అన్వేషించండి

SUV vs MPV vs Sedan: మీ ఫ్యామిలీకి సరిపోయే పర్ఫెక్ట్‌ కారు ఏదీ? ధర, మైలేజ్, కంఫర్ట్‌ మధ్య అసలు తేడాలివే!

SUV vs MPV vs Sedan: మీ కుటుంబానికి సరిపోయే పర్ఫెక్ట్‌ కారు ఏదీ? ఎస్‌యూవీ, సెడాన్ కార్ల మధ్య ధర, మైలేజ్‌, కంఫర్ట్‌, స్పేస్ పరంగా ఉన్న పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎస్‌యూవీలు పవర్, రోడ్ ప్రెజెన్స్, కఠినమైన రోడ్లకు అనుకూలం.
  • ఎంపీవీలు పెద్ద కుటుంబాలకు, ఎక్కువ మంది ప్రయాణానికి సరైనవి.
  • సెడాన్‌లు లగ్జరీ, స్మూత్ డ్రైవింగ్, హైవే స్థిరత్వానికి ఉత్తమం.

SUV vs MPV vs Sedan Comparison:సొంతంగా ఒక కారును కొనుగోలు చేయం అనేది సగటు భారతీయ కుటుంబానికి మామూలు విషయం కాదు. అలాంటి కుటుంబం కారు కొనాలంటే చాలా సెర్చ్ చేసి నిర్ణయం తీసుకుంటారు. అయితే నేటి మార్కెట్‌లో లభిస్తున్న వందలాది మోడల్స్‌, రకరకాల బాడీ స్టైల్స్‌ చూస్తుంటే సామాన్య కొనుగోలుదారుడు తీవ్ర గొందరగోళానికి గురవుతున్నాడు. ముఖ్యంగా ఎస్‌యూవీ, ఎంపీవీ సెడాన్, ఈ మూడింటిలో తమ కుటుంబ అవసరాలకు ఏది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందో తేల్చుకోలేకపోతున్నారు. 

మీరు కూడా కొత్తగా కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? మీ బడ్జెట్‌ ఏది న్యాయం చేస్తుంది? మీ కుటుంబ సభ్యుల సౌకర్యానికి ఏది పెద్ద పీట వేస్తుంది? అనే విషయాలను పరిశీలిద్దాం. 

పవర్, రోడ్ ప్రెజెన్స్‌లో ఎస్‌యూవీ టాప్‌

ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రపంచం మొత్తం ఎస్‌యూవీల చుట్టూనే తిరుగుతోంది. రోడ్డుపై గంభీరంగా కనిపించడమే కాకుండా, కఠినమైన రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. 

మీరు సాహసోపేతమైన ప్రయాణాలు ఇష్టపడే వారైతే, లేదా మీ ఊరి రోడ్డు గుంతలమయంగా ఉంటే ఎస్‌యూవీ మీకు బెస్ట్ ఛాయిస్. ఇందులో ఇండే అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ వల్ల కారు అడుగు భాగం రోడ్డుకు తగలకుండా సురక్షితంగా ఉంటుంది. సాధారణంగా ఎస్‌యూవీల ధరలు సెడాన్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. మార్కెట్‌లో క్రెటా, స్కార్పియో-N వంటి మోడల్స్ రూ. 8 లక్షల నుంచి 20లక్షల వరకు ఈ బాడీతో మోడల్స్ ఉన్నాయి. భారీ ఇంజిన్ వల్ల మైలేజీ సుమారు 12-16 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. డ్రైవర్‌కు రోడ్డు స్పష్టంగా కనిపించే కమాండింగ్‌ పొజిషన్ లభిస్తుంది. అయితే కారు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లోని పెద్ద వారు  ఎక్కడానికి, దిగడానికి కొంత ఇబ్బంది పడొచ్చు. 

పెద్ద కుటుంబాలకు ఎంపీవీ సూటబుల్

మీది పెద్ద కుటుంబమా, సెలవుల్లో అందరూ కలిసే ఒకే కారులో వెళ్లాలనుకుంటున్నారా అయితే ఎంపీవీని మించిన ఆప్షన్ మరొకటి లేదు. 7 నుంచి 8 మంది సభ్యులు ఉన్న జాయింట్‌ ఫ్యామిలీలకు ఇది పక్కా ఫ్యామిలీ ప్యాకేజీ. ఎంపీవీలలో మూడు వరుసల సీటింగ్ ఉంటుంది. ప్రయాణికులకు లెగ్‌రూమ్‌, హెడ్‌రూమ్‌ విషయంలో ఎలాంటి లోటు ఉండదు. మారుతి ఎర్టిగా, కియా కారెన్స్‌ టొయోటా ఇన్నోవా హైక్రాస్‌ వంటివి ఈ విభాగంలో ఉన్నాయి. ధరలు 9 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ముఖ్యంగా హైబ్రిడ్‌, సీఎన్జీ టెక్నాలజీ వల్ల ఇవి 16 నుంచి 26 వరకు మైలేజీని అందిస్తుంది. 

