అన్వేషించండి

Royal Enfield Himalayan 750 పవర్‌ఫుల్‌ లుక్స్‌తో వస్తోంది, ఈ టూరింగ్‌ వేరియంట్‌ ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

Royal Enfield Himalayan 750 Launch Date: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 750 టూరింగ్ వేరియంట్ త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. లాంచ్‌కు ముందు పరీక్షల సమయంలో రోడ్డుపై ఇది కనిపించింది.

Upcoming Royal Enfield Himalayan 750 Powerful Look: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా లైనప్‌ను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటోంది. ఈ ఎపిసోడ్‌లో, ఈ కంపెనీ తదుపరి పెద్ద లాంచ్ హిమాలయన్ 750. సాధారణంగా, ఏ కార్‌ లేదా బైక్‌ను అయినా లాంచ్‌కు ముందు రోడ్లపై నడిపి పరీక్షిస్తారు & స్థానికి పరిస్థితులకు అనుగుణంగా అవసమైన మార్పులతో లాంచ్‌ చేస్తారు. అదే తరహాలో, హిమాలయన్ 750 కూడా ఇటీవల భారతదేశ రోడ్లపై పరీక్షిస్తున్నప్పుడు కనిపించింది. ఇది ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్, కొత్త డిజైన్‌తో కనిపించింది & లాంగ్ టూరింగ్ రైడ్స్‌కు మరింత మెరుగ్గా పనికొస్తుంది.

ఇంజిన్ & పనితీరు

హిమాలయన్ 750 కొత్త 750cc ప్యార్లల్‌-ట్విన్ ఇంజిన్‌తో రాబోతోంది. ఈ ఇంజిన్, ఇప్పటికే ఉన్న 650cc మోటారుకు అప్‌గ్రేడ్ వెర్షన్. ఇది 50 bhp కంటే ఎక్కువ శక్తిని & 60 Nm టార్క్‌ను జనరేట్‌ చేయగలదని భావిస్తున్నారు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది, ఎంత వేగంలోనైనా మృదువైన & హైవే-ఫ్రెండ్లీ రైడింగ్‌ను అందిస్తుంది. మానసిక ధైర్యం, చురుకుదనం ఉన్న వ్యక్తులు ఇంత పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ ఉన్న బండిని బాగా ఎంజాయ్‌ చేస్తారు.     

టూరింగ్-ఫ్రెండ్లీ సెటప్

ఇది పవర్‌ఫుల్‌ బైక్ మాత్రమే కాదు, దూర ప్రయాణాల కోసం ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తోంది. కొత్త ఫ్రేమ్ & సబ్-ఫ్రేమ్‌ను దీనిలో కనిపించాయి. రైడింగ్‌ సమయంలో USD ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సస్పెన్షన్ మద్దతు ఇస్తాయి. ఈ బైక్‌లో 19-అంగుళాల ముందు & 17-అంగుళాల వెనుక అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, ఇవి రోడ్-స్పెక్ ట్యూబ్‌లెస్ టైర్లకు సరిపోతాయి. ఈ సెటప్ హైవే రైడింగ్‌ & టూరింగ్‌లకు సరిగ్గా సరిపోతుంది.        

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ 

కొత్త హిమాలయన్ 750 మెకానికల్‌గానే కాకుండా సాంకేతికత పరంగా కూడా అప్‌గ్రేడ్ వెర్షన్‌. దీనికి కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్ జత చేశారు, ఇది Google Maps నావిగేషన్ & స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్‌ ఇస్తుంది. దీని అర్థం రైడర్లు టూరింగ్ సమయంలో బండి డిస్‌ప్లేలో అవసరమైన అన్ని సమాచారాలను పొందగలరు.          

లాంచింగ్‌ టైమ్‌లైన్‌

Royal Enfield Himalayan 750 బైక్‌ను మొదటగా మిలాన్ (ఇటలీ)లోని EICMA 2025లో ప్రదర్శించవచ్చు. దీని తర్వాత, దాని అధికారిక లాంచ్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మోటోవర్స్ 2025లో జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.           

హిమాలయన్ 450 Vs హిమాలయన్ 750 - ఏంటి తేడా? 

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ, తన హిమాలయన్ 450 ప్రధానంగా ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించినప్పటికీ, హిమాలయన్ 750 ని ప్రత్యేకంగా టూరింగ్ & లాంగ్-డిస్టెన్స్ క్రూజింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి చేసింది. దీని శక్తిమంతమైన ఇంజిన్, సౌకర్యవంతమైన రైడింగ్ సెటప్, హైవే-ఫ్రెండ్లీ ఫీచర్లు దీనిని సుదూర ప్రయాణాలకు సరైన స్టైలిష్‌ ఆప్షన్‌గా చేస్తాయి.   

 

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget