Mahindra XEV 9Sలో మీకు నచ్చే, నచ్చని విషయాలు - కొనే ముందే వీటి గురించి తెలియాలి
భారతదేశపు తొలి 3-రో ఎలక్ట్రిక్ SUV అయిన మహీంద్రా XEV 9S కొనడం మంచి నిర్ణయమేనా?. దాని ప్రోస్, కాన్స్ ఏమిటి? ధర, ఫీచర్లు, పనితీరు, మైనస్ పాయింట్లతో పూర్తి విశ్లేషణ.

Mahindra XEV 9S Review Telugu: భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగం పెంచుకుంటున్న ఈ సమయంలో, మహీంద్రా తీసుకొచ్చిన XEV 9S ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మాస్ మార్కెట్ 3-రో ఎలక్ట్రిక్ SUV. INGLO ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ మోడల్... BE 6, XEV 9e లతో పోలిస్తే కొంచెం ప్రాక్టికల్‌గా ఉండేలా డిజైన్ చేశారు. కుటుంబ వినియోగదారులను ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఈ SUVను తీసుకొచ్చింది మహీంద్రా.
ఈ మోడల్‌ను కొనాలని అనుకుంటున్న వారికి సహాయపడేలా, దాని ప్రయోజనాలు & నష్టాలు రెండింటినీ క్లియర్‌గా వివరించాం.
ప్రోస్: XEV 9S కొనడానికి మూడు ప్రధాన కారణాలు
1. Value for Money – ధరకు తగినటువంటి పెద్ద SUV
మహీంద్రా XEV 9S ధర రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల వరకు ఉంటుంది. 3 వరుసల SUV విభాగంలో ఇది చాలా అందుబాటు ధర. XEV 9e కంటే దాదాపు ₹1.95 లక్షలు తక్కువ ధర ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. 7 సీటర్ ఆప్షన్, ఎక్కువ పవర్‌ట్రైన్ ఛాయిస్‌లు, పుష్కలంగా ఫీచర్లతో రావడం వల్ల ధర-విలువ పరంగా XEV 9S చాలా స్ట్రాంగ్ ప్యాకేజ్.
2. ఫీచర్ల పరంగా క్లాస్‌లో బెస్ట్
ఈ SUVలో ఉన్న ఫీచర్లు ప్రీమియం సెగ్మెంట్ కార్లకు కూడా పోటీగా ఉంటాయి.
ఏ ఫీచర్లు ఉన్నాయి?
- ట్రిపుల్ స్క్రీన్ సెటప్
- హెడ్-అప్ డిస్‌ప్లే
- 16 స్పీకర్ల హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్
- 360 డిగ్రీ కెమెరా
- ఓపెన్ చేయగల పానోరమిక్ సన్‌రూఫ్
- డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్
- పవర్డ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
- బాస్ మోడ్
- రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు
- Level 2 ADAS సేఫ్టీ ఫీచర్లు
ఈ లెవల్ ఫీచర్లు ఈ ధరలో దొరకడం నిజంగా పెద్ద అదనపు ప్రయోజనం.
3. పనితీరు అద్భుతం
XEV 9S మూడు బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది:
- 59kWh – 231hp
- 70kWh – 245hp
- 79kWh – 286hp
- అన్ని వెర్షన్లలో టార్క్ 380Nm గా ఒకేలా ఉంటుంది.
79kWh వెర్షన్ 0–100 km/h వేగాన్ని కేవలం 7 సెకన్లలో అందుకుంటుంది. టాప్ స్పీడ్ 202 km/h, రేంజ్ 679 km వరకు ఉండటం వల్ల లాంగ్ డ్రైవింగ్‌లో కూడా నమ్మకం ఉంటుంది. ఓవర్‌టేకింగ్‌లోనూ ఇది చాలా ఈజీగా, లీనియర్‌గా స్పందిస్తుంది.
కాన్స్: XEV 9Sలో ఉన్న రెండు మైనస్ పాయింట్లు
1. ఎర్గోనామిక్స్ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం
ఈ SUV ఎక్కువగా టెక్‌పై ఆధారపడటం వల్ల కొన్ని ప్రాక్టికల్ ఇష్యూలు కనిపిస్తాయి. ప్యాసింజర్ స్క్రీన్‌కు ప్రైవసీ ఫిల్టర్ లేకపోవడం డ్రైవర్‌కు డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టీరింగ్‌పై ఉన్న కెపాసిటివ్ బటన్‌లు అనుకోకుండా హిట్ అవుతున్నాయి. చాలా ఫంక్షన్లు టచ్‌స్క్రీన్‌లో ఉండటం వల్ల UIలో నావిగేట్ చేయడం కొంచెం క్లిష్టం.
2. మూడో వరుస పెద్దలకి సూట్ కాదు
త్రీ-రో SUV అయినా, మూడో వరుసలో హెడ్‌రూం తక్కువగా ఉంది. కాళ్లు పైకెత్తే విధంగా కూర్చోవాల్సి రావడం మైనస్. కాబట్టి పెద్దలకు ఇది కాంఫర్టబుల్ కాదు. చిన్న పిల్లలకు లేదా చిన్న ట్రిప్‌లకు మాత్రం సరిపోతుంది.
ఫైనల్‌గా...
మీరు కుటుంబానికి అనువైన, ఫీచర్లతో నిండిన, శక్తిమంతమైన, మంచి రేంజ్‌తో వచ్చే మూడు-వరుసల ఎలక్ట్రిక్ SUV కోసం చూస్తే Mahindra XEV 9S డెఫినిట్‌గా మంచి ఎంపిక. కానీ, తరచుగా మూడో వరుసలో పెద్దవాళ్లు కూర్చోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటే లేదా UI ఆధారిత కంట్రోల్స్ నచ్చకపోతే, కొనుగోలు చేసే ముందే ఆలోచించడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















