By: ABP Desam | Updated at : 10 Apr 2023 04:57 PM (IST)
దుబాయ్‌లో ఒక కారు నంబర్ రూ.122 కోట్లకు అమ్ముడు పోయింది (Image Source: Pixabay)
Costly Car Number: మామూలుగా మనం కొనే కారు బడ్జెట్ ఎంత ఉండచ్చు? బడ్జెట్‌లో కొనాలనుకుంటే రూ.10 లక్షల్లోపు ఉండేలా చూసుకుంటాం. ఇక ఆ కారుకు నంబర్ అంటే ఎందుకు వచ్చిన అదనపు ఖర్చులే అనుకుని వచ్చిన నంబర్ తీసుకుంటాం. కానీ కేవలం కారు నంబర్ కోసమే రూ.122 కోట్లు ఖర్చు పెట్టారని మీకు తెలుసా?
దుబాయ్‌లో ‘P 7’ అనే నంబర్ కోసం 55 మిలియన్ దిర్హామ్స్‌లు ఖర్చు పెట్టారు. అంటే మనదేశ కరెన్సీలో రూ.122.75 లక్షలు అన్నమాట. దుబాయ్‌లో ‘మోస్ట్ నోబుల్ నంబర్స్’ వేలం నిర్వహించారు. అందులో ఈ నంబర్ రికార్డు సృష్టించింది.
ఈ నంబర్ కోసం బిడ్డింగ్ 15 మిలియన్ దిర్హామ్‌ల నుంచి ప్రారంభం అయింది. కేవలం సెకన్లలోనే ఈ బిడ్డింగ్ 30 మిలియన్ దిర్హామ్‌లకు చేరుకుంది. మరి కొన్ని నిమిషాల్లోనే టెలిగ్రాం యాప్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఈ నంబర్ కోసం 35 మిలియన్ దిర్హామ్‌లకు బిడ్ చేశారు.
ఆ తర్వాత కాసేపటికే బిడ్ మొత్తం 55 మిలియన్ దిర్హామ్‌లకు చేరుకుంది. పేరు తెలపడానికి ఇష్టపడని వ్యక్తి ఈ నంబర్‌ను భారీ మొత్తానికి చేరుకున్నారు. ఈ నంబర్ కోసం బిడ్ పడ్డ ప్రతిసారీ ఆడిటోరియంలో ఉన్న వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
2008లో దుబాయ్‌లోనే ‘1’ నంబర్ 52.5 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడు పోయింది. ఇప్పటివరకు అదే రికార్డు. ఇప్పుడు ‘P 7’ నంబర్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పుడు జరిగిన వేలంలో ఎన్నో వీఐపీ నంబర్ ప్లేట్లు, ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు విక్రయించారు.
ప్రస్తుతం మనదేశంలో రూ. ఐదు లక్షల లోపు రెండు కార్లు అందుబాటులో ఉన్నాయి. అవే మారుతి సుజుకి ఆల్టో కే10, రెనో క్విడ్. ఈ రెండు కార్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేని ధర తక్కువ
మారుతి సుజుకి ఆల్టో కే10 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవే STD (O), LXI, VXI, VXI+ ల్లో ఈ కారు కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.95 లక్షల మధ్య ఉంది.
ఇక రెనో క్విడ్ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. RXE, RXL, RXL (O), RXT, Climber అనే ఐదు ట్రిమ్‌లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.33 లక్షల మధ్యలో ఉంది.
కలర్ ఆప్షన్లు
మారుతి ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్ ఆరు మోనోటోన్ షేడ్స్‌లో వస్తుంది. వీటిలో మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, మెటాలిక్ స్పీడీ బ్లూ, ప్రీమియం ఎర్త్ గోల్డ్, సాలిడ్ వైట్ ఉన్నాయి.
రెనో క్విడ్ ఆరు మోనోటోన్, రెండు డ్యూయల్ టోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఐస్ కూల్ వైట్, మెటల్ మస్టర్డ్, ఫైరీ రెడ్, అవుట్‌బ్యాక్ కాంస్య, మూన్‌లైట్ సిల్వర్, జన్స్కార్ బ్లూ, ఐస్ కూల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, మెటల్ మస్టర్డ్ విత్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి.
Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?
మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!
బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Tesla Entry in India: త్వరలో భారతదేశానికి రానున్న టెస్లా - 2023 చివరిలోపు!
Ajith Kumar: తోటి బైకర్‌కు అజిత్ సర్‌ప్రైజ్ - రూ.12.5 లక్షల విలువైన బైక్ గిఫ్ట్!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!