Renault Kigar Latest News: రెనాల్ట్ కీగర్ రీ మోడలింగ్ అప్డేట్.. కళ్లు చెదిరే ఫీచర్లు.. ధరలను రివీల్ చేసిన కంపెనీ
2021లో లాంచ్ అయిన రెనాల్ట్ కీగర్ ను తాజాగా కంపెనీ మళ్లీ రీ మోడలింగ్ చేసి, అనేక హంగులను అమర్చింది. తాజాగా ఈ కారు ధరలను కూడా రివీల్ చేశారు. దీంతో ఈ కారుపై చర్చ జరుగుతోంది.

Renault Kigar Price Revealed: రెనాల్ట్ కంపెనీ పాపులర్ కారు కిగర్ ను రీ మోడలింగ్ చేశారు. ఈ కంపెనీ నుంచి ఈ కారుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఈ కారును రీ మోడలింగ్ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త డిజైన్ , మెరుగైన మాడిఫికేషన్ తో, రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ సబ్ 4m SUV విభాగంలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధర విషయానికొస్తే, రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్‌కు రూ. 6.29 లక్షల (ఎక్స్ షోరూం) నుండి ప్రారంభమవుతుంది.
కిగర్ ఫేస్‌లిఫ్ట్ టర్బో విషయానికి వస్తే, ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమవుతాయి. ఈ వేరియంట్ లో రెండు పవర్‌ట్రెయిన్ ,మూడు గేర్‌బాక్స్ లను నవీనీకరించారు. . ఇక ఈ మోడల్లో విభిన్న శ్రేణి రంగులు ఉన్నాయి. ఒయాసిస్ యెల్లో అనేది డిఫరెంట్ గా ఉంది. ఇందులో మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. DRL సిగ్నేచర్‌తో కొత్త LED హెడ్‌లైట్లు, మినిమలిస్ట్ లోగోతో తయారైన గ్రిల్, కొత్త ఫాగ్ లైట్లు, రీ డిజైనింగ్16-అంగుళాల అల్లాయ్ వీల్ డిజైన్, LED టెయిల్ లైట్ సిగ్నేచర్, ముందు ,వెనుక బంపర్ డిజైన్ లో మార్పు, రెడ్ బ్రేక్ కాలిపర్లు తదితర అంశాలు ఉన్నాయి.
The Renault Kiger facelift is very tastefully done, now offering much-needed 6 airbags along with 21 other safety features as standard.
— Sunderdeep - Volklub (@volklub) August 24, 2025
It continues with the regular 1.0 NA MT and AMT, plus the 1.0 Turbo with CVT AT. 205 mm ground clearance is nice.
A very promising VFM… pic.twitter.com/eA3vCdMrmg
ప్రధాన ఆకర్షణలు..
50 కిలోల లోడ్ బేరింగ్ కెపాసిటీ కలిగిన ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, 205 mm గ్రౌండ్ క్లియరెన్స్, 405L బూట్ స్పేస్ వంటి అంశాలు ఈ కారులోని ప్రధాన ఆకర్షణలుగా అభివర్ణించవచ్చు. అలాగే, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా 21 సెక్యూరిటీ ఫీచర్లు కూడా ముఖ్యమైనవి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో ,ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్‌తో పాటు అదే 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కూడా పొందుపరిచారు.
తేలిక వెయింట్ ఉండటంతో, రెనాల్ట్ సెగ్మెంట్ టార్క్ టు వెయిట్ రేషియోలో అత్యుత్తమమైనది. అత్యంత వేగంగా 0-100 కిమీ చేరుకొనడం, మెరుగైన మైలేజ్ ని ట్రేడ్ మార్కుగా చెప్పుకోవచ్చు.ఛాసిస్ లోపల, రెనాల్ట్ రీన్ఫోర్స్ డిరింగ్, కాంక్రీట్ లోడ్ పాత్‌లు మరియు ఆప్టిమైజ్ చేసిన జాయినరీలను రూపొందించారు. అలాగే డాష్ బోర్డు,కౌల్‌లో మందమైన ఫ్లోర్ కార్పెట్‌లు , ఇన్సులేటెడ్ A పిల్లర్‌ల ద్వారా వాయిస్ నాయిస్ కాన్సిలేషన్ ఫీచర్ ఉంది.
ఫీచర్స్ అప్‌గ్రేడ్..
ఈ మోడల్లో చాలా ఫీచర్లను అప్ గ్రేడ్ చేశారు. లెథరెట్ సీట్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో హెడ్‌లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, వేరియబుల్ స్టీరింగ్ బరువుతో 3 డ్రైవ్ మోడ్‌లు, మెరుగైన NVH స్థాయిలు.
ఇంజిన్ విషయానికొస్తే 1.0 లీ 3-సిలిండర్ ఇంజిన్ , పెట్రోల్ మరియు టర్బోచార్జ్డ్ రెండింటిలోనూ అందించబడుతుంది. రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ 71 bhp గరిష్ట శక్తిని ,96 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ చాయిస్ లతో వస్తుంది. ఇలా చాలా ఫీచర్లతో రెనాల్ట్ ఈ మోడల్ ను అభివృద్ధి చేసింది.





















