Tata Sierra SUV :ప్రపంచ కప్ గెలిచినందుకు స్పెషల్ గిఫ్ట్! ప్రతి మహిళా క్రికెటర్‌కు టాటా సియెర్రా SUVని టాటా మోటార్స్ బహుమతి
Tata Sierra SUV :ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు కొత్త టాటా సియెర్రా SUV ని బహుమతిగా ఇస్తుంది టాటా మోటార్స్. నవంబర్ 25న విడుదల కానుంది.

Tata Sierra SUV : టాటా మోటార్స్ ఇటీవల ఒక ప్రత్యేకమైన ప్రకటన చేసింది. 2025 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టులోని ప్రతి క్రీడాకారిణికి తమ రాబోయే కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. మహిళా క్రీడాకారుల అద్భుతమైన ప్రదర్శన, వారి చారిత్రాత్మక విజయానికి గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరంగా తెలుసుకుందాం.
నవంబర్ 25న కొత్త టాటా సియెర్రా విడుదల
టాటా మోటార్స్ తన ఐకానిక్ SUV టాటా సియెర్రాను నవంబర్ 25న విడుదల చేయనుంది. ఈ SUV కంపెనీ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత అధునాతన, ఫీచర్-రిచ్ కారు అవుతుంది. ఇది మెరుగైన ఆధునిక బాహ్య రూపకల్పన, ప్రీమియం ఇంటీరియర్, లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది. కొత్త సియెర్రా మూడు డిజిటల్ స్క్రీన్లు, అద్భుతమైన సీటింగ్ సౌకర్యం, డ్రైవింగ్‌ను సులభతరం చేసే అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. టాటా మోటార్స్ ప్రకారం, ఈ SUV “సౌకర్యం- సౌలభ్యం” రెండింటినీ దృష్టిలో ఉంచుకుని తయారు చేసింది.
లగ్జరీ లుక్‌తో హై-టెక్ ఫీచర్లు
కొత్త టాటా సియెర్రా SUVని కంపెనీ అనేక ప్రీమియం, అధునాతన ఫీచర్లతో తయారు చేసింది. ఈ SUV డిజైన్ నుంచి ఫీచర్ల వరకు చాలా ప్రత్యేకమైనది. టాటా సియెర్రా మూడు డిస్‌ప్లే స్క్రీన్‌లను కలిగి ఉంటుంది. ఒకటి డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, రెండోది సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం, మూడోది ప్రయాణీకుల స్క్రీన్ కోసం. దీనితో పాటు, కారులో పనోరమిక్ సన్‌రూఫ్, LED హెడ్‌లైట్లు, JBL సౌండ్ సిస్టమ్ వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి.
కనెక్టివిటీ -సాంకేతిక లక్షణాలు
ఈ SUV 540-డిగ్రీల సరౌండ్ కెమెరా వ్యూ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ల సహాయంతో, డ్రైవర్‌కు మెరుగైన విజిబులిటీ ఉంటుంది. వైర్ల చిక్కులు లేకుండా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కల్పిస్తున్నారు. భద్రతా పరంగా టాటా సియెర్రా లెవెల్-2 ADAS (అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ABS, EBD, ESC, హిల్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనితో పాటు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కూడా ఇచ్చారు, ఇది ప్రయాణంలో భద్రతను మరింత మెరుగుపరుస్తుంది.
ప్రతి క్రీడాకారిణికి సియెర్రా టాప్ మోడల్ లభిస్తుంది
ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టులోని ప్రతి క్రీడాకారిణికి టాటా సియెర్రా టాప్-ఎండ్ వేరియంట్ బహుమతిగా ఇస్తున్నారు. ఈ జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్నేహ రాణా, రేణుకా సింగ్, శ్రీచరణి, రాధా యాదవ్ వంటి 16 మంది క్రీడాకారులు ఉన్నారు. వీరందరూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్‌ను గర్వించేలా చేశారు. వారి కృషి, జట్టు స్ఫూర్తిని ప్రశంసిస్తూ టాటా మోటార్స్ ఈ ప్రత్యేక బహుమతిని అందించాలని నిర్ణయించింది.
టాటా మోటార్స్ ప్రకటన
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ MD, CEO శైలేష్ చంద్ర మాట్లాడుతూ, “భారత మహిళా క్రికెట్ జట్టు తమ అసాధారణ ప్రదర్శనతో దేశం మొత్తానికి పేరు తెచ్చింది. ఈ లెజెండ్ క్రీడాకారులకు మా కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా ఇస్తున్నందుకు మేము గర్విస్తున్నాము. ఇది వారి ధైర్యం, అంకితభావం, విజయాలకు ఇదే మా గుర్తింపు.” అని పేర్కొన్నారు.





















