అన్వేషించండి

Renault Triber టైర్లు మార్చాలనుకుంటున్నారా? కొత్త టైర్లు కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

రెనాల్ట్ ట్రైబర్ టైర్ సైజ్, 14 & 15 ఇంచుల వీల్ వివరాలు, వేరియంట్‌లకు సరిపోయే టైర్లు, టైర్ అప్‌గ్రేడ్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

Renault Triber Tyre Size: కారు భద్రతలో టైర్లది చాలా కీలకమైన పాత్ర. రోడ్డుపై గ్రిప్‌, ప్రయాణ సౌకర్యం & ఇంధన సామర్థ్యం వంటివి టైర్లపై ఆధారపడతాయి. అందుకే రెనాల్ట్ ట్రైబర్ యజమానులు సరైన టైర్ సైజ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైర్లు మార్చే సమయంలో సరైన సైజ్ ఎంచుకోకపోతే కారు నడకలో మార్పులు రావచ్చు.

రెనాల్ట్ ట్రైబర్‌లో వేరియంట్‌ను బట్టి రెండు రకాల టైర్ సైజులు కనిపిస్తాయి. 14 ఇంచుల వీల్స్ ఉన్న వేరియంట్లలో సాధారణంగా 165/80 R14 టైర్లు ఉంటాయి. హైయ్యర్‌ వేరియంట్లలో 15 ఇంచుల వీల్స్‌తో 185/65 R15 టైర్లు అందిస్తారు.

165/80 R14 అనే టైర్ కోడ్‌లో ప్రతి అంకెకు ప్రత్యేక అర్థం ఉంది. 165 అంటే మిల్లీమీటర్లలో టైర్ వెడల్పు. 80 అంటే సైడ్‌వాల్ ఎత్తు, ఇది టైర్ వెడల్పులో శాతంగా ఉంటుంది. R అంటే రేడియల్ నిర్మాణం. 14 అంటే ఇంచుల్లో వీల్ రిమ్ వ్యాసం.

బేస్ వేరియంట్లలో సాధారణంగా 14 ఇంచుల స్టీల్ వీల్స్‌తో 165/80 R14 టైర్లు ఉంటాయి. మధ్యస్థ వేరియంట్లలో కూడా ఇదే సైజ్ కొనసాగుతుంది. టాప్ వేరియంట్లలో 15 ఇంచుల వీల్స్‌తో 185/65 R15 టైర్లు ఉంటాయి.

నగరాల్లో రోజువారీ ప్రయాణానికి 14 ఇంచుల వీల్ సెటప్ సౌకర్యవంతంగా ఉంటుంది. రోడ్లపై చిన్న గుంతలు & స్పీడ్ బ్రేకర్లను ఇది మెరుగ్గా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 15 ఇంచుల వీల్ సెటప్ రోడ్డుపై గ్రిప్‌ను పెంచడంతో పాటు కారుకు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది.

వేరియంట్‌ల వారీగా టైర్‌ సైజ్‌లు

వేరియంట్‌ల వారీగా చూస్తే RXE & RXL మోడళ్లకు 165/80 R14 టైర్లను సిఫార్సు చేస్తారు. RXT & RXZ వేరియంట్లకు 185/65 R15 టైర్లు ఉంటాయి. కొత్త టైర్లు కొనుగోలు చేసే ముందు మీ కారులో ఇప్పటికే ఉన్న టైర్ సైజ్‌ను తప్పకుండా పరిశీలించాలి. ఓనర్‌ మాన్యువల్‌ లేదా డ్రైవర్ సీటు దగ్గర ఉన్న స్టిక్కర్‌లోని వివరాలను కూడా చెక్‌ చేయాలి.

టైర్లు మార్చేటప్పుడు కంపెనీ సూచించిన సైజ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన సైజ్‌తోనే స్పీడోమీటర్ రీడింగ్ కచ్చితంగా ఉంటుంది. సస్పెన్షన్ సరిగ్గా పనిచేస్తుంది. కారు నియంత్రణ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఇంధన సామర్థ్యంపైనా అనవసర ప్రభావం ఉండదు.

