అన్వేషించండి

Tata Nexon vs Maruti Brezza: ధర, భద్రత, మైలేజ్‌ పరంగా ఏ కారు బెస్ట్‌? - బడ్జెట్‌ రూ.10 లక్షలే!

Best SUV Under 10 Lakhs: మారుతి బ్రెజ్జా మెరుగైన మైలేజీ ఇవ్వగలదు. టాటా నెక్సాన్ బలం & భద్రత పరంగా భేషైన కారు అని భావిస్తారు.

Tata Nexon vs Maruti Brezza Comparison: మారుతి సుజుకీ, తన కాంపాక్ట్‌ SUV బ్రెజ్జాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణిక భద్రతగా అప్‌డేట్ చేసింది, గత నెలలో ఈ మార్పును ప్రారంభించింది. అంటే, మారుతి బ్రెజ్జాలో ఏ వేరియంట్‌ అయినా కచ్చితంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతోనే తయారవుతుంది. కాబట్టి, ఈ కారు బేస్ వేరియంట్‌లో కూడా పూర్తి భద్రత లభిస్తుంది. భారతీయ మార్కెట్లో, మారుతి సుజుకి బ్రెజ్జా నేరుగా పోటీ పడే కార్లలో టాటా నెక్సాన్‌ ఒకటి.

మారుతి కారు అంటేనే మెరుగైన మైలేజీకి ప్రసిద్ధి, బ్రెజ్జా కూడా ఇందుకు మినహాయింపు కారు. టాటా కార్లు బలానికి & భద్రతకు మారుపేరు, నెక్సాన్‌ దీనికి ఒక ఉదాహరణ. ఈ రెండు కార్లు రూ. 10 లక్షల పరిధిలోనే వస్తాయి, మీ బడ్జెట్‌ పెంచవు. మీరు ఈ రెండు కార్లలో దేనినైనా కొనాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా, ఈ రెండు కార్ల భద్రత, పనితీరు & మైలేజ్ గురించి తెలుసుకోండి.

హైదరాబాద్‌ & విజయవాడలో ధర
హైదరాబాద్‌లో, టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర (Tata Nexon ex-showroom price) రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమై, టాప్‌-వేరియంట్‌కు రూ. 15.60 లక్షల వరకు ఉంటుంది. దీనికి RTO ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలిపితే, టాటా నెక్సాన్ ఆన్‌-రోడ్‌ రేటు ( on-road price) రూ. 9.54 లక్షల నుంచి రూ. 19.08 లక్షల మధ్య ఉంటుంది. మారుతి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర (Maruti Brezza ex-showroom price) రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ. 16.26 లక్షల వరకు ఉంటుంది. అన్ని పన్నులు, ఛార్జీలు కలుపుకుని దీని ఆన్‌-రోడ్‌ రేటు ( on-road price) రూ. 10.29 లక్షల నుంచి రూ. 17.18 లక్షల వరకు ఉంటుంది. విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ స్వల్ప తేడాలతో దాదాపు ఇవే ధరలు కనిపిస్తాయి.

భద్రత
గ్లోబల్ NCAP నుంచి, క్రాష్ టెస్ట్‌లలో టాటా నెక్సాన్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. మారుతి బ్రెజ్జా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందింది. టాటా నెక్సాన్ 382 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. బ్రెజ్జా 328 లీటర్ల బూట్ స్పేస్‌తో వచ్చింది.

టాటా నెక్సాన్ & మారుతి బ్రెజ్జా మైలేజ్ 
టాటా నెక్సాన్ హైబ్రిడ్ కారు కాదు. కానీ.. ఈ కారు పెట్రోల్, డీజిల్ & CNG పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ టాటా కారులో 1.2-లీటర్ టర్బోచార్జ్‌డ్‌ రెవోట్రాన్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 88.2 PS పవర్‌ను & 1,750 నుంచి 4,000 rpm వద్ద 170 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, టాటా నెక్సాన్ లీటరుకు 17 నుండి 24 km మైలేజీ (Tata Nexon mileage) ఇస్తుంది.

మారుతి బ్రెజ్జా ఒక హైబ్రిడ్ కారు. ఈ కారు K15 C పెట్రోల్ + CNG (బై-ఫ్యూయల్‌) ఇంజిన్‌తో వస్తుంది, కాబట్టి ఈ కాంపాక్ట్‌ SUVని పెట్రోల్ & CNG మోడ్స్‌లో నడపవచ్చు. ఈ కారులో అమర్చిన ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 6,000 rpm వద్ద 100.6 PS పవర్‌ను & 4,400 rpm వద్ద 136 Nm టార్క్‌ను ఇస్తుంది. CNG మోడ్‌లో, ఈ కారు 5,500 rpm వద్ద 87.8 PS పవర్‌ను & 4,200 rpm వద్ద 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, మారుతి బ్రెజ్జా 25.51 km/kg మైలేజీ (Maruti Brezza mileage) ఇస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Avatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?
KTR Comments on Pocharam: ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇలాంటి బతుకు కంటే చనిపోవడమే మేలు - పోచారంపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Embed widget