అన్వేషించండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ 400: మీకు సరిగ్గా సరిపోయే బైక్ ఏది?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 & ట్రయంఫ్ స్పీడ్ 400 ధర, ఇంజిన్, పవర్, బ్రేకులు, ఫీచర్ల పూర్తి పోలిక ఇది. మీకు సరైన బైక్ ఏదో తెలుసుకోండి.

RE Hunter 350 vs 350cc Triumph Speed 400: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 & ట్రయంఫ్ స్పీడ్ 400.. రెండూ 350cc క్లాస్‌కు దగ్గరగా ఉన్న స్ట్రీట్ బైక్‌లు. కానీ.. వీటి లక్షణాలు, పనితీరు, ధరలో మాత్రం భారీ తేడా ఉంది. ముఖ్యంగా ట్రయంఫ్ స్పీడ్ 400లోని ఇంజిన్‌ను 398cc నుంచి 349ccకి తగ్గించారు. 18 శాతం GST శ్లాబ్‌కు సరిపోయేలా ఈ మార్పు చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

హంటర్ 350లో 349cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 20.2hp పవర్ & 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ 400లో కూడా 349cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. అయితే ఇది లిక్విడ్ కూల్డ్ యూనిట్. ఇది 37hp పవర్ & 32Nm టార్క్‌ను అందిస్తుంది. అంటే పవర్ విషయంలో ట్రయంఫ్ స్పీడ్ 400 స్పష్టంగా ముందంజలో ఉంది. హంటర్ కంటే ఏకంగా 16.8hp ఎక్కువ పవర్ ఇస్తుంది. టార్క్‌లోనూ 5Nm అధికంగా ఉంది. అయితే హంటర్ 350లో పవర్ & టార్క్ రెండూ తక్కువ RPM వద్దే లభిస్తాయి. హంటర్ గరిష్ట టార్క్‌ను 4,000rpm వద్ద అందిస్తుంది. స్పీడ్ 400 మాత్రం 7,000rpm వద్ద గరిష్ట టార్క్‌ను ఇస్తుంది.

హంటర్ 350లో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. స్పీడ్ 400లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ, ఎక్కువ పవర్ & టార్క్ కారణంగా స్పీడ్ 400 హైవేపై వేగంగా ప్రయాణించే సత్తా ఉన్న బైక్‌గా నిలుస్తుంది.

 రెండు బైక్‌ల పరిమాణంలో పెద్దగా తేడా లేదు. రెండింటిలోనూ 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. హంటర్ 350 గ్రౌండ్ క్లియరెన్స్ 160mm. స్పీడ్ 400లో ఇది 164mm. హంటర్ 350 బరువు 181kg అయితే, స్పీడ్ 400 బరువు 179kg. అంటే ట్రయంఫ్ బరువు 2kg తక్కువ.

సీటు ఎత్తు విషయంలో మాత్రం హంటర్ 350కి ప్రయోజనం ఉంది. దీని సీటు ఎత్తు 790mm. స్పీడ్ 400లో ఇది 803mm. తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు హంటర్ 350 మరింత సౌకర్యంగా ఉంటుంది. కొత్తగా బైక్ నడపడం ప్రారంభించేవారికి కూడా ఇది సులభంగా అనిపించవచ్చు.

ఇది కూడా చదవండి: RE Hunter 350 ఫైనాన్స్‌ ఆప్షన్లు - తెలుగు రాష్ట్రాల్లో హంటర్ 350 ధర, బెస్ట్‌ EMI ప్లాన్స్ ఇవే!

బ్రేకులు & సస్పెన్షన్ విషయంలో ట్రయంఫ్‌దే పైచేయి. హంటర్ 350లో ముందు 300mm డిస్క్, వెనుక 270mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి. స్పీడ్ 400లో ముందు 300mm, వెనుక 230mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి. రెండు బైక్‌లలోనూ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది.

స్పీడ్ 400లో ముందువైపు 43mm USD ఫోర్క్ & వెనుక మోనోషాక్ ఉన్నాయి. హంటర్ 350లో 41mm RSU ఫోర్క్ & వెనుక ట్విన్ షాక్ సెటప్ ఉంది. ట్రయంఫ్‌లో ముందువైపు ఫోర్‌-పిస్టన్ రేడియల్ కాలిపర్‌ను అందించారు. హంటర్‌లో టు-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ ఉంటుంది. అందువల్ల బ్రేకింగ్ సామర్థ్యంలో స్పీడ్ 400కు ఎడ్జ్‌ ఉంది.

టైర్ల విషయంలోనూ స్పీడ్ 400 కొంత మెరుగ్గా ఉంది. హంటర్ 350లో ముందు 110/70-17 & వెనుక 140/70-17 టైర్లు ఉంటాయి. స్పీడ్ 400లో ముందు 110/80R17 & వెనుక 150/70R17 టైర్లు ఉన్నాయి. రెండు బైక్‌లలోనూ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది.

ఈ రెండు బైక్‌లు అత్యధిక ఫీచర్లను అందించే మోడళ్లు కావు. హంటర్ 350లో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్, టైప్-C USB పోర్ట్, డ్యూయల్ ఛానల్ ABS ఉన్నాయి. హయ్యర్‌ వేరియంట్లలో TFT నావిగేషన్ ట్రిప్పర్ పాడ్ కూడా లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?

స్పీడ్ 400లో నావిగేషన్ ఫీచర్ లేకపోయినా ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. రెండు బైక్‌లు కూడా అవసరమైన ఫీచర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చాయి.

ఈ కంపారిజన్‌లో అసలు కీలకమైన అంశం - ధర. ఈ విషయంలో హంటర్ 350కి ఎడ్జ్‌ ఉంది. హంటర్ 350 బేస్ వేరియంట్ ధర రూ.1.37 లక్షలు & టాప్ వేరియంట్ ధర రూ.1.71 లక్షలు ‍(ఎక్స్-షోరూమ్). ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2.34 లక్షలు (ఎక్స్-షోరూమ్).

అంటే రెండు బైక్‌ల టాప్ వేరియంట్ల మధ్య సుమారు రూ.63,000 ధర తేడా ఉంది. అయితే ధర మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. స్పీడ్ 400లో ఎక్కువ పవర్, ఎక్కువ టార్క్, మెరుగైన బ్రేకులు & మెరుగైన సస్పెన్షన్ ఉన్నాయి. హంటర్ 350 మాత్రం తక్కువ ధర, తక్కువ సీటు ఎత్తు & రిలాక్స్‌డ్ రైడింగ్‌ను అందిస్తుంది.

పెర్ఫార్మెన్స్‌ కోరుకునేవాళ్లకు స్పీడ్ 400 మంచి ఎంపిక. తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్, సౌకర్యవంతమైన & సులభంగా నడపగల బైక్ కోరుకునేవాళ్లకు హంటర్ 350 సరైనది. టెస్ట్ రైడ్ చేస్తే వీటి మధ్య ఉన్న అసలు తేడా స్పష్టంగా తెలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget