అన్వేషించండి

Smart Parking Tips:  కారుకు స్క్రాచెస్, డెంట్స్ పడుతున్నాయా? మీ కారు బాడీని సురక్షితంగా ఉంచుకోవడానికి బెస్ట్ ఐడియాస్ ఇవే!

నగరాల్లో పార్కింగ్ సమస్యల వల్ల కార్లపై గీతలు, డెంట్స్ పడటం సహజం. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా రిపేర్ ఖర్చులను తగ్గించుకోవచ్చు, రీసేల్ వాల్యూ పెంచుకోవచ్చు.

Smart Parking Tips to Protect Your Car: నగరాల్లో కారు యజమానులు ఎదుర్కొనే అతిపెద్ద తలనొప్పి పార్కింగ్. తక్కువ స్థలం, ట్రాఫిక్ రద్దీ వల్ల కారు ఆగి ఉన్న సమయంలోనే చిన్నపాటి గీతలు (Scratches), డెంట్స్ పడుతుంటాయి. ఇవి చూడటానికి చిన్నవిగా అనిపించినా, కాలక్రమేణా కారు పెయింట్ పాడవ్వడానికి లేదా తుప్పు పట్టడానికి దారితీస్తాయి. దీనివల్ల కారు రీసేల్ వాల్యూ తగ్గడమే కాకుండా రిపేర్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. మనం పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం అవగాహనతో వ్యవహరిస్తే ఇటువంటి నష్టాలను సులభంగా నివారించవచ్చు. ఆ పార్కింగ్ సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

సరైన స్థలాన్ని ఎంచుకోండి..
కారును పార్క్ చేసేటప్పుడు ఇరుపక్కల తగినంత ఖాళీ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. వీలైనంత వరకు పిల్లర్ల పక్కన లేదా పార్కింగ్ వరుసలో చివరన ఉండే స్థలాలను ఎంచుకుంటే పక్క వాహనాల తాకిడి తగ్గుతుంది. ఎంట్రన్స్ వద్ద లేదా ఇరుకైన దారుల్లో పార్కింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అక్కడ వాహనాల కదలిక ఎక్కువగా ఉండటం వల్ల వేరొకరు మీ కారును ఢీకొట్టే ప్రమాదం ఉంది.

అలైన్‌మెంట్ ముఖ్యం..
పార్కింగ్ బే (Bay) లోపల కారును సరిగ్గా మధ్యలో ఉండేలా పార్క్ చేయాలి. అడ్డదిడ్డంగా పార్క్ చేస్తే పక్క కారు డోర్లు తీసేటప్పుడు మీ కారుకు తగిలే అవకాశం ఉంటుంది. కారులోని సెన్సార్లు, కెమెరాలను వాడుతూ పొజిషన్ చెక్ చేసుకోవడం ఉత్తమం. అలాగే పెద్ద ఎస్‌యూవీలు లేదా ఇప్పటికే డెంట్స్ ఉన్న కార్ల పక్కన పార్క్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చిన్న కార్లు లేదా క్రమశిక్షణతో పార్క్ చేసిన వాహనాల పక్కన పార్కింగ్ చేయడం సేఫ్.

చిన్న మార్పులతో పెద్ద లాభం..
ఇరుకైన చోట్ల పార్క్ చేసినప్పుడు ఓఆర్వీఎం (ORVM) అద్దాలను ఫోల్డ్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల అటుగా వెళ్లే పాదచారులు లేదా టూవీలర్లు మీ కారు అద్దాలను విరగ్గొట్టకుండా జాగ్రత్త పడవచ్చు. రోడ్డు పక్కన పార్కింగ్ కంటే కవర్ ఉన్న లేదా ప్రత్యేకంగా కేటాయించిన పార్కింగ్ ఏరియాలను ఎంచుకోవడం వల్ల వాతావరణ ప్రభావం కూడా తగ్గుతుంది.

రివర్స్ చేసేటప్పుడు జాగ్రత్త..
చాలా డెంట్లు కారును రివర్స్ తీస్తున్నప్పుడే పడుతుంటాయి. వెనుక వైపు సరిగ్గా కనిపించకపోవడం దీనికి ప్రధాన కారణం. రివర్స్ గేర్ వేసే ముందు బ్లైండ్ స్పాట్స్ చెక్ చేసుకోవాలి. రద్దీగా ఉండే చోట్ల తోపుడు బండ్లు, చిన్న పిల్లలు లేదా టూవీలర్లు అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. అందుకే కారును నెమ్మదిగా కదిలిస్తూ అవసరమైతే ఎవరిదైనా సహాయం తీసుకోవడం మంచిది. కారు ముందు భాగం బయటకు ఉండేలా పార్క్ చేస్తే (Reverse parking) తిరిగి వెళ్లేటప్పుడు విజిబిలిటీ బాగుంటుంది.

కారుకు డోర్ ఎడ్జ్ గార్డ్స్, బంపర్ ప్రొటెక్టర్ల వంటి యాక్సెసరీస్ అమర్చుకోవడం వల్ల చిన్న చిన్న దెబ్బల నుండి రక్షణ లభిస్తుంది. కారును ఎప్పుడూ ఒక క్రమశిక్షణతో పార్క్ చేయడం వల్ల మీ వెహికల్ మాత్రమే కాదు, ఇతరుల వాహనాలు కూడా సురక్షితంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు కారు బాడీని గమనిస్తూ చిన్న గీతలు ఉన్నప్పుడే వాటిని సరిచేస్తే పెయింట్ ఎక్కువ కాలం మన్నిక వస్తుంది అని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త లోగో, తక్కువ ధరతో 2026 రెనాల్ట్ క్విడ్ లాంచ్ - పాత మోడల్‌తో పోలిస్తే తేడాలేంటి?
కొత్త రెనాల్ట్ క్విడ్ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది? తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
సేఫ్‌గా డ్రైవ్ చేస్తే భారీ డిస్కౌంట్ - టెలిమాటిక్స్‌తో మారిపోనున్న వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం!
మీ డ్రైవింగ్ స్కోర్ ఎంత? ఇకపై అదే మీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది!
E20 తర్వాత మరో పెద్ద అడుగు - డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ మిశ్రమానికి సిద్ధమవుతున్న భారత్
డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటనాల్ - కేంద్రం కొత్త ప్లాన్, కీలక ప్రకటన చేసిన నితిన్ గడ్కరీ
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget