అన్వేషించండి

Skoda Kushaq: స్కోడా కుషాక్ కొత్త మోడల్ లాంచ్ - కేవలం 500 కార్లు మాత్రమే సేల్!

స్కోడా కుషాక్ లిమిటెడ్ ఎడిషన్ కారు మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో కేవలం 500 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నారు.

Skoda Kushaq Limited Edition: స్కోడా తన ఎస్‌యూవీ కుషాక్‌కు సంబంధించిన మరొక వెర్షన్‌ను పరిచయం చేసింది. దీనికి మ్యాట్ ఎడిషన్ అని పేరు పెట్టారు. ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్‌గా మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో కేవలం 500 యూనిట్లను మాత్రమే స్కోడా విక్రయించనుంది. దాని పేరుకు తగ్గట్లే కార్బన్ స్టీల్ మ్యాట్ పెయింట్ స్కీమ్‌తో లాంచ్ చేశారు. ఇది కాకుండా వింగ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్‌కు గ్లోసీ బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ కూడా అందించారు.

కుషాక్ మ్యాట్ ఎడిషన్‌ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ కంటే రూ. 40,000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. స్కోడా కుషాక్ టాప్ ఎండ్ వేరియంట్‌ను మరింత స్టైలిష్‌గా తయారు చేశారు. ఈ ప్రత్యేక ఎడిషన్ 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ (6 స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్), 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ (7 స్పీడ్ డీఎస్) రెండు ఇంజిన్ ఆప్షన్లతో లాంచ్ అవుతుంది.

స్కోడా కుషాక్ మ్యాట్ లిమిటెడ్ ఎడిషన్ ధర ఎంత?
ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ధర గురించి చెప్పాలంటే దీని ధర రూ. 16.19 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి రూ. 19.39 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లతో ఈ కారు మార్కెట్లోకి రానుంది.

కియా తర్వాత ఈ విభాగంలో స్కోడా కుషాక్ రెండో కారు. దీని ఎక్స్ లైన్ ట్రిమ్ కూడా దాదాపు అదే పెయింట్ స్కీమ్‌తో లాంచ్ అయింది. స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్ కోసం కలర్ స్కీమ్ మాత్రమే మార్చారు. ఇందులో కేవలం 500 యూనిట్లను మాత్రమే కుషాక్ విక్రయించనుంది.

స్కోడా కుషాక్ టాప్ ఎండ్ స్టైల్ వేరియంట్ లాగానే స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్‌లో కూడా 10 అంగుళాల వైర్‌లెస్ యాపిల్, ఆండ్రాయిడ్ ఆటో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు అందించారు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, సబ్ బఫర్‌తో కూడిన స్కోడా సౌండ్ సిస్టమ్, ఆరు స్పీకర్లు, ఎనిమిది అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ మోడల్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా భద్రతా ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఈబీడీతో ఏబీఎస్, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా కూడా ఉన్నాయి.

దేంతో పోటీ?
స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్‌తో పోటీపడే వాహనాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లు ఉన్నాయి.

ప్రస్తుతం మనదేశంలో ఏడు సీట్ల ప్రీమియం ఎస్‌యూవీలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇప్పుడు స్కోడా కోడియాక్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఆ లిస్ట్‌లో చేరనుంది. గతంలో వచ్చిన కోడియాక్ ప్రీమియం ఎస్‌యూవీకి అప్‌డేట్‌గా ఈ కొత్త కోడియాక్ అందుబాటులోకి రానుంది. ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ కానున్నాయి. అవే స్టైల్, స్పోర్ట్‌లైన్, లారిన్ అండ్ క్లెమెంట్ స్టైల్ మోడల్స్.

ఈ మోడల్ ధర రూ.34.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ను కూడా ఈ మోడల్లో అందించారు. అదే 2.0 టీఎస్ఐ ఇంజిన్. స్టాండర్డ్ వేరియంట్‌లో 7 స్పీడ్ డీఎస్‌జీ వేరియంట్‌ను అందించనున్నారు.

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Car Speedometer: స్పీడ్ మీటర్ 200 కిలోమీటర్లు చూపిస్తున్నా, కారు మాత్రం 120- 140 ఎందుకు వెళ్తుంది ?
స్పీడ్ మీటర్ 200 కిలోమీటర్లు చూపిస్తున్నా, కారు మాత్రం 120- 140 ఎందుకు వెళ్తుంది ?
లీటర్‌కు 56km మైలేజ్, భారీ స్టోరేజ్ ఇస్తున్న Suzuki Burgman Street - కానీ ఈ రెండు లోపాలు నిరాశపరుస్తాయి!
కొత్త Suzuki Burgman Street ప్లస్‌లు, మైనస్‌లు - ఫైనల్‌గా ఎంతకు వస్తుంది?
వర్షాకాలంలో కార్ డ్రైవింగ్‌ అలర్ట్ - ఈ టిప్స్ మీ తెలిస్తేనే ప్రమాదాలకు చెక్, హ్యాపీ జర్నీ
వర్షాకాలంలో కార్‌ కేర్‌ - ఈ 10 జాగ్రత్తలు పాటించకపోతే భారీ డ్యామేజీ!
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget