అన్వేషించండి

Low Safety Rating Cars: ఈ మోస్ట్ పాపులర్ కార్లు కొంటున్నారా? - సేఫ్టీ కూడా చూసుకోండి బాసూ!

Auto News: ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో కొన్నిటికి సంబంధించి సేఫ్టీ రేటింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి.

Auto Updates: దేశీయ కార్ల మార్కెట్లో మారుతి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మారుతికి సంబంధించిన చాలా కార్ల విషయంలో సేఫ్టీ పరమైన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు మారుతి కారును కొనుగోలు చేయాలి అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

మారుతీ సుజుకి స్విఫ్ట్
మారుతి లాంచ్ చేసిన ఈ హ్యాచ్‌బ్యాక్ 2023లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. దీని సేఫ్టీ రేటింగ్ గురించి చెప్పాలంటే గ్లోబల్ NCAPలో దీనికి సింగిల్ స్టార్ రేటింగ్ మాత్రమే దక్కింది. సేఫ్టీ పరంగా ఇది చాలా తక్కువ. అయినప్పటికీ 2023లో దీనికి సంబంధించి 2,03,469 యూనిట్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
దేశీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ పేరు కూడా ఉంది. భద్రతా రేటింగ్ పరంగా ఈ పాపులర్ కారు కూడా అద్భుతాలు చేయలేకపోయింది. క్రాష్ టెస్ట్‌లో కేవలం సింగిల్ స్టార్ రేటింగ్‌ మాత్రమే సాధించింది. కానీ మార్కెట్‌లో మాత్రం గతేడాది ఈ కారు 2,01,302 యూనిట్లు అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి ఆల్టో కే10
గతేడాది 1,27,169 యూనిట్ల విక్రయాలతో ఆల్టో కే10 తర్వాతి స్థానంలో ఉంది. ఈ కారు సెక్యూరిటీ రేటింగ్ గురించి చెప్పాలంటే పెద్దల భద్రతలో దీనికి రెండు స్టార్ల రేటింగ్, పిల్లల భద్రత రేటింగ్‌లో 0 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

అద్భుతమైన బ్రాండ్ విలువ
ఇప్పుడు భారతదేశంలో మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలే ఇందుకు కారణం. మనం జాగ్రత్తగా వెళ్లినా ఏ సమయంలో ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేం. అందుకే ప్రజలు సేఫ్టీ పరంగా మంచి రేటింగ్ ఉన్న కారును కోరుకుంటున్నారు. అయితే మారుతి సుజుకి వాహనాలపై వినియోగదారులకు ఉన్న నమ్మకం కారణంగా ఇది వినియోగదారులకు మొదటి ఆప్షన్‌గా మారింది. దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి వాహనాలకు పోటీగా హ్యుందాయ్, మహీంద్రా, టాటా వంటి కంపెనీల వాహనాలు ఉన్నాయి.

మరోవైపు చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ ఆటోమేకర్ల జాబితాలో చేరాలనే ఆకాంక్షను కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. షావోమీ ఎస్‌యూ7 అనే పేరున్న సెడాన్ కారును తీసుకువచ్చింది. షావోమీ ఎస్‌యూ7 సెడాన్ కారు కంపెనీ తీసుకువస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మోడల్. అత్యంత ప్రజాదరణ పొందిన షావోమీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ కారులో ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల ధరల విషయంలో షావోమీ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. మరి కార్ల విషయంలో కంపెనీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget