అన్వేషించండి

CNG కార్లలో మరో ఆప్షన్‌: స్కోడా చౌక SUV Kylaqలో CNG వెర్షన్‌ రావచ్చు!

Skoda India, తన కైలాక్‌ SUVకి CNG వెర్షన్‌ను పరిశీలిస్తోంది. డీలర్‌ లెవెల్‌ CNG కిట్‌, మైలేజ్‌, ఇంజిన్‌ ఆప్షన్‌, లాంచ్‌ టైమ్‌లైన్‌పై ఇప్పటివరకు తెలిసిన వివరాలు ఇవిగో.

Skoda Kylaq CNG Variant: భారత ఆటో మార్కెట్‌లో CNG వాహనాల డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్‌ ఖర్చులు పెరగడంతో తక్కువ రన్నింగ్‌ ఖర్చు కోరుకునే ప్రజలు ఎక్కువగా CNG వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, స్కోడా ఇండియా తన అత్యంత చౌక SUV అయిన Skoda Kylaqకి CNG వెర్షన్‌ తీసుకురావచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తోంది.

ఆటో రంగానికి సంబంధించిన తాజా కథనాల ప్రకారం, స్కోడా కైలాక్‌కు ఫ్యాక్టరీ ఫిట్‌మెంట్‌ లేదా డీలర్‌ లెవెల్‌ CNG కిట్‌ ఆప్షన్‌ను అందించే అవకాశాలపై కంపెనీ అంచనాలు వేస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కైలాక్‌ మైలేజ్‌ మరింత పెరిగి, ఇప్పటికే CNG ఆప్షన్‌ ఇస్తున్న ప్రత్యర్థి SUVలకు గట్టి పోటీగా మారే అవకాశం ఉంటుంది.

సబ్‌ 4 మీటర్‌ SUV సెగ్మెంట్‌లోకి దూసుకొచ్చిన కైలాక్‌

భారతదేశంలో సబ్‌ 4 మీటర్‌ SUV సెగ్మెంట్‌ ప్రస్తుతం అత్యంత పోటీతో కూడిన విభాగంగా మారింది. దాదాపు ప్రతి బ్రాండ్‌ ఈ సెగ్మెంట్‌లో తన మోడళ్లను ప్రవేశపెడుతోంది. స్కోడా 2024 చివర్లో కైలాక్‌ను ఈ విభాగంలోకి తీసుకొచ్చింది. విడుదలైన కొంత కాలంలోనే కైలాక్‌ మంచి స్పందన పొందింది.

గత ఒక్క ఏడాదిలోనే కైలాక్‌ అమ్మకాలు 45,000 యూనిట్లకు పైగా నమోదయ్యాయి. స్కోడా-వోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌నకు భారత మార్కెట్‌లో ఈ కారు కీలక మోడల్‌గా మారిందని ఈ లెక్కలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

CNG కిట్‌ ఎలా ఉండొచ్చు?

మారుతి, టాటా లాంటి కంపెనీలు ఫ్యాక్టరీ ఫిట్‌ CNG ఇస్తుంటే, స్కోడా మాత్రం సిట్రోయెన్‌, రెనాల్ట్‌, నిస్సాన్‌ మాదిరిగానే డీలర్‌ లెవెల్‌ రెట్రోఫిట్‌ CNG కిట్‌ మార్గాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కిట్‌లను థర్డ్‌ పార్టీ CNG నిపుణుల సహకారంతో అభివృద్ధి చేస్తారు. ప్రభుత్వ అనుమతులతో పాటు, వారంటీ కవరేజ్‌ కూడా అందించే అవకాశం ఉంది.

ఇంజిన్‌, పనితీరు వివరాలు

కైలాక్‌ CNG వెర్షన్‌ను తీసుకొస్తే, అది 1.0 లీటర్‌ TSI మాన్యువల్‌ ఇంజిన్‌తోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఎక్కువ. CNGపై నడిచేటప్పుడు స్వల్పంగా శక్తి తగ్గినా, ఈ ఇంజిన్‌ గరిష్టంగా 115 bhp శక్తి, 178 Nm టార్క్‌ అందించగల సామర్థ్యం కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి ఇది సరిపడే పనితీరునే ఇస్తుంది.

కొత్త వేరియంట్లు, స్పోర్ట్‌లైన్‌ ప్లాన్‌

స్కోడా ఇప్పటికే కైలాక్‌ లైనప్‌లో Classic+, Signature+, Prestige+ ట్రిమ్‌లను జోడించింది. త్వరలోనే Sportline వేరియంట్‌ను కూడా తీసుకురావాలని ప్లాన్‌ చేస్తోంది. కుషాక్‌ మాంటే కార్లో ఎడిషన్‌ తరహాలో, ఈ స్పోర్ట్‌లైన్‌ వేరియంట్‌లో ఆల్‌ బ్లాక్‌ థీమ్‌తో మరింత అగ్రెసివ్‌ లుక్‌ ఇవ్వనున్నారు.

మొత్తంగా చూస్తే, కైలాక్‌కి CNG ఆప్షన్‌ వస్తే, ఇది మైలేజ్‌ను ప్రాధాన్యంగా చూసే కుటుంబ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. స్కోడా అధికారిక ప్రకటన కోసం ఆటో మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.                           

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget