అన్వేషించండి

రెట్రో స్టైల్‌ బైక్‌ల మధ్య పోటీ: Royal Enfield Hunter 350 వర్సెస్‌ Yamaha XSR 155 - ఏది యూత్‌కు బెస్ట్‌?

Royal Enfield Hunter 350, Yamaha XSR 155 మధ్య కంపారిజన్‌. ఇంజిన్‌ పవర్‌, బరువు, ఫీచర్లు, సస్పెన్షన్‌, ఎక్స్‌-షోరూమ్‌ ధరల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, యమహా XSR 155 రెట్రో బైకులు పోటీపడుతున్నాయి.
  • హంటర్ 350లో 349cc ఇంజిన్, XSR 155లో 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది.
  • XSR 155 తేలికైనది, ఆధునిక ఫీచర్లు, హంటర్ 350 విశాలమైన ఇంజిన్ కలిగి ఉన్నాయి.
  • క్లాసిక్ ఫీల్ కావాలంటే హంటర్, స్పోర్టీ అనుభూతికి XSR 155 మంచి ఎంపిక.

Best 350cc Bikes 2026 India: మన మార్కెట్‌లో రెట్రో స్టైల్‌ బైక్‌లకు డిమాండ్‌ గత కొన్ని సంవత్సరాలుగా భారీగా పెరుగుతోంది. క్లాసిక్‌ లుక్‌తో పాటు మోడ్రన్‌ టెక్నాలజీ కావాలనుకునే యూత్‌ కోసం కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే బాగా పాపులర్‌ అయిన మోటార్‌ సైకిల్‌ Royal Enfield Hunter 350. ఇటీవల, దీనికి పోటీగా Yamaha XSR 155 భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది.

డిజైన్‌ పరంగా రెండూ రెట్రో టచ్‌ ఉన్నా.... ఇంజిన్‌ సైజ్‌, బరువు, రైడింగ్‌ క్యారెక్టర్‌లో మాత్రం ఈ రెండు బైక్‌లు పూర్తిగా వేర్వేరు. రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల రేంజ్‌లో ధరలు దగ్గరగా ఉండటంతో ఇవి నేచురల్‌ రైవల్స్‌గా మారాయి.

ఇంజిన్‌, పనితీరు ఎలా ఉంది?

Royal Enfield Hunter 350లో, కంపెనీకి గుర్తింపుగా నిలిచిన 349cc ఎయిర్‌-ఆయిల్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్‌ 20.2hp శక్తి, 27Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌లో అసిస్ట్‌ అండ్‌ స్లిప్‌ క్లచ్‌ కూడా ఇస్తారు. ఈ ఇంజిన్‌ లో-ఎండ్‌ టార్క్‌కు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ట్యూన్‌ చేశారు. అందుకే సిటీ రైడింగ్‌, హైవే క్రూజింగ్‌లో ఇది రిలాక్స్‌డ్‌ ఫీల్‌ ఇస్తుంది.

Yamaha XSR 155లో 155cc లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 18.4hp శక్తి, 14.2Nm టార్క్‌ ఇస్తుంది. ఇంజిన్‌ చిన్నదైనా, 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, అసిస్ట్‌ అండ్‌ స్లిపర్‌ క్లచ్‌ వల్ల స్పోర్టీ రైడింగ్‌ అనుభవం అందిస్తుంది. రేవ్‌ చేయడం ఇష్టపడే యూత్‌కు ఇది బాగా నచ్చే బైక్‌.

సైజ్‌, బరువు - దేనిని ఎంత వరకు హ్యాండిల్‌ చేయొచ్చు?

సీట్‌ హైట్‌ విషయానికి వస్తే.... Yamaha XSR 155 సుమారు 810mm, Hunter 350 సుమారు 790mmగా ఉంటుంది. తక్కువ హైట్‌ ఉన్న రైడర్లకు Hunter మరింత కంఫర్ట్‌గా అనిపించవచ్చు.
బరువు పరంగా పెద్ద తేడా ఉంది. XSR 155 కేవలం 137kg కాగా, Hunter 350 దాదాపు 181kg. లైట్‌వెయిట్‌ కావడంతో Yamaha బైక్‌ సిటీ ట్రాఫిక్‌లో చాలా ఈజీగా హ్యాండిల్‌ చేయవచ్చు.
ఫ్యూయల్‌ ట్యాంక్‌ను చూస్తే... XSR 155లో 10 లీటర్లు, Hunter 350లో 13 లీటర్ల ట్యాంక్‌ ఉంది.

ఫీచర్లలో ఏ బండిది ముందంజ?

Yamaha XSR 155 ఫీచర్ల పరంగా బాగా అడ్వాన్స్‌డ్‌. ఇందులో ఫుల్‌ డిజిటల్‌ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, ట్రాక్షన్‌ కంట్రోల్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, LED లైట్లు, గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌ ఉన్నాయి.
Royal Enfield Hunter 350 మాత్రం సింపుల్‌ అప్రోచ్‌ తీసుకుంది. ఇందులో సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, LED లైటింగ్‌, ఎంపిక చేసిన వేరియంట్లలో USB Type-C ఛార్జింగ్‌, టాప్‌ వేరియంట్లలో బ్లూటూత్‌ నావిగేషన్‌ ఇస్తారు.

సస్పెన్షన్‌, బ్రేకులు

Hunter 350లో టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌, ప్రీలోడ్‌ అడ్జస్ట్‌మెంట్‌ ఉన్న ట్విన్‌ రియర్‌ షాక్స్‌ ఉన్నాయి. బ్రేకింగ్‌ కోసం 300mm ఫ్రంట్‌, 270mm రియర్‌ డిస్క్‌లు, డ్యుయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా ఇస్తారు.
XSR 155లో USD ఫ్రంట్‌ ఫోర్క్స్‌, రియర్‌ మోనోషాక్‌ ఉన్నాయి. బ్రేకులు 282mm ఫ్రంట్‌, 220mm రియర్‌ డిస్క్‌లు, దీనిలో కూడా డ్యుయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా వస్తుంది.

ధరలు - డబ్బుకు విలువైనది ఏది?

Yamaha XSR 155 ధర సుమారు రూ.1.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).
Royal Enfield Hunter 350 ధరలు రూ.1.37 లక్షల నుంచి రూ.1.62 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) వేరియంట్‌, కలర్‌ను బట్టి మారుతాయి.

ఏది మీకు సరైనది?

క్లాసిక్‌ ఫీల్‌, బలమైన ఇంజిన్‌, రిలాక్స్‌డ్‌ రైడింగ్‌ కావాలంటే Hunter 350 బెస్ట్‌.
లైట్‌వెయిట్‌, స్పోర్టీ క్యారెక్టర్‌, ఆధునిక ఫీచర్లు ఇష్టమైతే Yamaha XSR 155 సరైన ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

Royal Enfield Hunter 350 ఇంజిన్‌ వివరాలు ఏమిటి?

Hunter 350లో 349cc ఎయిర్‌-ఆయిల్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 20.2hp శక్తి, 27Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

Yamaha XSR 155 ఇంజిన్‌ మరియు పనితీరు ఎలా ఉంటుంది?

XSR 155లో 155cc లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది, ఇది 18.4hp శక్తి, 14.2Nm టార్క్‌ అందిస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో స్పోర్టీ అనుభవాన్ని ఇస్తుంది.

రెండు బైక్‌ల బరువు మరియు హ్యాండ్లింగ్‌లో తేడా ఏమిటి?

Yamaha XSR 155 (137kg) చాలా తేలికైనది, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా హ్యాండిల్‌ చేయవచ్చు. Hunter 350 (181kg) కొంచెం బరువుగా ఉంటుంది.

ఫీచర్ల పరంగా ఏ బైక్‌ ముందుంది?

Yamaha XSR 155 ఫుల్‌ డిజిటల్‌ క్లస్టర్, ట్రాక్షన్‌ కంట్రోల్‌ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. Hunter 350 సెమీ-డిజిటల్‌ క్లస్టర్, USB ఛార్జింగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

బ్రేకులు మరియు సస్పెన్షన్‌ వివరాలు చెప్పండి?

Hunter 350లో టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌, ట్విన్‌ రియర్‌ షాక్స్‌ ఉన్నాయి. XSR 155లో USD ఫ్రంట్‌ ఫోర్క్స్‌, రియర్‌ మోనోషాక్‌ ఉన్నాయి. రెండింటికీ డ్యుయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.27 లక్షలకే Hero Xtreme 160R 4V అప్‌డేటెడ్‌ వెర్షన్‌.. కొత్త డిజైన్, మూడు వేరియంట్లు, పవర్‌ఫుల్ ఫీచర్లు!
కొత్త లుక్‌లో Hero Xtreme 160R 4V లాంచ్‌.. క్రూయిజ్ కంట్రోల్, TFT డిస్‌ప్లేతో నయా అప్‌డేట్స్
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget