అన్వేషించండి

Mercedes-Benz EQS Facelift Unveiled: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 926 కిలోమీటర్లు.. మెర్సిడెస్ బెంజ్ కొత్త ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ సెడాన్ వచ్చేసింది! ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

మెర్సిడెస్ బెంజ్ తన ఫ్లాగ్‌షిప్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారును అప్‌డేట్ చేసింది. ఇది ఇప్పుడు ఏకంగా 926 కిలోమీటర్ల రేంజీతో పాటు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.

Mercedes-Benz EQS Facelift Unveiled : లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ సెడాన్ 'ఈక్యూఎస్' (EQS) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ సరికొత్త మోడల్‌లో కంపెనీ విప్లవాత్మక మార్పులు చేసింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన ప్రియులను వేధించే రేంజ్ సమస్యకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం చూపింది. కొత్త ఈక్యూఎస్ ఇప్పుడు డబ్ల్యూఎల్టీపీ (WLTP) ప్రమాణాల ప్రకారం ఏకంగా 926 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యధిక రేంజీ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటిగా నిలిచింది. కేవలం రేంజ్ మాత్రమే కాకుండా, ఛార్జింగ్ టెక్నాలజీ, బ్యాటరీ సామర్థ్యం, ఇంటీరియర్ హంగుల విషయంలోనూ ఈ కారు నెక్స్ట్ లెవల్‌లో ఉంది.

పవర్‌ట్రెయిన్ - అద్భుతమైన రేంజ్..
ఈక్యూఎస్ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు దాని ఇంజిన్ సామర్థ్యంలో జరిగింది. ఈక్యూఎస్ 450+ వేరియంట్ ఇప్పుడు గతంలో కంటే 13 శాతం ఎక్కువ రేంజ్ ఇస్తూ 926 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈక్యూఎస్ 400, ఈక్యూఎస్ 500 4మ్యాటిక్, ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ మోడళ్లలో కూడా పనితీరు మెరుగుపడింది. ఇందులో 122 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనికి తోడుగా ఉన్న 800V ఛార్జింగ్ ఆర్కిటెక్చర్ వల్ల 350 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 320 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వెనుక యాక్సిల్ వద్ద ఉన్న టూ-స్పీడ్ గేర్‌బాక్స్ వల్ల కారు వేగంగా దూసుకుపోవడమే కాకుండా ఎనర్జీని కూడా ఆదా చేస్తుంది.

డిజైన్ - వెలుపలి హంగులు..
చూడగానే ఆకట్టుకునే కూపే తరహా లుక్‌ను ఈ కారులోనూ కొన సాగించారు. అయితే ముందు భాగంలో కొత్తగా ఇల్యూమినేటెడ్ గ్రిల్ ఉంది. అందులో మెర్సిడెస్ బెంజ్ సిగ్నేచర్ స్టార్ పాటర్న్ డిజైన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనిలోని 'డిజిటల్ లైట్' హెడ్‌ల్యాంప్స్ ఏకంగా 600 మీటర్ల దూరం వరకు కాంతిని ప్రసరింపజేస్తాయి. ఫ్రంట్ బంపర్‌పై క్రోమ్ డీటెయిలింగ్ పెంచారు. వెనుక వైపు ఉన్న లైట్ బార్ గ్రాఫిక్స్, షార్పర్ డిఫ్యూజర్ ఎలిమెంట్స్ ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టెక్నాలజీ - విలాసవంతమైన ఇంటీరియర్..
కారు లోపలికి వెళితే మ్యాసివ్ 'ఎంబీయూఎక్స్ హైపర్‌స్క్రీన్' (MBUX Hyperscreen) మనకు స్వాగతం పలుకుతుంది. ఇది మూడు స్క్రీన్లను ఒకే గ్లాస్ ప్యానెల్ కింద అనుసంధానిస్తుంది. కంపెనీ లేటెస్ట్ 'ఎంబీ.ఓఎస్' (MB.OS) సాఫ్ట్‌వేర్‌తో ఇది పనిచేస్తుంది. దీనివల్ల వాయిస్ అసిస్టెంట్ ఇంకా వేగంగా స్పందిస్తుంది. వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం 13.1-అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు ఉన్నాయి. హీటెడ్ ఫ్రంట్ సీట్‌బెల్ట్స్, అప్‌గ్రేడెడ్ పార్కింగ్ అసిస్ట్, ప్రిడిక్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని అత్యంత సుఖ వంతం చేస్తాయి. అవసరమైతే యోక్-స్టైల్ స్టీరింగ్ వీల్‌తో వచ్చే స్టీర్-బై-వైర్ టెక్నాలజీని కూడా ఎంచుకోవచ్చు. మొత్తానికి లగ్జరీతో పాటు బిగ్ రేంజ్ కోరుకునే వారికి ఈక్యూఎస్ ఫేస్‌లిఫ్ట్ ఒక డ్రీమ్ కారు అని చెప్పవచ్చు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget