Skoda Best Selling Car: స్కోడా 'చవక' కారు అమ్మకాలతో దుమ్మురేపుతోంది, ఈ ప్రీమియం SUV ధర ఇంతే!
Skoda Kylaq Sales Report: స్కోడా కైలాక్‌ను 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో లాంచ్ చేశారు. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తోంది.

Skoda Kylaq Price, Mileage And Features In Telugu: స్కోడా కార్లకు భారతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ గత సంవత్సరం స్కోడా కైలాక్‌ను లాంచ్ చేసింది, అప్పటి నుండి ఈ కారుకు చాలా డిమాండ్ ఉంది. దీనికి తాజా ఉదాహరణ స్కోడా కైలాక్ అమ్మకాలు. ఈ కారు గత నెలలో (Skoda Kylaq sales report may 2025) మొత్తం 4 వేల 949 యూనిట్లు అమ్ముడైంది. ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ SUV మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ధరలోనే లభిస్తోంది.
స్కోడా కైలాక్‌ను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సమయంలో, ఇంట్రడ్యూసరీ ప్రైస్ ట్యాగ్‌తో (డిస్కౌంట్ రేటుతో) ప్రవేశపెట్టారు, ఇది కస్టమర్లను బాగా ఆకర్షించింది. ఇప్పుడు ఆ డిస్కౌంట్ పిరియడ్ ముగిసింది. కైలాక్ రాయితీ ధరతో కస్టమర్లను ఆకట్టుకున్న స్కోడా, సేల్స్ పుంజుకున్న తర్వాత, గత నెలలో ఈ సబ్-4 మీటర్ SUV ధరలను సవరించింది.
తెలుగు రాష్ట్రాల్లో స్కోడా కైలాక్ ధర ఎంత?
పరిచయ వ్యవధి ముగిసిన తర్వాత, ఈ కంపెనీ తన అన్ని వేరియంట్ల ధరలను సమీక్షించి, కొత్త ధరలను అమలు చేసింది. ఈ కారణంగా కొన్ని వేరియంట్ల ధర పెరిగింది & టాప్ వేరియంట్ ధర తగ్గింది.
స్కోడా కైలాక్ కొత్త ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Skoda Kylaq ex-showroom price) ఇప్పుడు రూ. 8.25 లక్షలు కాగా, గతంలో ఇది రూ. 7.89 లక్షలుగా ఉంది. అంటే, ఎంట్రీ లెవల్ వేరియంట్ Skoda Kylaq Classic (Petrol) రేటు రూ. 36,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో, అన్ని పన్నులతో కలుపుకుని దీని ఆన్-రోడ్ ధర (Skoda Kylaq on-road price) రూ. 9.78 లక్షల వరకు ఉంటుంది.
టాప్-ఎండ్ ట్రిమ్‌లు చవక
ఎంట్రీ వేరియంట్లు & మిడ్ వేరియంట్ల రేట్లు పెరిగితే; ప్రెస్టీజ్ & ప్రెస్టీజ్ AT వెర్షన్ల వంటి టాప్-ఎండ్ ట్రిమ్‌ల ధర రూ. 40,000 కంటే ఎక్కువే తగ్గింది. ఈ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఇంజిన్ & ఫీచర్లు
భారతదేశంలో, స్కోడా కైలాక్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో (Skoda Kylaq Engine) పరుగులు తీస్తుంది. ఈ SUVని మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చే పవర్డ్ సీట్ ఫీచర్ ఈ కారులో ఇచ్చారు. అంతేకాదు, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ప్రయాణంలో వినోదం & కనెక్టివిటీ రెండింటిలోనూ గొప్ప అనుభవాన్ని అందిస్తుంది.
6 ఎయిర్ బ్యాగులతో మరింత భద్రత
ప్రయాణీకుల భద్రత పరంగా చూస్తే... స్కోడా కైలాక్‌లో 6 ఎయిర్ బ్యాగులు (6 Airbags In Skoda Kylaq) అందించారు. ఇంకా.. క్రూయిజ్ కంట్రోల్ & కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి మోడర్న్ ఫీచర్లు (Skoda Kylaq Features) కూడా ఉన్నాయి. దీంతో, ఈ కారు సబ్-4 మీటర్ SUV విభాగంలో బలమైన & ప్రీమియం ఆప్షన్‌గా నిలిచింది.





















