Limited Period Offer: Ola Electric Scooter కేవలం ₹50,000కే - Honda Activa & TVS Jupiter కూడా పతనం
Ola Electric, ఓలా సెలబ్రేట్స్ ప్రచారంలో భాగంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభించింది. కేవలం 9 రోజుల పాటు, ఎంపిక చేసిన ఓలా స్కూటర్లు & బైక్‌లను ₹49,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంచింది.

Ola electric Ola Celebrates Offer 2025: ఈ పండుగ సీజన్‌లో, ఓలా ఎలక్ట్రిక్, తన కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకమైన ప్రకటన చేసింది. మంగళవారం (23 సెప్టెంబర్ 2025) నాడు, "Ola Celebrates India" అనే కొత్త ప్రచారాన్ని ఈ కంపెనీ ప్రారంభించింది. ఈ ప్రచారం కింద, ఎంపిక చేసిన ఓలా స్కూటర్లు & మోటార్ సైకిళ్లను రూ. 49,999 ప్రారంభ ధరకు అందిస్తుంది. ఇది పరిమిత కాలపు ఆఫర్, కేవలం తొమ్మిది రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23, 2025 నుంచి ప్రారంభమైంది.
పరిమిత యూనిట్లపై మొదట వచ్చిన వారికి మొదటి ఆఫర్లు
"ఓలా సెలబ్రేట్స్ ఇండియా" ప్రచారంలో ప్రకటించిన ఆఫర్ కింద రోజుకు పరిమిత సంఖ్యలో యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. ఈ యూనట్లను మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత కింద విక్రయిస్తారు. అదనంగా, కొన్ని "స్పెషల్ ముహూరత్ టైమ్ స్లాట్"లను ప్రతిరోజూ సోషల్ మీడియాలో ప్రకటిస్తుంది. ఇది కేవలం డిస్కౌంట్ పథకం మాత్రమే కాదని, ప్రతి భారతీయ ఇంటికి ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడమే లక్ష్యమని ఓలా పేర్కొంది.
ఓలా కొత్త లాంచ్‌లు & ప్రణాళికలు
ఓలా ఇటీవల నిర్వహించిన సంకల్ప్ ఈవెంట్ తర్వాత ఈ ఆఫర్ వచ్చింది. ఈ ఈవెంట్‌లో, కంపెనీ S1 Pro+ (5.2 kWh) & Roadster X+ (9.1 kWh) వంటి కొత్త వాహనాలను ఆవిష్కరించింది, ఈ నవరాత్రుల నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. అంతేకాదు, ఈ కంపెనీ రూ. 1,49,999 ధరతో కొత్త స్పోర్ట్స్ స్కూటర్, S1 Pro Sport ను కూడా లాంచ్ చేసింది, దీని డెలివరీలు 2026 జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి.
ఓలా ప్రస్తుత స్కూటర్ & బైక్‌లు
ప్రస్తుతం, ఓలా తన S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియో & రోడ్‌స్టర్ X మోటార్ సైకిల్ లైనప్ ద్వారా రూ. 81,999 నుంచి రూ. 1,89,999 వరకు, తన కస్టమర్లకు విస్తృత శ్రేణి ఎంపికలను అందిస్తోంది. ఈ పండుగ ఆఫర్ EV లపై కస్టమర్ ఆసక్తిని మరింత పెంచుతుందని & ఎలక్ట్రిక్ మొబిలిటీ స్వీకరణను వేగవంతం చేస్తుందని కంపెనీ విశ్వసిస్తోంది.
హోండా యాక్టివా & టీవీఎస్ జూపిటర్ కూడా చవక!
కొత్త జీఎస్‌టీ సంస్కరణల (GST Refirms 2025) అమలు తర్వాత పెట్రోల్ స్కూటర్ల ధరలు కూడా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో, Honda Activa 110 Standard ధర ఇప్పుడు రూ. 74,713 కి తగ్గింది, గతంలో రూ. 81,045గా ఉంది. ఇప్పుడు ఈ బండిని కొనే కస్టమర్లు నేరుగా రూ. 6,332 ఆదా చేస్తారు. TVS Jupiter ప్రారంభ ధర ఇప్పుడు రూ. 74,600గా ఉంది, గతంలో రూ. 81,211 నుంచి ప్రారంభమైంది. ఈ స్కూటర్‌ను 2025 జులైలో 1.24 లక్షలకు పైగా కొత్త కస్టమర్లు కొన్నారు, దేశంలో రెండో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా ఇది నిలిచింది.





















