Renault Electric Bike: మార్కెట్లో రెనో ఎలక్ట్రిక్ బైక్ - దీని రేటుతో స్కార్పియోనే కొనేయచ్చు బ్రో!
Renault Electric Motorcycle: రెనో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. యూరోపియన్ మార్కెట్లో ఇది లాంచ్ అయింది. దీని ధర 23,340 యూరోలుగా (మనదేశ కరెన్సీలో రూ.21.2 లక్షలు) నిర్ణయించారు.
Renault Electric Motorcycle: పారిస్ మోటార్ షోలో కార్ బ్రాండ్ రెనో నాలుగు ఈ-టెక్ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసింది. రెనో ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తులు కూడా ఆటో పరిశ్రమ దృష్టిని ఆకర్షించాయి. ఈ మోటార్ షోలో రెనో హెరిటేజ్ స్పిరిట్ స్క్రాంబ్లర్ బైక్ గ్లింప్స్ కూడా చూపించింది. ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర 23,340 యూరోలు. దీనిని భారత కరెన్సీలోకి మార్చినప్పుడు జస్ట్ రూ. 21.2 లక్షలు మాత్రమే. భారతదేశ మార్కెట్లో లభించే ఎన్నో బెస్ట్ సెల్లింగ్ కార్ల కంటే దీని ధర చాలా ఎక్కువ. ఉదాహరణకు స్కార్పియో ఎన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.85 లక్షల నుంచి మొదలై రూ. 24.54 లక్షల వరకు ఉంది.
రెనో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్
రెనో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఫ్రెంచ్ స్టార్టప్ కంపెనీ అటెలియర్స్ హెరిటేజ్ బైక్స్ తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర భారతదేశంలో అందుబాటులో ఉన్న ఈవీ కార్ల కంటే చాలా ఎక్కువ. అయితే ఈ బైక్‌లోని విశేషమేమిటంటే ఇది కంప్లీట్‌గా హ్యాండ్ మేడ్. అదే సమయంలో ఈ బైక్ లిమిటెడ్ మోడల్స్ మాత్రమే మార్కెట్లోకి వచ్చాయి. ఈ బైక్ కోసం కంపెనీ బుకింగ్ కూడా ప్రారంభించింది. మీరు ఈ బైక్‌ను బుక్ చేసుకుంటే 2025లో డెలివరీ అవుతుంది. ఈ మోటార్ షోలో రెనో మినీ కారవాన్, ఒక విమానం, వాటర్ వెహికల్‌ని కూడా వెల్లడించింది.
రెనో ఈవీ యొక్క వేరియంట్లు
రెనో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్‌లు గ్లోబల్ మార్కెట్‌లో విడుదల అయ్యాయి. అవే స్టాండర్డ్, 50 వెర్షన్. దీని 50 వెర్షన్ మోడల్ ధర రూ.21.2 లక్షలుగా ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ ధర రూ.22.7 లక్షలుగా నిర్ణయించారు. స్టాండర్డ్ మోడల్ గరిష్ట వేగం గంటకు 99 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. అయితే 50 వెర్షన్ గరిష్ట వేగం గంటకు కేవలం 45 కిలోమీటర్లు మాత్రమే అని కంపెనీ చెప్పింది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ ఎలా ఉంది?
రెనో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఒక నియో రెట్రో స్క్రాంబ్లర్. ఈ బైక్‌లో ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్ ఉంది. ఈ బైక్ సీటు సింగిల్ పీస్ రిబ్డ్ డిజైన్‌తో వస్తుంది. రెనో తన బైక్‌లో చాలా పెద్ద హ్యాండిల్‌బార్‌ను అందించింది. ఇందులో వృత్తాకార బార్ ఎండ్ మిర్రర్లు ఉన్నాయి. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పాత కాలం సాంప్రదాయ మోటార్‌సైకిల్‌ను మరిపిస్తుంది.
రెనో బైక్ ఎంత పవర్ ఫుల్?
ఈ రెనో మోటార్‌సైకిల్ 4.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఈ బైక్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 10 బీహెచ్‌పీ శక్తిని, 280 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఈ రెనో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?