్‌, సస్పెన్షన్ విషయంలో రెండు వేరియంట్ల బాడీ స్ట్రక్చర్‌, కొలతలు పూర్తి సమానంగా ఉంటుంది. 

మీరు కేవలం సిటీ ప్రయాణాల కోసం, తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు కావాలనుకుంటే స్మార్ట్ 19 మంచి ఎంపిక, కానీ, కారులో కూర్చొన్నప్పుడు ఆధునిక ఫీచర్లు, మంచి మ్యూజిక్‌ సిస్టమ్‌, రివర్స్‌ కెమెరా వంటి సౌకర్యాలు కావాలనుకుంటే ప్యూర్‌ ప్లస్‌ 19 కోసం అదనపు డబ్బు వెచ్చించడం సరైన నిర్ణయం అవుతుంది. 

టాటా టియాగో ఈవీ స్మార్ట్ 19 ఒక పొదుపుగా ఉండే ఎలక్ట్రిక్ కారు, అయితే ప్యూర్ ప్లస్‌ 19 అనేది సౌకర్యం, సాంకేతికత కలగలిసిన ప్యాకేజీ, మీ ప్రాధాన్యత కేవలం ప్రయాణం అయితే స్మార్ట్ 19ని, ప్రయాణంతోపాటు అనుభూతి కూడా ముఖ్‌యం అనుకుంటే ప్లూర్‌ ప్లస్‌ 19ని ఎంచుకోండి. 

Frequently Asked Questions

టాటా టియాగో ఈవీ స్మార్ట్ 19 మరియు ప్యూర్ ప్లస్ 19 మధ్య ధర ఎంత వ్యత్యాసం ఉంది?

స్మార్ట్ 19 ధర 6.99 లక్షలు, ప్యూర్ ప్లస్ 19 ధర 8.49 లక్షలు. ఈ రెండు వేరియంట్ల మధ్య 1.5 లక్షల వ్యత్యాసం ఉంది.

టియాగో ఈవీ స్మార్ట్ 19 మరియు ప్యూర్ ప్లస్ 19 వేరియంట్లలో ఇంజిన్, బ్యాటరీ లేదా రేంజ్ తేడాలు ఉన్నాయా?

లేదు, ఈ రెండు వేరియంట్లలో ఒకే ఇంజిన్, బ్యాటరీ, మరియు 226 కిలోమీటర్ల రేంజ్ ఉన్నాయి. సాంకేతికంగా రెండూ సమానమైన పనితీరును అందిస్తాయి.

టియాగో ఈవీ స్మార్ట్ 19 మరియు ప్యూర్ ప్లస్ 19 మధ్య ప్రధాన ఫీచర్ల తేడాలు ఏమిటి?

ప్యూర్ ప్లస్ 19లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, 4 స్పీకర్లు, పవర్ విండోస్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ 19లో ఇవి ఉండవు.

ఏ అవసరాల కోసం ఏ టియాగో ఈవీ వేరియంట్‌ను ఎంచుకోవాలి?

తక్కువ ధరలో ప్రాథమిక అవసరాల కోసం స్మార్ట్ 19 మంచిది. ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన ప్రయాణం కావాలంటే ప్యూర్ ప్లస్ 19 ఎంచుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget