అన్వేషించండి

Revolt RV 400 Bikes: రీవోల్ట్ RV 400 క్రేజ్.. క్షణాల్లో బుకింగ్స్ క్లోజ్

రీవోల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్‌ క్రేజ్ మామూలుగా లేదు. రీవోల్ట్ ఆర్‌వీ 400 బుకింగ్స్ ప్రారంభించిన క్షణాల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించిందని కంపెనీ ప్రకటించింది.

ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ కంపెనీ రీవోల్ట్ మోటార్స్ రూపొందించే ఎలక్ట్రిక్ బైక్స్‌కు మార్కెట్‌లో క్రేజ్ మామూలుగా లేదు.  ఆ​ర్​వీ 400 మోడల్ అయితే చెప్పనక్కర్లేదు. దీని బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే క్లోజ్ అయిపోతున్నాయంటే దీనికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. తాజాగా రీవోల్ట్ ఆర్‌వీ 400 (Revolt RV 400) ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాల గురించి సంస్థ ఒక ప్రకటన చేసింది. 
రీవోల్ట్ ఆర్‌వీ 400 బుకింగ్స్ ప్రారంభించిన క్షణాల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించిందని కంపెనీ ప్రకటించింది. దీంతో బుకింగ్ నిలిపివేసినట్లు తెలిపింది. రీవోల్ట్ ఆర్‌వీ 400 బైక్‌కు జూన్ నెలలో బుకింగ్స్ పెట్టినప్పుడు రెండు గంటల్లోనే బైక్​లన్నీ బుక్ అయిపోయాయి. అప్పుడు రూ.50 కోట్ల విలువైన బైక్​లకు బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఇక తాజాగా మరోసారి బుకింగ్‌లను ప్రారంభించగా.. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్‌గా నిలిచిందని వెల్లడించింది. 


Revolt RV 400 Bikes: రీవోల్ట్ RV 400 క్రేజ్.. క్షణాల్లో బుకింగ్స్ క్లోజ్

ప్రస్తుతం తమ బైక్స్ వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలుగా ఉందని పేర్కొంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని రీవోల్ట్ తెలిపింది. కాగా, ఈ బైక్‌ను హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కంపెనీ కల్పించింది.  
ఫీచర్లు ఏంటి? 
రీవోల్ట్ ఆర్‌వీ 400 బైక్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవడానికి 4.5 గంటల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ 72 వాట్స్, 3.24 కేడబ్ల్యూహెచ్ (KWh) గా ఉంది. మోటార్ పవర్ 3000 వాట్లుగా ఉంటుంది. 

మిగతా బైక్‌లతో పోలిస్తే ఇది లెయిట్ వెయిట్‌గా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే రిమూవబుల్ బ్యాటరీతో ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనిలో ఇకో, నార్మల్​, స్పోర్ట్స్​ అనే మూడు రైడింగ్ మోడ్స్​ ఉన్నాయి. అవసరానికి తగినట్లు మోడ్ మార్చుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఈ బైక్స్ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించారు. దీని ద్వారా సాంకేతిక సమస్యలను తెలుసుకోవచ్చు. 
ఎందుకంత క్రేజ్.. 
దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇటీవల ప్రకటించిన సబ్సిడీలతో రివోల్ట్ ఆర్​వీ 400 బైక్​ ధరలు భారీగా తగ్గాయి.

రీవోల్ట్ ఆర్‌వీ 400 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,03,999 కాగా (ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది) సబ్సిడీ తర్వాత దీని ధర రూ.90,799కి తగ్గింది. దీంతో ఈ బైక్‌కు డిమాండ్ పెరిగింది. రివోల్ట్ ఆర్​వీ 400 మోడల్​కు ఎనిమిది సంవత్సరాల వారెంటీ ఉంది. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఉండటం వంటివన్నీ దీనిపై క్రేజ్ పెరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. 
అయితే ఇటీవలి కాలంలో ఆర్​వీ 400 మోడల్ బైక్స్‌పై నెగిటివ్ రివ్యూలు కూడా వినిపిస్తున్నాయి. దీని గరిష్ట వేగం 150 కి.మీ అని చెప్పినా 90 కి.మీ వేగాన్ని మించి వెళ్లడం లేదని పలువురు వినియోగదారులు అంటున్నారు. బైక్‌ను ఛార్జ్ చేసేందుకు 5 గంటలకు పైగా సమయం పడుతుందని ఆరోపిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Embed widget