Budget Automatic Cars: టాటా నెక్సాన్ నుంచి ఫ్రాంక్స్ వరకు - దేశంలో అత్యంత చౌకైన పెట్రోల్ ఆటోమేటిక్ కార్లు
Best Petrol Automatic Cars: పెట్రోల్ ఇంజిన్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే కొన్ని కార్ల గురించి ఈ కథనంలో మీకు చెప్పబోతున్నాం. వాటి ధర కేవలం రూ. 7.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Affordable Petrol AMT Cars Under 10 lakhs: ఈ రోజుల్లో, కారు తీసుకుని రోడ్డెక్కితే వాహనాల రద్దీ భారీగా ఉంటోంది. ఏ సమయంలో చూసినా భారతీయ రోడ్ల మీద ఎక్కువ ట్రాఫిక్ కనిపిస్తూనే ఉంటోంది. ఈ ట్రాఫిక్ మధ్య సజావుగా నడపగలిగే కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ తలనొప్పి నుంచి తప్పించుకునేందుకు, ప్రజలు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న వాహనాలనే ఎక్కువగా కొంటున్నారు. పెట్రోల్ ఇంజిన్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే కొన్ని వాహనాలు ప్రస్తుతం మన మార్కెట్లో తక్కువ ధరకే ధరకు లభిస్తున్నాయి.
చౌకైన పెట్రోల్ ఆటోమేటిక్ కార్లు
టాటా నెక్సన్ (Tata Nexon)
మొదటి కారు టాటా నెక్సాన్. ఇది, దాని విభాగంలో అత్యంత విశ్వసనీయమైన SUVగా కస్టమర్లు పరిగణిస్తున్నారు. హైదరాబాద్‌లో, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర (Tata Nexon x-showroom price) రూ. 8 లక్షల నుంచి రూ. 15.60 లక్షల వరకు ఉంటుంది. ఆన్-రోడ్ ధర (on-road price) రూ. 9.54 నుంచి రూ. 19.08 లక్షల వరకు ఉంటుంది. టాటా నెక్సన్‌కు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 17.18 కిలోమీటర్ల వరకు మైలేజీని (Mileage) ఇవ్వగలదు. ఈ SUV BNCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.
కియా సోనెట్ (Kia Sonet)
రెండో ఫోర్-వీలర్ 'కియా సోనెట్'. హైదరాబాద్‌లో, దీని ధర (Kia Sonet ex-showroom price) రూ. 8 లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.77 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఆన్-రోడ్ ధర (on-road price) దాదాపు రూ. 9.51 లక్షల నుంచి రూ. 19.18 లక్షల వరకు ఉంటుంది. కియా సోనెట్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పవర్ పొందుతుంది. ఇది ఆటోమేటిక్ మోడ్‌లో లీటరుకు 19.2 కి.మీ. వరకు మైలేజీ (Mileage) ఇస్తుంది. ఈ కారులో... 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ABS, EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్ & లెవెల్ 1 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి.
మహీంద్రా XUV 3XO (Mahindra XUV 3XO)
లిస్ట్‌లో మూడో కారు 'మహీంద్రా XUV 3XO'. ఈ SUVలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. బలమైన బాడీ నిర్మాణం దీని స్పెషాలిటీ. హైదరాబాద్‌లో, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర (Mahindra XUV 3XO ex-showroom price) రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.80 లక్షల వరకు ఉంటుంది. ఆన్-రోడ్ ధర (on-road price) రూ. 9.69 లక్షల నుంచి రూ. 19.61 లక్షల మధ్య ఉంటుంది. మహీంద్రా XUV 3XO కి 1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఆటోమేటిక్ వెర్షన్‌లో, ఇది లీటరుకు 18.2 కి.మీ. వరకు మైలేజీ (Mileage) ఇవ్వగలదు. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
ఈ కారు, తన విభాగంలో, పెట్రోల్‌ను అత్యంత పొదుపుగా వాడే ఆటోమేటిక్ కారు. హైదరాబాద్‌లో, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధర (Maruti Suzuki Fronx ex-showroom price)రూ. 7.55 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.06 లక్షల వరకు ఉంటుంది. ఆన్-రోడ్ ధర (on-road price) రూ. 9.07 లక్షల నుంచి రూ. 16.05 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు ఆటోమేటిక్ మోడ్‌లో 20.01-22.89 kmpl మైలేజీ (Mileage) ఇవ్వగలదు.





















