Ola S1 Air: ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ షూటింగ్ స్టార్ట్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్ విండోను కంపెనీ ఓపెన్ చేసింది.
Ola Electric Booking Window Open: ఓలా ఎట్టకేలకు జూలై 28వ తేదీన తన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 కోసం బుకింగ్ విండోను ఓపెన్ చేసింది. కొద్దిసేపటి తర్వాత కంపెనీ సీఈవో భవిష్య అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ 3,000 బుకింగ్‌లను అందుకున్నట్లు తెలియజేశారు. అది కూడా బుకింగ్స్ ప్రారంభం అయిన కొన్ని గంటల్లోనే. ఓలా ఇప్పటికే తన ఎస్1 వేరియంట్‌ను నిలిపివేసింది. అంటే ఇప్పుడు కంపెనీకి విక్రయించడానికి రెండు ఎంట్రీ లెవల్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎస్1 ఎయిర్, కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో.
ఎంత రేంజ్ లభిస్తుంది?
ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఐదు గంటలు పడుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు.
ఓలా ఎస్1 ప్రో వర్సెస్ ఎస్1 ఎయిర్
కంపేర్ చేయడానికి చెప్పాలంటే ఎస్1 ప్రో ముందు, వెనుకవైపు సింగిల్ షాక్ సస్పెన్షన్‌ను పొందుతుంది. అయితే ఎస్1 ఎయిర్ ట్విన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు డ్యూయల్ షాక్ యూనిట్‌ను పొందుతుంది. ఎస్1 ఎయిర్ రెండు చక్రాలపై డ్రమ్ బ్రేక్‌లను పొందుతుంది. ఎస్1 ప్రో రెండు చక్రాల్లో డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. ఇది కాకుండా అల్లాయ్ వీల్స్ ఎస్1 ప్రోలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి S1 ఎయిర్‌లో లేవు. ఓలా ఎస్1 ఎయిర్... ఎస్1 ప్రో కంటే చాలా తేలికైనది.
ధర ఎంత?
ఓలా ఎస్1 ఎయిర్ మొత్తం 4.5 కేడబ్ల్యూహెచ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని అందించగలదు. ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ. 1.10 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ కంటే ఓలా ఎస్1 ప్రో ధర చాలా ఎక్కువ. ఓలా ఎస్1 ప్రో ధర ప్రస్తుత మార్కెట్లో రూ. 1.40 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) ఉంది. ఏథర్ 450ఎస్‌తో ఓలా ఎస్1 ఎయిర్‌తో పోటీ పడబోతోంది.
From quick chai breaks to last-minute detours. The S1 Air is up for anything. Make it yours at Rs.1,19,999. Purchase window opens on 31st July. #EndICEage pic.twitter.com/OUcsUVQaBz
— Ola Electric (@OlaElectric) July 28, 2023
The versatile OLA S1 Air. Up for anything.#EndICEage pic.twitter.com/m1ewrg36YD
— Ola Electric (@OlaElectric) July 27, 2023
S1 Air starts day after! Love this new Neon color!!
— Bhavish Aggarwal (@bhash) July 26, 2023
Super excited about this😎💪🏼👌🏼 pic.twitter.com/IWH1DdvFdv
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial