News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వేరియంట్‌లో సన్‌రూఫ్ మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Tata Altroz ​​CNG: సన్‌రూఫ్ ఫీచర్ కొంతకాలం క్రితం వరకు కొన్ని ప్రీమియం కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ నెమ్మదిగా ఇది బడ్జెట్ సెగ్మెంట్ కార్లలో కూడా కనిపిస్తుంది. ఇటీవల టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ సీఎన్‌జీ మోడల్ లైనప్‌లో సన్‌రూఫ్‌ను పరిచయం చేసింది. దీంతో భారతదేశంలోనే ఈ ఫీచర్‌తో వస్తున్న అత్యంత చవకైన కారుగా నిలిచింది. టాటా ఆల్ట్రోజ్  సన్‌రూఫ్ ఎక్విప్డ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర ఇప్పుడు రూ. 7.90 లక్షల నుంచి రూ. 10.55 లక్షల వరకు ఉంది. ఇది ఎక్స్-షోరూం ధర. ఈ కారు మొత్తం 16 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

టాటా ఆల్ట్రోజ్ పవర్‌ట్రెయిన్
టాటా ఆల్ట్రోజ్ 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. దీని ఎన్ఏ, టర్బోచార్జ్డ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లు వరుసగా 86 bhp, 110 bhp, 90 bhp శక్తిని పొందుతాయి. ఇది ప్రామాణికంగా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని పొందుతుంది. 6-స్పీడ్ డీసీటీ ప్రామాణికంగా ఉండగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని సీఎన్‌జీ వేరియంట్ 77 bhp పవర్, 103 Nm టార్క్‌ను పొందుతుంది.

మారుతి బలెనోతో పోటీ పడుతోంది
ఈ కారు మారుతి సుజుకి బలెనోతో పోటీ పడుతోంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ కారులో సీఎన్‌జీ కిట్ ఆప్షన్ కూడా ఉంది.

టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ మోడల్ కూడా గతేడాది మనదేశంలో లాంచ్ చేశారు. దీని ధరను రూ.7.96 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. మిడ్ లెవల్ ఎక్స్‌టీ ట్రిమ్ ఆధారంగా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించారు.

ఈ కొత్త వేరియంట్‌తో పాటు పాత వేరియంట్లకు అప్‌డేట్స్‌ను కూడా టాటా అందించింది. టాప్ స్పెసిఫికేషన్లు ఉన్న టాటా అల్ట్రోజ్ డార్క్ ఎక్స్‌జెడ్+ ట్రిమ్ లెవల్‌కు కొత్త ఇంజిన్, అదనపు ఫీచర్లను అందించింది. టాటా అల్ట్రోజ్ ఎక్స్‌టీ డార్క్ పెట్రోల్ వేరియంట్ ధర, మామూలు పెట్రోల్ వేరియంట్ కంటే రూ.46 వేలు ఎక్కువగా ఉండనుంది.

కొత్త వేరియంట్‌లో కాస్మో బ్లాక్ కలర్ ఆప్షన్, హైపర్ స్టైల్ వీల్స్, డార్క్ బ్యాడ్జింగ్, పూర్తిగా బ్లాక్ ఇంటీరియర్ కలర్ థీమ్, లెదర్ సీట్లు, హైట్ అడ్జస్ట్ చేయదగిన డ్రైవర్ సీటు, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, వెనకవైపు హెడ్ రెస్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

Read Also: అదిరిపోయే ఫీచర్లు, సూపర్ స్టైలిష్ లుక్, టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన అల్ట్రోజ్ ఎక్స్‌టీ డార్క్ ఎడిషన్‌లో 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. దీంతోపాటు 1.2 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఇందులో ఉండనుంది. ఈ రెండిట్లోనూ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించారు.

ఇక అల్ట్రోజ్ ఎక్స్‌జెడ్+ డార్క్ ఎడిషన్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందించారు. అయితే ఈ కారు ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇందులో కూడా టాటా కొత్త ఫీచర్లను అందించింది. 

Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు విషయాలు చూసుకోకపోతే కష్టమే!

Published at : 02 Jun 2023 05:31 PM (IST) Tags: Tata Altroz Tata Altroz CNG Tata Altroz CNG Sunroof Tata Altroz New Cars Cheapest Sunroof Car in India

ఇవి కూడా చూడండి

Hyundai i20 N Line Sale: కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?

Hyundai i20 N Line Sale: కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?

Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?

Upcoming Electric SUVs: త్వరలో మనదేశంలో రానున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే - లిస్ట్‌లో ఏ కార్లు ఉన్నాయి?

Upcoming Electric SUVs: త్వరలో మనదేశంలో రానున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే - లిస్ట్‌లో ఏ కార్లు ఉన్నాయి?

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!