Ducati Streetfighter V2 & V2 S వేరియంట్స్ రిలీజ్ - Ducati నుంచి పవర్ ప్యాక్ సర్‌ప్రైజ్!
2025 Ducati Streetfighter V2 & V2 S భారత మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. కొత్త 890cc V టైన్ ఇంజిన్, తక్కువ బరువు, అగ్రెసివ్ ఫీచర్లు, ప్రీమియం సస్పెన్షన్‌తో స్ట్రీట్ లవర్స్‌కు పెర్ఫెక్ట్ అప్‌డేట్.

2025 Ducati Streetfighter V2 Specifications: బైక్ లవర్స్ కోసం డుకాటి మరో లెవల్ అప్‌గ్రేడ్ తీసుకొచ్చింది. ఇటీవల Multistrada V2, Panigale V2 అప్‌డేట్స్ ఇచ్చిన డుకాటి, ఇప్పుడు 2025 Streetfighter V2 & Streetfighter V2 S మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. స్టాండర్డ్ Streetfighter V2 ధర ₹17.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్) కాగా, ప్రీమియం Streetfighter V2 S ధర ₹19.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్) గా ప్రకటించింది.
ఈ కొత్త మోడళ్లను పూర్తిగా నేకెడ్ స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టి డిజైన్ చేశారు. అగ్రెసివ్ అటిట్యూడ్, తక్కువ బరువు, శక్తిమంతమైన ఇంజిన్, అధునాతన ఎలక్ట్రానిక్స్ అన్నీ కలిపి ఈ V2 సిరీస్‌ను మరింత స్పోర్టీగా మార్చాయి.
శక్తిమంతమైన 890cc V-టైన్ ఇంజిన్
కొత్త Streetfighter V2లో ఉన్న 890cc V-టైన్ ఇంజిన్ 120hp పవర్, 93.3Nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది, ముందున్న 955cc ఇంజిన్ కంటే 30hp తక్కువ అయినా, కొత్త ఇంజిన్ బరువు కేవలం 54.4kg మాత్రమే. Ducati ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత తక్కువ బరువు ఉన్న ట్విన్ ఇంజిన్‌గా ఇది నిలిచింది.
ఇంజిన్ బరువు తగ్గడం వల్ల బైక్ మొత్తం బరువు కూడా తగ్గింది
Streetfighter V2 బరువు: 178kg (without fuel)
Streetfighter V2 S బరువు: 175kg (without fuel)
V2 S, ఇప్పుడు, మార్కెట్లోకి వచ్చిన తక్కువ బరువున్న Streetfighterగా రికార్డు సెట్ చేసింది.
సస్పెన్షన్ & టైర్స్ - రెండు వేరియంట్స్ మధ్య ముఖ్య తేడాలు
స్టాండర్డ్ Streetfighter V2:
Marzocchi పూర్తి అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్
KYB రియర్ మోనోషాక్
Streetfighter V2 S:
ప్రీమియం Ohlins NIX 30 ఫోర్క్
Ohlins రియర్ మోషాక్
ఈ రెండు మోడళ్లలోనూ Sachs స్టీరింగ్ డ్యాంపర్, Pirelli Diablo Rosso IV టైర్లు (120/70 ఫ్రంట్, 190/55 రియర్) స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
V2 S వేరియంట్ సస్పెన్షన్ సెటప్ వల్ల మరింత స్పోర్టీ రైడ్ ఫీల్ ఇస్తుంది, ఫాస్ట్ కార్నరింగ్‌లో ఎక్కువ కంట్రోల్ ఇస్తుంది.
అట్ట్రాక్టివ్ ఎలక్ట్రానిక్ ఫీచర్లు - రైడర్‌కు పూర్తి కంట్రోల్
Streetfighter V2ను అత్యంత అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్‌తో ఆకర్షణీయంగా మార్చారు.
6-Axis IMU సిస్టమ్ వల్ల ఇవన్నీ స్టాండర్డ్‌గా అందిస్తున్నారు:
- కార్నరింగ్ ABS
- డుకాటి ట్రాక్షన్ కంట్రోల్
- వీలీ కంట్రోల్
- ఇంజిన్ బ్రేక్ కంట్రోల్
- బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్
4 రైడింగ్ మోడ్స్
రైడింగ్ స్టైల్స్‌కి అనుగుణంగా Race, Sport, Road, Wet వంటి నాలుగు మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇవన్నీ 5 ఇంచుల TFT డిస్‌ప్లేలో అందంగా కనిపిస్తాయి.
Streetfighter V2 Sకి అదనంగా లాంచ్ కంట్రోల్, పిట్ లిమిటర్ (స్టాండర్డ్‌గా) ఇస్తున్నారు. స్టాండర్డ్ వేరియంట్‌లో ఇవి ఆప్షనల్.
కాంపిటీషన్ హాట్ ఉన్నా Ducati లెవలే వేరు
ఈ బైక్ సెగ్మెంట్‌లో Kawasaki Z900 (₹9.99 లక్షలు), Triumph Street Triple RS (₹12.93 లక్షలు) ఉన్నాయి. కానీ Ducati Streetfighter V2 ధర మాత్రం వీటన్నింటి కంటే ఎక్కువ. దీనికి కారణం - రైడింగ్ ఫీల్, ప్రీమియం హ్యాండ్లింగ్, డుకాటి ఇంజినీరింగ్. ఇవన్నీ ఈ బైక్‌ను పూర్తిగా వేరే లెవల్‌లో నిలబెడతాయి.
బైక్ అప్‌గ్రేడ్ గురించి ఆలోచిస్తున్నవారికి, ప్రత్యేకంగా ప్రీమియం క్లాస్‌ను ఇష్టపడేవారికి ఈ Streetfighter ఒక పర్ఫెక్ట్ చాయిస్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















