Vespa Scooter: వెస్పా కొత్త స్కూటర్ వచ్చేసింది.. క్లాసీ లుక్ అదిరిపోయింది..
పియాజియో సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా వెస్పా 75వ ఎడిషన్ స్కూటర్‌ను విడుదల చేసింది. గ్లాసీ మెటాలిక్ జియా కలర్ ఈ స్కూటర్‌ను హైలైట్ చేసింది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.1.26 లక్షలుగా ఉంది.
ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో నుంచి కొత్త స్కూటర్ ఇండియాలో లాంచ్ అయింది. సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా వెస్పా 75వ ఎడిషన్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 75వ వార్షికోత్సవానికి గుర్తుగా.. స్కూటర్ ముందు భాగంలో ఉండే సైడ్ ప్యానెల్స్‌పై ‘75 డెకాల్స్ (decals)’ అని ముద్రించింది. లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్లుగా ఇవి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. గ్లాసీ మెటాలిక్ జియా కలర్ ఈ స్కూటర్‌ను హైలైట్ చేసింది. దీనికి డార్క్ స్కోక్ గ్రే కలర్ సీటు అందించారు. ఈ స్కూటర్లతో పాటు వెల్‌కమ్ కిట్ కూడా అందించనున్నారు.
Presenting the iconic Vespa 75th Edition, a reflection of the aesthetic, technological and cultural expertise of Vespa.#Vespa75YearsYoung #Vespa75 #VespaInEverySense #LetsVespa #LiveMoreVespa pic.twitter.com/YqRKKAwGkS
— Vespa_IN (@Vespa_IN) August 19, 2021
రెండు వేరియంట్లలో..
మిగతా వెస్పా స్కూటర్లలో లానే 75వ ఎడిషన్‌లో 125 సీసీ, 150 సీసీ ఇంజిన్ ఆప్షన్లను అందించారు. 125 సీసీ ఇంజిన్ వేరియంట్ ధర రూ. 1.26 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్, పూణే ప్రకారం) నిర్ణయించారు. ఇక 150 సీసీ ఇంజిన్ వేరియంట్ ధర రూ. 1.39 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్, పూణే ప్రకారం) ఉంది.
Also Read: Honda CB200X: హోండా నుంచి మరో కొత్త బైక్.. ధరెంతో తెలుసా
ఈ రెండు వేరియంట్ల బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. వీటిని కొనుగోలు చేయాలనుకుంటే కంపెనీ పోర్టల్, డీలర్స్ వద్ద బుకింగ్స్ చేసుకోవచ్చు. బుకింగ్ ధర కింద రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే వెస్పా 75వ ఎడిషన్ స్కూటర్ల డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.
స్పెసిఫికేషన్లు ఇవే..
125 సీసీ వెర్షెన్‌లో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 7500 ఆర్‌పీఎం దగ్గర 9.93 హెచ్‌పీ పవర్.. 5500 ఆర్‌పీఎం దగ్గర 9.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 150 సీసీ వెర్షెన్‌లో 7600 ఆర్‌పీఎం దగ్గర 10.4హెచ్‌పీ పవర్.. 5500 ఆర్‌పీఎం దగ్గర 10.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 125 సీసీ వెర్షెన్‌లో సీబీఎస్, 150 సీసీ వెర్షెన్‌లో ఏబీఎస్ సిస్టమ్ రానుంది. ఈ స్కూటర్ల ముందు భాగంలో 200 ఎమ్ఎమ్ డిస్క్, వెనుక భాగంలో 140 ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.
Also Read: Simple One Scooter: ఓలాకు పోటీగా 'సింపుల్' స్కూటర్.. ఒకసారి చార్జింగ్‌తో 236 కిలోమీటర్లు..