Royal Enfield Sales: 2024లో దూసుకుపోయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ - ఎన్ని బైక్‌లు అమ్ముడుపోయాయి?
Royal Enfield: 2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సంబంధించి ఏకంగా 8.5 లక్షలకు పైగా అమ్ముడుపోయాయి. దీనికి సంబంధించిన నివేదికను బయటకు వచ్చింది.
Royal Enfield Bikes Sales Report: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. భారతదేశంలో కూడా ఈ బ్రాండ్ మోటార్‌సైకిళ్లకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీని కారణంగా బ్రిటీష్ వాహన తయారీదారులు 2024 సంవత్సరంలో భారతదేశంలో బలమైన అమ్మకాలను కలిగి ఉన్నారు. గత సంవత్సరం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల సేల్స్‌తో తన పాత అమ్మకాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. గత సంవత్సరం రాయల్ ఎన్‌ఫీల్డ్ 8,57,378 యూనిట్లను విక్రయించింది. ఇది 2023 సంవత్సరంలో అమ్ముడుపోయిన బైక్‌ల కంటే నాలుగు శాతం ఎక్కువ. 2023లో, 8,22,295 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు అమ్ముడుపోయాయి.
అత్యధికంగా అమ్ముడుపోతుంది ఇదే...
రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యధికంగా విక్రయిస్తున్న మోటార్ సైకిళ్లలో 350 సీసీ మోడల్స్ ఉన్నాయి. సియామ్ (SIAM) ఇండస్ట్రీ డేటా ప్రకారం 2024 ఏప్రిల్, నవంబర్ నెలల మధ్య కంపెనీ 5,25,568 యూనిట్లను విక్రయించింది. ఇది ఏప్రిల్-నవంబర్ 2023లో విక్రయించిన వాహనాల కంటే 0.05 శాతం ఎక్కువ. ఈ విభాగంలో బుల్లెట్ 350 మరియు క్లాసిక్ 350 వంటి బైక్‌లు ఉన్నాయి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
బజాజ్ కంటే వెనకాల ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ 350-500 సీసీ కేటగిరీ గురించి మాట్లాడితే ఇందులో గెరిల్లా 450, హిమాలయన్ అడ్వెంచర్ బైక్‌లు ఉన్నాయి. ఈ విభాగంలో మొత్తం 27,420 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ విభాగంలో బజాజ్ ఆటో మొత్తం మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. బజాజ్ ఈ విభాగంలో 44,491 యూనిట్లను విక్రయించింది. ఇది మొత్తం మార్కెట్ వాటాలో 51 శాతంగా ఉంది. ఈ విభాగంలో బజాజ్ 56 శాతం వృద్ధిని సాధించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 500-800 సీసీ కేటగిరీ గురించి చెప్పాలంటే... ఈ విభాగంలో 33,152 యూనిట్లను విక్రయించడం ద్వారా వాహన తయారీదారులు 47 శాతం పెరిగారు.
గత 12 ఏళ్లుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాల నివేదికను పరిశీలిస్తే ఎనిమిది లక్షల యూనిట్ల విక్రయాలను సాధించిన మూడో సంవత్సరం క్యాలెండర్ ఇయర్‌గా 2024 నిలిచింది. 2018 సంవత్సరపు అత్యుత్తమ విక్రయాల సంఖ్యను కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అధిగమించింది. 2024లో 8,57,378 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు అమ్ముడుపోయాయి. దీనికి ముందు 2018లో అత్యధికంగా 8,37,669 యూనిట్లు అమ్ముడయ్యాయి.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Our Maestros know the road and your motorcycle like the back of their hands. With Royal Enfield Roadside Assistance, help is just a tap away. Booking is effortless, and our experts will find their way to you.#MachineLove #RoyalEnfieldService #RoyalEnfield #RidePure pic.twitter.com/MIZXWkn5Ke
— Royal Enfield (@royalenfield) January 3, 2025
Looking back at some of our greatest moments of the year with the promise of carrying it all forward into the coming year. Can’t wait to see the new adventures you bring our way, 2025!
— Royal Enfield (@royalenfield) December 31, 2024
Watch the full film here - https://t.co/l0luL2naVS#RoyalEnfield #RidePure #PureMotorcycling pic.twitter.com/4vwqJcfJmt