Tata Facelift Cars: రెండు కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్స్‌ను లాంచ్ చేయనున్న టాటా - ఏమేం రానున్నాయి?
Tata New Cars: టాటా మోటార్స్ తన పంచ్, అల్ట్రోజ్ కార్ల ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్లను త్వరలో లాంచ్ చేయనుందని సమాచారం.
Tata Punch and Altroz Facelift: మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి టాటా మోటార్స్ రాబోయే సంవత్సరాలలో వివిధ విభాగాలలో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఈ ప్లాన్‌లో ఫేస్‌లిఫ్ట్, స్పెషల్ ఎడిషన్, కొత్త ఎస్‌యూవీ, ఈవీ ఉన్నాయి. గత సంవత్సరం కంపెనీ నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ ఎస్‌యూవీలను విడుదల చేసింది. ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ 2024లో విడుదల కానుంది. ఇది కాకుండా 2025లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్
టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ 2019లో మొదటిసారి లాంచ్ అయింది. ఇప్పుడు ఈ కారు మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను పొందనుంది. కొత్త మోడల్‌లో చిన్నపాటి బ్యూటీ ఛేంజెస్, అనేక కొత్త ఫీచర్లు లభిస్తాయని భావిస్తున్నారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.
ఆరు ఎయిర్ బ్యాగ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. డిజైన్ మార్పులు టాటా లేటెస్ట్ కార్ల డిజైన్ల నుంచి ఇన్‌స్పైర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం టాటా అల్ట్రోజ్ రేసర్ ఎడిషన్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఇది హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్‌కు పోటీగా ఉంటుంది. ఈ మోడల్ టాటా కొత్త 125 బీహెచ్‌పీ, 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఉండనుంది. టాటా ఆల్ట్రోజ్ ఈవీని 2025లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ అప్‌డేట్ చేసిన నెక్సాన్, హారియర్, సఫారీ ఎస్‌యూవీల తరహాలో ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో డిజైన్ మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది, ఇందులో అప్‌డేట్ చేసిన గ్రిల్, బంపర్, స్మూత్ డీఆర్ఎల్స్ ఉన్నాయి. ఈ అప్‌డేటెడ్ మోడల్‌తో కంపెనీ అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది.
దీని ఇంజిన్‌లో ఎటువంటి ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశం లేదు. కొత్త పంచ్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది కాకుండా సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
మరోవైపు సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ సేల్ వచ్చే వారం నుంచి దేశీయ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కేవలం రూ. 25,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ డెలివరీ కూడా వచ్చే కొద్ది నెలల్లోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇక ధర గురించి చెప్పాలంటే మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌తో పోలిస్తే సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ ధర దాదాపు రూ. లక్ష వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!