కైగర్ నుంచి డస్టర్ వరకు.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే బెనిఫిట్స్, ఈ నెలలో మాత్రమే
రెనాల్ట్ కార్లపై సెప్టెంబర్ 2026లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డస్టర్, కైగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లపై రూ.1.80 లక్షల వరకు బెనిఫిట్స్ పొందొచ్చు.

Renault Car Discounts September 2026: ఈ నెల (సెప్టెంబర్ 2026)లో కొత్త కారు కొనేవాళ్లకు రెనాల్ట్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. తన బ్రాండ్ భారీ ప్రయోజనాలను ప్రకటించింది. డస్టర్ నుంచి కైగర్, ట్రైబర్, క్విడ్ వరకు వివిధ మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
Renault Duster
ఈ ఆఫర్లలో ప్రధాన ఆకర్షణ రెనాల్ట్ డస్టర్. ఈ ఏడాది ప్రారంభంలో కొత్త తరం డస్టర్ మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి తొలిసారి ఈ మోడల్‌పై కంపెనీ ప్రయోజనాలను ప్రకటించింది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.1.80 లక్షల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
ఈ బెనిఫిట్స్‌లో... రూ.30,000 వరకు నగదు తగ్గింపు ఉంది. ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌గా రూ.50,000 వరకు అందుతుంది. రెనాల్ట్ కారును మార్చుకుని కొత్త డస్టర్ తీసుకునే వారికి రూ.10,000 లాయల్టీ బెనిఫిట్ లభిస్తుంది. పాత తరం డస్టర్ నుంచి కొత్త డస్టర్‌కు మారే కస్టమర్లకు ఈ లాయల్టీ బెనిఫిట్ ఏకంగా రూ.1 లక్ష వరకు ఉంటుంది. డస్టర్ ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.18.49 లక్షల వరకు ఉన్నాయి.
Renault Kiger
రెనాల్ట్ కైగర్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్ల ఆధారంగా గరిష్ఠంగా రూ.85,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ.30,000 వరకు నగదు తగ్గింపు ఉంది. లాయల్టీ బెనిఫిట్‌గా రూ.25,000 వరకు పొందొచ్చు. ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌గా మరో రూ.25,000 వరకు అందుతుంది. కార్పొరేట్ లేదా గ్రామీణ కస్టమర్లకు రూ.5,000 వరకు అదనపు ప్రయోజనం ఉంది. కైగర్ ధరలు రూ.5.81 లక్షల నుంచి రూ.10.40 లక్షల వరకు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కేవలం రూ.6.30 లక్షలకే సేఫెస్ట్ హ్యాచ్‌బ్యాక్.. Tata Altroz కనీస డౌన్‌పేమెంట్, నెలవారీ EMI లెక్కలు చూశారా?
Renault Triber
ఫ్యామిలీ కారు కోరుకునేవారికి ట్రైబర్ కూడా ఆసక్తికరమైన ఎంపిక కాగలదు. ఈ మోడల్‌పై గరిష్ఠంగా రూ.50,000 వరకు ప్రయోజనాలు ప్రకటించారు. ఇందులో రూ.20,000 వరకు నగదు తగ్గింపు ఉంది. ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌గా రూ.25,000 వరకు లభిస్తుంది. కార్పొరేట్ లేదా గ్రామీణ కస్టమర్లకు మరో రూ.5,000 వరకు ప్రయోజనం ఉంది. ట్రైబర్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.8.53 లక్షల వరకు ఉంది.
Renault Kwid
అత్యంత చవక కార్లలో ఒకటైన రెనాల్ట్ క్విడ్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.40,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ.15,000 వరకు నగదు తగ్గింపు ఉంది. స్క్రాపేజ్ బోనస్‌గా రూ.25,000 వరకు లభిస్తుంది. క్విడ్ ధర రూ.4.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.5.61 లక్షల వరకు ఉంది.
ఇది కూడా చదవండి: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని టెన్షన్ వద్దు.. ఇంట్లో కూర్చునే ఎలా రెన్యువల్ చేసుకోవాలంటే?
ఈ ఆఫర్లు అన్ని వేరియంట్లకు ఒకే విధంగా ఉండకపోవచ్చు. నగరం, డీలర్, వాహన స్టాక్ ఆధారంగా ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చు. కాబట్టి కారు కొనుగోలు చేసే ముందు సమీపంలోని రెనాల్ట్ డీలర్‌ను సంప్రదించి తుది ఆఫర్ వివరాలను అక్కడే నిర్ధారించుకోవాలి. రెనాల్ట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా తాజా వివరాలను పరిశీలించవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















