Tata Altroz కు మరో గోల్డ్ మెడల్!, Nexon తో పోలిస్తే క్రాష్ టెస్ట్ స్కోర్లు ఎలా వచ్చాయో చూడండి
కొత్తగా నిర్వహించిన BNCAP టెస్ట్‌లో Tata Altroz 5 స్టార్ రేటింగ్ సాధించింది. Tata Nexon తో పోలిస్తే స్కోర్లు ఎలా ఉన్నాయో, ఫీచర్లు ఏవి బెటర్‌గా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Tata Altroz Vs Nexon - Which Is Safest Car: టాటా మోటార్స్ కార్లంటే భద్రతకు మరో పేరు అన్నట్టే. ఇప్పుడు ఆ పేరు మరింత బలపడింది. కొత్తగా నిర్వహించిన భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ (BNCAP Crash Test Scores) లో టాటా ఆల్ట్రోజ్ 5 స్టార్ రేటింగ్ సాధించి అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఫలితాలు వెలువడిన వెంటనే ఆటోమొబైల్ లవర్స్ మళ్లీ ఒక పోలిక మొదలుపెట్టారు- "ఆల్ట్రోజ్ బెస్టా లేక నెక్సాన్ బెస్టా?" అని.
ఆల్ట్రోజ్ స్కోర్లు
తాజాగా జరిగిన భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఆల్ట్రోజ్ మొత్తం 32 మార్కులకు 29.65 (29.65/32) స్కోర్ సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో కూడా బలంగా నిలిచి మొత్తం 49 మార్కులకు 44.90 (44.90/49) స్కోర్ దక్కించుకుంది. దీని అర్ధం, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఉన్న కార్లలో టాటా ఆల్ట్రోజ్ టాప్ ప్లేస్ దక్కించుకున్నట్టు.
నెక్సాన్ స్కోర్లు
టాటా నెక్సాన్ విషయానికి వస్తే... 29.41/32 అడల్ట్ ప్రొటెక్షన్ స్కోర్, 43.83/49 చైల్డ్ ప్రొటెక్షన్ స్కోర్ సాధించింది. అంటే, నెక్సాన్‌తో పోలిస్తే ఆల్ట్రోజ్ కాస్త మెరుగైన ఫలితాన్ని సాధించినట్టే. అయినప్పటికీ, ఈ రెండు కార్లూ 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి, ఇది టాటా మోటార్స్‌కు & టాటా కార్ ఫ్యాన్స్‌కు గర్వకారణం.
సేఫ్టీ ఫీచర్లు
టాటా ఆల్ట్రోజ్‌లో ఇప్పుడు ఆరు ఎయిర్ బ్యాగ్స్, ABS, ESC, 3-పాయింట్ సీట్‌బెల్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అదీ కాకుండా, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లు కేవలం సేఫ్టీనే కాదు, డ్రైవింగ్‌లో కూడా కంఫర్ట్ ఇస్తాయి.
ఆల్ట్రోజ్ vs కర్వ్ పోలిక
ఆశ్చర్యకరంగా, టాటా ఆల్ట్రోజ్ స్కోర్లు టాటా కర్వ్ (Tata Curvv) కంటే కూడా కాస్త మెరుగ్గా వచ్చాయి. కర్వ్‌కి 29.50/43.66 వచ్చినా, ఆల్ట్రోజ్ మాత్రం ఇంకాస్త బలంగా నిలిచింది. దీని వల్ల ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లలోనే కాదు, 4 మీటర్ల లోపు కార్లలోనూ (Sub-4 meters car) సేఫ్ వెహికల్‌గా పేరు సంపాదించుకుంది.
ఆల్ట్రోజ్ ప్రత్యేకత
తాజాగా లాంచ్ అయిన కొత్త ఆల్ట్రోజ్‌లో ఇంటీరియర్ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి. టూ-స్పోక్ స్టీరింగ్, పెద్ద టచ్ స్క్రీన్, 360 కెమెరా వంటివి యాడ్ అయ్యాయి. ఇంజిన్ ఆప్షన్స్‌లో 1.2 లీటర్ పెట్రోల్, CNG, 1.5 లీటర్ డీజిల్ ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంది.
భారతదేశంలో సేఫ్టీకి ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో టాటా ఆల్ట్రోజ్ 5 స్టార్ BNCAP రేటింగ్ సాధించడం పెద్ద విజయం. నెక్సాన్ కూడా బలంగా ఉన్నప్పటికీ, స్కోర్ల పరంగా ఆల్ట్రోజ్ కాస్త ముందుంది. హ్యాచ్‌బ్యాక్ కొనాలనుకునే వాళ్లకు ఇది నిస్సందేహంగా ఒక టాప్-పిక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఆల్ట్రోజ్ బెటర్‌గా అనిపిస్తుందా, లేక నెక్సాన్‌నా?.





