ఇది కూడా చదవండి: పెట్రోల్, CNG వెర్షన్లు, 5 వేరియంట్లలో Tata Aeris లాంచ్‌.. ధరలు, ఆధునిక ఫీచర్లు ఇవే

పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం

ట్రైబర్‌లో టైర్ సైజ్‌ను పెంచుకోవాలని కొందరు యజమానులు భావిస్తారు. 14 ఇంచుల వీల్స్ నుంచి 15 ఇంచుల అల్లాయ్ వీల్స్‌కు మారడం ఒక మార్గం. అయితే టైర్ మొత్తం వ్యాసంలో మార్పు సాధ్యమైనంత తక్కువగా ఉండాలి. సాధారణంగా 2 నుంచి 3 శాతం పరిధిని మించకుండా చూసుకోవాలి. వీల్ ఆర్చ్‌లో తగినంత స్థలం ఉందో చూడాలి. సస్పెన్షన్ భాగాలతో టైర్ రుద్దుకోకుండా ఉండాలి.

అతి వెడల్పైన టైర్లను ఉపయోగిస్తే ఇంధన సామర్థ్యం తగ్గవచ్చు. స్టీరింగ్ కొంత బరువుగా అనిపించవచ్చు. టైర్ అరిగే వేగం పెరగవచ్చు. స్పీడోమీటర్ రీడింగ్‌లోనూ తేడా రావచ్చు. అందుకే టైర్ అప్‌గ్రేడ్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

టైర్లు కొనేటప్పుడు బ్రాండ్ మాత్రమే చూడకూడదు. నగరాల్లో ఎక్కువగా నడిపితే సౌకర్యం & ఇంధన సామర్థ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. హైవేలపై ఎక్కువగా ప్రయాణిస్తే స్థిరత్వం & అధిక వేగంలో గ్రిప్‌ ముఖ్యమైనవి. నగరం & హైవే రెండింటిలోనూ నడిపితే సౌకర్యం, మన్నిక & గ్రిప్‌ మధ్య బ్యాలెన్స్‌ ఉన్న టైర్లను ఎంచుకోవాలి.

ఇది కూడా చదవండి: 1.3 లక్షలు డౌన్ పేమెంట్ చేసి Tata Aeris కారు కొనవచ్చు.. EMI ఎంత చెల్లించాలి

టైర్ వయస్సును కూడా తప్పక పరిశీలించాలి. ట్రెడ్ బాగానే కనిపించినా పాత టైర్ పనితీరు తగ్గే అవకాశం ఉంది. ఐదు నుంచి ఆరు సంవత్సరాలు దాటిన టైర్లను తరచూ తనిఖీ చేయాలి, అవసరమైతే మార్చాలి.

అలాగే టైర్ లోడ్ రేటింగ్ & స్పీడ్ రేటింగ్‌ను కూడా పరిశీలించాలి. కొత్త టైర్ల రేటింగ్ (సైజ్‌ కాదు) కంపెనీ ఇచ్చిన టైర్లతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.

మొత్తంగా చూస్తే.. రెనాల్ట్ ట్రైబర్‌కు సరైన టైర్ సైజ్ ఎంచుకోవడం కారు పనితీరు & మీ భద్రతకు చాలా ముఖ్యం. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
చెరుకుతో ఇథనాల్ తయారీకి కేంద్రం 'నో'.. పెట్రోల్‌ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఇథనాల్ తయారీకి చెరకు వాడకంపై కేంద్రం బ్రేక్! పెట్రోల్ ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?
RE Bear 650 Review: ఇంటర్‌సెప్టర్ 650 ఉండగా బేర్ 650 ఎందుకు కొనాలి? మూడు నెలల వాడకంలో తెలిసిన ఆసక్తికర విషయాలివే!
Royal Enfield Bear 650.. ఒక్కసారి నడిపితే ఇక ఒదలాలనిపించని ఎడారి రేసింగ్ బైక్‌!
Honda Festive Discounts: హోండా కార్లపై బిగ్‌ డీల్స్‌.. సిటీ, ఎలివేట్, అమేజ్ కొనేవాళ్లకు రూ.2.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
హోండా కార్లపై రూ.2.35 లక్షల వరకు తగ్గింపు.. ఏ కారు కొంటే ఎక్కువ లాభమంటే?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget