Tata Nexon iCNG టాటా నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్ విడుదల.. ఆ పవర్‌ట్రైన్‌తో వచ్చిన తొలి కారు ఇదే!
Tata Nexon iCNG Launch టాటా నెక్సాన్ సీఎన్‌జీని ఆ సంస్థ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర కేవలం రూ. 8.99 లక్షలు మాత్రమే. ఇది కిలో సీఎన్‌జీ 24 కి.మీ మైలేజీని అందించనుంది.
Tata Nexon iCNG Launch: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన కార్లు హై సేఫ్టీ, భారీ ఫీచర్లతో అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా సరికొత్త అప్‌డేట్స్‌తో కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా కంపెనీ నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్‌ని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారుని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. తాజాగా దీనిని నేడు మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇక దీని డిజైన్ అందరికీ సుపరచితమే. ఈ సీఎన్‌జీని టెస్ట్‌డ్రైవ్ నిర్వహిస్తుండగా అనేకసార్లు రోడ్లపై కనిపించింది.
అయితే ఈ టాటా సరికొత్త సీఎన్‌జీ కారుకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కారుని టాటా మోటార్స్ దేశంలోనే తొలిసారిగా టర్బోఛార్జ్డ్ ఇంజిన్ తీసుకువచ్చింది. ఈ టాటా నెక్సాన్ ప్రస్తుతం ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, సాంప్రదాయ ఇంధన ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక టాటా విడుదల చేసిన సీఎన్‌జీ 8 వేరియంట్స్‌లో విడుదల చేసింది. ఈ సీఎన్‌జీ రూ .8 లక్షల 99 వేల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా కంపెనీ ప్రవేశపెట్టింది. ఇక ఇందులో స్మార్ట్ (ఓ), స్మార్ట్+, స్మార్ట్+ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్+, ఫియర్లెస్+ PS అనే వేరియంట్స్ ఉన్నాయి. దీని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ .14 లక్షల 59 వేలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
టాటా మోటార్స్ మొట్టమొదటి టర్బోఛార్జ్డ్ సీఎన్‌జీ కారు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ కారు 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులోని టర్బో పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 170nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో సీఎన్‌జీతో నడిచే ఇంజిన్ 99 bhp శక్తిని, 170 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కిలో సీఎన్‌జీకి 24 కి.మీ మైలేజీని అందించనుంది.
ఫీచర్లు
నెక్సాన్ సీఎన్‌జీ డిజైన్ ముందు చెప్పిన విధంగా దాని ఇతర మోడళ్లను పోలి ఉంటుంది. నెక్సాన్ సీఎన్‌జీలోనూ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ పరంగా ఈ సీఎన్‌జీలో 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఎబిఎస్-ఇబిడి, ఆటో డిమ్మింగ్ IRVMs రియర్ డీ-ఫాగర్స్ ఉన్నాయి. ఈ టాటా నెక్సాన్ సీఎన్‌జీ గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఈ టాటా సీఎన్‌జీ కారు మార్కెట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జీతో పోటీపడుతుంది. దీని ధర పరంగా చూస్తే ఇది నేరుగా మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్లకు కూడా గట్టి పోటీి ఇస్తుంది.
కొత్త అప్‌డేట్స్‌తో టాటా నెక్సాన్
వీటితో పాటు టాటా నెక్సాన్‌ని సఫారీ, హారియర్‌లో అందించిన విధంగా డార్క్ రెడ్ వేరియంట్‌లో తీసుకువచ్చింది. డిజైన్ పరంగా కొత్త డార్క్ రెడ్ వేరియంట్ అద్భుతంగా కనిపిస్తుంది. నెక్సాన్ కారుని అప్ డేటెడ్ ఇంటీరియర్‌తో ఆకర్షణీయమైన లుక్‌తో కొనుగోలు చేయాలనుకుంటే దీనిని ట్రై చేయవచ్చు.
అంతే కాకుండా టాటా నెక్సాన్ ఈవీ ఇప్పుడు 45 కిలోవాట్ల పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీంతో ఈ భారీ బ్యాటరీతో వచ్చే నెక్సాన్ 489 కిలోమీటర్ల రేంజ్‌ని అందించనుంది. ఇక దీని రియల్ వరల్డ్‌లో 350-370 కిలోమీటర్ల రేంజ్‌ని అందించనుంది. ఈ నెక్సాన్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.99 లక్షలుగా ఉంది.
Also Read: బైక్స్ కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే సీఎన్‌జీ కార్లు- రోజువారి పనుల కోసం ది బెస్ట్!