అన్వేషించండి

టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3.35 లక్షల వరకు భారీ తగ్గింపు.. ఈ నెలాఖరు వరకే అవకాశం

టాటా మోటార్స్, జూన్ 2026లో తన ఎలక్ట్రిక్ కార్లపై రూ.3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. Curvv EV, Harrier EV, Punch EV, Tiago EV & Nexon EV మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Tata electric cars discounts june 2026: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నవాళ్లకు టాటా మోటార్స్ భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ నెలలో (జూన్ 2026) తన పాపులర్‌ ఎలక్ట్రిక్ కార్లపై రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, స్క్రాపేజ్ ఆఫర్, లాయల్టీ బోనస్ & అదనపు ప్రోత్సాహకాల రూపంలో ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Curvv EV, Harrier EV, Punch EV, Tiago EV & Nexon EV మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తున్నాయి.

Tata Curvv EVపై అత్యధిక డిస్కౌంట్

టాటా Curvv EV ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్న మోడల్‌. ఎంపిక చేసిన నాన్-ఎక్స్ వేరియంట్లపై రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.3 లక్షల గ్రీన్ బోనస్‌తో పాటు రూ.30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. క్రియేటివ్్ వేరియంట్లపై రూ.2.85 లక్షల వరకు తగ్గింపు లభిస్తుండగా, Curvv EV X వేరియంట్లపై ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ & లాయల్టీ బోనస్‌లతో కలిపి రూ.65,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

పెర్ఫార్మెన్స్, బ్యాటరీ రేంజ్ & అధునాతన ఫీచర్ల కారణంగా Curvv EV తన సెగ్మెంట్‌లో విలువైన ఎంపికగా గుర్తింపు పొందింది. అయితే పొడవైన వ్యక్తులు వెనుక సీటులో కూర్చోవడం కాస్త అసౌకర్యంగా ఉండడం చిన్న లోపంగా చెప్పవచ్చు.

Tata Harrier EVపై రూ.2.75 లక్షల వరకు తగ్గింపు

టాటా హారియర్ ఈవీ అన్ని వేరియంట్లపైనా రూ.2.75 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ.75,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.1 లక్ష లాయల్టీ బోనస్ & అదనంగా మరో రూ.1 లక్ష ప్రయోజనం ఉన్నాయి.

హారియర్ ఈవీ రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్ & బలమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటుంది. అయితే బ్రేకింగ్ ఫీల్ మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tata Punch EVపై రూ.1.45 లక్షల వరకు ఆఫర్

ఔట్‌గోయింగ్ టాటా పంచ్ ఈవీ వేరియంట్లపై రూ.95,000 నుంచి రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లపై గరిష్టంగా రూ.1.45 లక్షల ప్రయోజనం ఉండగా, మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నారు. MR Smart వేరియంట్‌పై రూ.95,000 వరకు మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుంది.

టాటా పంచ్ ఈవీ శక్తివంతమైన పనితీరు, సౌకర్యవంతమైన రైడ్ & మంచి ఫీచర్లతో ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే వెనుక సీటు స్థలం కొంత తక్కువగా ఉండటం కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం.

Tata Tiago EVపై కూడా భారీ బెనిఫిట్స్

ఔట్‌గోయింగ్ టియాగో ఈవీపై రూ.65,000 నుంచి రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. LR XT వేరియంట్‌పై గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. ఇందులో అదనంగా రూ.50,000 ప్రత్యేక బెనిఫిట్ కూడా ఉంది. ఇతర లాంగ్ రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు, మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.65,000 వరకు తగ్గింపులు లభిస్తున్నాయి.

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి Tiago EV ఇప్పటికీ మంచి ఆప్షన్‌. రైడ్ కంఫర్ట్ & రిఫైన్‌మెంట్ పరంగా ఈ కారు మంచి పేరు సంపాదించింది.

Tata Nexon EVపై రూ.50,000 వరకు ఆఫర్

టాటా నెక్సాన్ ఈవీ సిరీస్‌పై రూ.50,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో రూ.15,000 గ్రీన్ బోనస్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ & రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే ఎక్స్ఛేంజ్ & స్క్రాపేజ్ ఆఫర్లను ఒకేసారి పొందే అవకాశం లేదు.

నెక్సాన్ ఈవీ ప్రీమియం ఇంటీరియర్, అధిక ఫీచర్లు & విశాలమైన క్యాబిన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఫిట్ అండ్ ఫినిష్ మరింత మెరుగుపడాల్సి ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు.

జూన్ నెలాఖరు వరకు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. నగరాన్ని బట్టి డిస్కౌంట్లు మారే అవకాశం ఉండటంతో కొనుగోలు ముందు సమీప టాటా డీలర్‌షిప్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget