Ratan Tata: 1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
Tata Indica: రతన్ టాటా మనదేశంలోనే అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ ఒకటి లాంచ్ చేశారు. అదే టాటా ఇండికా. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Ratan Tata Passed Away: టాటా గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 9వ తేదీ) అర్థరాత్రి ముంబైలోని క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆటో రంగానికి రతన్ టాటా అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనిది. దేశంలో మొట్టమొదటి స్వదేశీ కారును పరిచయం చేసినా లేదా ప్రపంచంలోనే అత్యంత చవకైన నానో కారును పరిచయం చేసినా... భారతదేశంలో మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా కారును విడుదల చేసిన మొదటి వ్యక్తి రతన్ టాటా.
తొలి మేడ్ ఇన్ ఇండియా కారును పరిచయం చేసిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ మొదటి డీజిల్ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా ఇండికాను పరిచయం చేసింది. ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారు అయింది. స్వదేశీ కారు అనే బిరుదు కూడా పొందిన కారు ఇదే. ఈ కారు ధర గురించి చెప్పాలంటే లాంచ్ సమయంలో అంటే 1998లో ఈ కారు ప్రారంభ ధర రూ. 2.6 లక్షలు మాత్రమే. ఈ కారు విడుదలైన వెంటనే భారత మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ కారు అప్పట్లోనే అత్యంత ఆధునిక టెక్నాలజీతో లాంచ్ అయింది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ కారును విడుదల చేసిన వారం రోజుల్లోనే కంపెనీ 1.15 లక్షల యూనిట్లకు ఆర్డర్లు అందుకుంది. టాటా ఇండికా తన సెగ్మెంట్లో నంబర్ వన్ కారుగా నిలిచింది. ఈ కారు మార్కెట్లోకి రాగానే డిస్కషన్ మార్కెట్ కూడా హాట్ హాట్‌గా మారింది. మారుతీ 800, మారుతీ జెన్ వంటి కార్లకు ఈ కారు గట్టి పోటీనిచ్చింది. డీజిల్ వేరియంట్ రాకతో ఆ సమయంలో ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే ఆ సమయంలో డీజిల్ ఇంధనం ధర చాలా తక్కువగా ఉంది. టాటా ఇండికా మైలేజీ గురించి చెప్పాలంటే ఇండికా లీటరుకు దాదాపు 20 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చేది.
మొదటి ఇండికా తయారైనప్పుడు, కారుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. బిజినెస్‌వరల్డ్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ... టాటా ఇండికాకు డీజిల్ కారు వంటి మైలేజీ ఉంటుందని, హిందుస్థాన్ అంబాసిడర్ వంటి పెద్ద ఇంటీరియర్ ఉంటుందని, ఆ తర్వాత ఇండికా కారు గురించి పేర్కొన్న ప్రతి అంశంలోనూ సరైనదని కంపెనీ నిరూపించుకుంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared… pic.twitter.com/p5NPcpBbBD
— Narendra Modi (@narendramodi) October 9, 2024