Tata Onam Offers: టాటా కార్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ - అన్ని కార్లపై భారీ తగ్గింపులు!
ఓనం సందర్భంగా టాటా తన కార్లపై భారీ తగ్గింపును అందించింది.
Tata Motors Onam Festival Offers: టాటా మోటార్స్ ఓనం పండుగ సందర్భంగా తన ప్యాసింజర్ వెహికిల్ లైనప్‌లో అద్భుతమైన ఆఫర్‌లు అందించింది. కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మార్కెట్‌లలో ఒకటిగా పరిగణించి, కంపెనీ రూ.80 వేల వరకు తగ్గింపులను అందిస్తోంది. దాని ఐసీఈ, ఈవీ లైనప్‌లో ఉన్న కార్లు, ఎస్‌యూవీలు రెండింటిపై ఆఫర్ అందుబాటులో ఉంది.
కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి, టాటా మోటార్స్ టాప్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లు (పీఎస్‌యూలు), ప్రైవేట్ బ్యాంకులు, ప్రాంతీయ ఫైనాన్షియర్‌లతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. కస్టమర్‌లు 100 శాతం ఆన్ రోడ్ ఫండింగ్ ఎనేబుల్‌తో సహా అత్యంత ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఎంపికలను పొందగలుగుతారు. ఇది కాకుండా టాటా మోటార్స్ "ఈఎంఐ హాలిడే" స్కీమ్‌ను కూడా తీసుకువస్తోంది. ఇది కస్టమర్‌లకు ‘బై నౌ పే లేటర్’ అనే సదుపాయాన్ని అందిస్తుంది. టాటా మోటార్స్ ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో చూద్దాం.
టాటా టియాగో
టియాగో అనేది టాటా లాంచ్ చేసిన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. టియాగోపై టాటా మోటార్స్ రూ. 50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా ఇతర ప్రమోషనల్ ఆఫర్‌లు కూడా ఉంటాయి.
టాటా టిగోర్
సబ్ కాంపాక్ట్ సెడాన్ అయిన టిగోర్ కూడా టియాగో మాదిరిగానే రూ.50 వేల వరకు తగ్గింపును పొందుతోంది. బడ్జెట్ ధరలో ఫీచర్ ప్యాక్డ్ సెడాన్ కోసం చూస్తున్న కస్టమర్లకు టిగోర్‌ను ఆకర్షణీయమైన ఎంపికగా మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
టాటా టిగోర్ ఈవీ
గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలపై అంటే టాటా టిగోర్ EVపై రూ. 80,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ వాహనానికి మారాలనుకునే వినియోగదారులకు ఇది చాలా ముఖ్యమైన ప్రోత్సాహకం అని చెప్పవచ్చు.
టాటా ఆల్ట్రోజ్
ఇది టాటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. దీని భద్రత ఫీచర్లు, సమకాలీన డిజైన్ ఇందులో ప్లస్ పాయింట్లు. కంపెనీ దీనిపై రూ. 40 వేల వరకు తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్‌తో దీని సెగ్మెంట్‌లో ఇది మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది.
టాటా పంచ్
టాటా మోటార్స్ నుంచి సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పంచ్‌పై కూడా రూ. 25 వేల వరకు తగ్గింపును పొందుతోంది. దీని వలన కొనుగోలు చేయడం మరింత సులభం అవుతుంది.
టాటా నెక్సాన్
టాటా ప్రసిద్ధ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి వరుసగా రూ. 24 వేలు, రూ. 35 వేలు తగ్గింపును పొందుతున్నాయి. దీంతో ఈ కారు కొనుగోలు చేసే వారికి మరిన్ని డబ్బులు మిగలనున్నాయి.
టాటా నెక్సాన్ ఈవీ
టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రైమ్‌పై రూ. 56,000 వరకు తగ్గింపు, ఎక్స్‌టెండెడ్ వారంటీతో సహా మ్యాక్స్‌పై రూ. 61 వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
టాటా హారియర్
టాటా హారియర్ ఒక స్టైలిష్, విలాసవంతమైన మిడ్ సైజ్ ఎస్‌యూవీ. ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ. 70 వేల వరకు ప్రయోజనాలను అందిస్తుంది. దీని కారణంగా టాటా హారియర్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.
టాటా సఫారీ
ఇది కంపెనీ లైనప్‌లో ఉన్న టాప్ ఎండ్ మోడల్. అలాగే ఇది సెవెన్ సీటర్ ఎస్‌యూవీ. టాటా సఫారీలో కూడా కస్టమర్లు రూ. 70 వేల వరకు ఆఫర్‌లను పొందవచ్చు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial