Tata Cars: నెక్సాన్‌ను దాటేస్తున్న పంచ్ - అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా కార్లు!
Tata Car Sales: కార్ల అమ్మకాల్లో టాటా నెక్సాన్‌ను పంచ్ నిదానంగా అధిగమిస్తూ సాగుతోంది.
Tata SUVs: టాటా మోటార్స్ ఎస్‌యూవీలు భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టాటాకు సంబంధించిన రెండు ఎస్‌యూవీలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. టాటా నెక్సాన్, టాటా పంచ్ అమ్మకాలలో కంపెనీ భారీ పెరుగుదలను చూస్తున్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఈ రెండు ఎస్‌యూవీల యొక్క అన్ని వేరియంట్‌లకు మంచి డిమాండ్ నెలకొంది. ఇవి మంచి లుక్స్, ఫీచర్లతో మార్కెట్‌లో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందాయి.
టాటా పంచ్, టాటా నెక్సాన్ అమ్మకాలు చాలా బలంగా ఉన్నాయి. ఇతర కంపెనీల కంటే టాటా ఎస్‌యూవీలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 2024 జనవరి నెలలో టాటా పంచ్ 17,978 యూనిట్లు అమ్ముడుపోయింది. టాటా నెక్సాన్ 17,182 యూనిట్లను ప్రజలు కొనుగోలు చేశారు. టాటా పంచ్ ఎస్‌యూవీపై టాటా మోటార్స్ 50 శాతం లాభాన్ని ఆర్జించింది. కాగా కంపెనీ టాటా నెక్సాన్ ధరను 10 శాతం పెంచింది.
టాటా మోటార్స్ లాంచ్ చేసిన టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో చేరింది. వీటిలో పెట్రోల్ వేరియంట్‌లను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.13 నుంచి రూ.10.20 లక్షల మధ్య ఉంది. టాటా నెక్సాన్ సబ్ 4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.15 లక్షల నుంచి రూ. 14.80 లక్షల మధ్య ఉంది.
టాటా పంచ్ ఈవీ వేరియంట్ ధర
టాటా పంచ్ ఈవీకి సంబంధించి మొత్తం 20 వేరియంట్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టాటా పంచ్ 315 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 13.79 లక్షల వరకు ఉంది. 421 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.99 లక్షల నుంచి మొదలై రూ. 15.49 లక్షల వరకు ఉంది.
టాటా నెక్సాన్ ఈవీ వేరియంట్ ధర
ఈవీ కార్లలో 325 కిలోమీటర్ల రేంజ్ అందించే వాహనాలు స్టాండర్డ్ కార్ల జాబితాలో వస్తాయి. ఈ రేంజ్ అందించే వాహనాల ధరలు రూ.14.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల మధ్య ఉన్నాయి. అలాగే 465 కిలోమీటర్ల రేంజ్ ఉన్న వాహనాల ఎక్స్ షోరూమ్ ధర రూ.16.99 లక్షల నుండి రూ.19.29 లక్షల వరకు ఉంది.
టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.10 లక్షల నుంచి రూ. 15.60 లక్షల మధ్య ఉంది. టాటా పంచ్ సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.23 లక్షల నుంచి రూ. 9.85 లక్షల వరకు ఉంటుంది.
మరోవైపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన అప్‌డేటెడ్ పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్ఎస్200లను భారతదేశంలో లాంచ్ చేసింది. వీటిలో పల్సర్ ఎన్ఎస్160 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.46 లక్షలుగానూ, పల్సర్ ఎన్ఎస్200 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.55 లక్షలుగానూ నిర్ణయించారు. ఈ అప్‌డేట్‌తో పాత ఎన్ఎస్ లైనప్‌కి తాజా స్టైలింగ్, కొత్త ఎల్సీడీ డాష్ రూపంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా చేశారు. కొత్త ఎల్సీడీ డాష్ బోర్డు బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.