Royal Enfield Super Meteor 650: భారత మార్కెట్లోకి అత్యంత ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ధర ఎంతో తెలుసా?
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అదిరిపోయే బైక్ అందుబాటులోకి రాబోతుంది. సూపర్ మెటోర్ 650 పేరుతో రాబోతున్న ఈ బైక్ అత్యంత ఖరీదైనది. EICMA 2022లో ఈ బైక్ లాంచ్ కాబోతున్నది. ధర, ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.
![Royal Enfield Super Meteor 650: భారత మార్కెట్లోకి అత్యంత ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ధర ఎంతో తెలుసా? Royal Enfield Super Meteor 650 To Be Its Most Expensive Bike, Check More Details Royal Enfield Super Meteor 650: భారత మార్కెట్లోకి అత్యంత ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ధర ఎంతో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/07/91157a3ca28c71f5d85fded32ddb77de1667793074119544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అత్యంత ఖరీదైన బైక్
రాయల్ జర్నీకి పెట్టింది పేరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఇప్పటికే పలు అద్భుతమైన బైకులను మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ, తాజాగా మరో ప్రీయమియం బైక్ ను ఆవిష్కరించబోతున్నది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త 650సీసీ ఆఫర్- ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 పేరుతో వినియోగదారులకు పరిచయం చేయబోతోంది. వీటిని భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తోంది. EICMA 2022లో ఈ బైక్ ఆవిష్కరించబడుతుంది.
లేటెస్ట్ హంగులతో రూపుదిద్దుకుంటున్న సూపర్ మెటోర్ 650
విడుదలకు సిద్ధం అవుతున్న సూపర్ మెటోర్ 650 బైక్ లేటెస్ట్ హంగులతో రూపుదిద్దుకుంటున్నది. బైక్, దాని ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ తో సహా మెటోర్ 350 నుంచి చాలా బిట్‌లను తీసుకుంటుంది. సీటు సహా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, దాని చిన్న ఇంజన్ కూడా మెటోర్ 350 నుంచే తీసుకుంది. డిజైన్ లో చాలా వరకు 350 మెటోర్ మాదిరిగానే ఉంటుంది. వెనుక టెయిల్-ల్యాంప్ తో పాటు హెడ్ ల్యాంప్ DRL డిజైన్ మాత్రం 650 వెర్షన్ లో కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ఈ బైక్ టైర్లు కూడా ఇతర 650cc బైక్‌ల మాదిరిగానే ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్‌తో పాటు USD ఫోర్క్‌లను కలిగి ఉంటుంది. ఇంజిన్ RE పరిధిలో 650 మాదిరిగానే ఉంటుంది. Bhp పనితీరుతో 648cc మోటారును కలిగి ఉంటుంది.
సూపర్ మెటోర్ 650 ధర రూ. 3 లక్షలకు పైనే ఉండే అవకాశం!
ధర వివరాలను పరిశీలిస్తే, Super Meteor 650 రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి భారత్ లో ఉన్న అన్ని బైకుల కంటే అత్యంత ప్రీమియం బైక్. ఈ బైక్ ధర రూ. 3 లక్షలకు పైనే ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వస్తున్న ఈ మోటార్ సైకిల్ రైడర్ మానియా ఈవెంట్ లో లాంచ్ కాబోతున్నది. ప్రస్తుతానికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చిన ఏకైక కొత్త బైక్ ఇదే.
Super Streaming LIVE from EICMA 2022.
— Royal Enfield (@royalenfield) November 6, 2022
Tune in on 8th Nov, 4 PM IST.#WorthTheWait #CruisingSoon #PureMotorcycling #RoyalEnfield #EICMA2022 #EICMA pic.twitter.com/m7vXIetfdg
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి త్వరలో మరిన్ని బైకులు లాంచ్!
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి త్వరలో మరిన్ని బైకులు లాంచ్ కాబోతున్నాయి. Super Meteor 650 ఆవిష్కరణ తర్వాత బైక్ షాట్‌గన్ 650 లాంచ్ కాబోతున్నది. ఆ బైక్ కూడా అత్యంత ప్రీమియం ప్లాట్ ఫారమ్ లోనే రాబోతున్నది. దీని తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ 450 హిమాలయన్ తో పాటు పలు కొత్త బైక్ లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక Super Meteor 650 మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
Astral. Celestial. Interstellar.
— Royal Enfield (@royalenfield) November 4, 2022
Booth number i-10, Pavilion 15, EICMA 2022, Milan.#WorthTheWait #CruisingSoon #PureMotorcycling #RoyalEnfield #EICMA2022 #EICMA pic.twitter.com/c0KsgjsCKX
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)