లగ్జరీ, క్లాసిక్ రైడ్ కోసం సెడాన్

సొగసైన డిజైన్, స్మూత్ డ్రైవింగ్ అనుభవం కావాలనుకునే వారికి సెడాన్ ఒక విలాసవంతమైన ఎంపిక. సెడాన్ కార్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల హైవేలపై అత్యంత స్థిరంగా ప్రయాణిస్తాయి. హైస్పీడ్‌ స్టెబిలిటీ, హ్యాండింగ్‌ విషయంలో వీటిని ఏ కారు అధిగమించలేదు. వీటికి విడిగా డిక్కీలో బూట్ స్పేస్‌ ఉండటం వల్ల, భారీ లగేజీని సర్దుకోవడం చాలా సులభం. డిజైర్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లు ఈ కేటగిరీలో పాపులర్. తక్కువ బరువు వల్ల 18 నుంచి 22kmpl వరకు అద్భుతమైన మైలేజీని ఇస్తాయి. ధరల పరంగా కూడా ఎస్‌యూవీల కంటే తక్కవువ బడ్జెట్‌లోనే లగ్జరీ ఫీచర్లను అందిస్తాయి. 

ఫీచర్  ఎస్‌యూవీ   ఎంపీవీ  సెడాన్
సీటింగ్‌ 5-7 సీట్లు    7-8 సీటర్లు   5 సీటర్లు
రోడ్డు గ్రిప్ చాలా ఎక్కువ  మీడియం తక్కువ(స్పీడ్ బ్రేకర్ల వద్ద జాగ్రత్త)
మైలేజీ 12-16 kmpl 15-20+kmpl   18-22kmpl
బూట్‌ స్పేస్‌   మీడియం తక్కువ   చాలా ఎక్కువ
ప్రధాన లాభం  స్టైలిష్ పవర్‌ఫుల్ ఫ్యామిలీ స్పేస్‌   లగ్జరీ, మైలేజీ 

మీకు రోడ్డుపై ఒక గంభీరమైన లుక్ కావాలని, అప్పుడప్పుడు లాంగ్ ట్రిప్స్‌కు ఐదుగురు వెళ్లాలనుకుంటే ఎస్‌యూవీ సరిపోతుంది. అందరూ కలిసి ప్రయాణించాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది పట్టాలి అనుకుంటే ఎంపీవీని సరిపోతుంది. ప్రశాంతమైన ప్రయాణం కావాలి, లగేజీ ఎక్కువగా ఉంటుంది, హైవేలపై స్మూత్‌గా వెళ్లాలనుకుంటే సెడాన్ బెటర్ ఆప్షన్ అవుతుంది. 

Frequently Asked Questions

ఎస్‌యూవీ కార్ల ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?

ఎస్‌యూవీలు రోడ్డుపై గంభీరంగా కనిపిస్తాయి మరియు కఠినమైన రోడ్లపై సులభంగా ప్రయాణించగలవు. వీటికి ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, ఇది కారు అడుగు భాగాన్ని రోడ్డుకు తగలకుండా కాపాడుతుంది.

పెద్ద కుటుంబాలకు ఎంపీవీలు ఎందుకు అనుకూలం?

ఎంపీవీలు 7 నుండి 8 మంది సభ్యులున్న పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్. వీటిలో మూడు వరుసల సీటింగ్ ఉంటుంది, ప్రయాణికులకు మంచి లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్ అందిస్తాయి.

సెడాన్ కార్లు ఎలాంటి ప్రయాణాలకు ఉత్తమం?

సొగసైన డిజైన్ మరియు స్మూత్ డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి సెడాన్ ఉత్తమం. హైవేలపై స్థిరంగా ప్రయాణించి, లగేజీని సులభంగా సర్దుకోవడానికి విడిగా డిక్కీ ఉంటుంది.

ఎస్‌యూవీ, ఎంపీవీ, సెడాన్ కార్లలో ఏది ఎక్కువ మైలేజీని అందిస్తుంది?

సెడాన్ కార్లు సాధారణంగా 18-22 kmpl మైలేజీని ఇస్తాయి. ఎంపీవీలు హైబ్రిడ్/సీఎన్జీ టెక్నాలజీతో 16-26 kmpl వరకు అందిస్తాయి. ఎస్‌యూవీలు 12-16 kmpl మైలేజీని కలిగి ఉంటాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

సుజుకి ఇ-యాక్సెస్ రేటు నుంచి రేంజ్ వరకు పూర్తి వివరాలు - కొనే ముందే మీరు తెలుసుకోవాల్సిన విషయాలివి
ఈ వివరాలు తెలియకుండా సుజుకి ఇ-యాక్సెస్ కొనొద్దు, ముందే షోరూమ్‌కు వెళితే నష్టపోతారు!
నిస్సాన్ గ్రావైట్‌ కొనాలనుకుంటున్నారా? సిటీలో, హైవేపై ఈ కారు నిజమైన మైలేజ్ వివరాలు ఇవిగో!
తక్కువ ధరలో 7-సీటర్‌ కారు - నిస్సాన్ గ్రావైట్‌ రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత? రోడ్‌ టెస్ట్‌లో అసలు ఫలితాలు
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
టాటా కర్వ్ బలాలు, బలహీనతలు - కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
స్టైలిష్‌ కార్‌ టాటా కర్వ్ కొనాలా? వద్దా? - కొనడానికి 4 కారణాలు, దూరంగా ఉండడానికి 3 కారణాలు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget