అన్వేషించండి

నార్టన్ అట్లాస్‌ GT ఇండియాలోకి వచ్చేసిందోచ్‌: ప్రస్తుతం భారత రోడ్లపై టెస్టింగ్‌, అతి త్వరలో లాంచింగ్‌!

నార్టన్ Atlas GT అడ్వెంచర్‌ బైక్‌ భారత్‌లో తొలిసారి టెస్టింగ్‌లో కనిపించింది. 585cc ఇంజిన్‌, భారత్‌లో తయారీ, ఈ ఏడాది తొలి అర్ధభాగంలో లాంచ్‌ అవకాశం ఉంది.

Norton Atlas GT Spotted In India: బ్రిటిష్‌ లెజెండరీ మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ 'నార్టన్', భారత మార్కెట్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా Spotted Atlas GT అడ్వెంచర్‌ బైక్‌ భారత్‌లో తొలిసారి టెస్టింగ్‌లో కనిపించింది. ఈ టెస్ట్‌ మ్యూల్‌ను ఒక ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ వీడియో రూపంలో పోస్ట్‌ చేయడంతో విషయం బయటకు వచ్చింది.

ఈ వీడియోలో బైక్‌ మొత్తం స్పష్టంగా కనిపించకపోయినా, ఎక్కువగా వెనుక భాగం మాత్రం కనిపించింది. అయితే, కనిపించిన డిజైన్‌ ఎలిమెంట్స్‌ చూస్తే ఇది EICMA షోలో ప్రదర్శించిన Atlas GT మోడల్‌కు చాలా దగ్గరగా ఉందని అర్థమవుతోంది.

డిజైన్‌లో గుర్తించదగిన అంశాలు

టెస్టింగ్‌లో కనిపించిన బైక్‌ పూర్తిగా బ్లాక్‌ కలర్‌ టెస్ట్‌ మ్యూల్‌గా ఉంది. ఇందులో ముఖ్యంగా గమనించదగిన విషయం మిర్రర్స్‌. ఇవి EICMAలో చూపిన Atlas GT మోడల్‌లో ఉన్న మిర్రర్స్‌లాగే ఉన్నాయి. ఎగ్జాస్ట్‌ డిజైన్‌, చైన్‌ ష్రౌడ్‌ కూడా అదే తరహాలో కనిపించాయి.

ఈ టెస్ట్‌ బైక్‌లో హ్యాండ్‌ గార్డ్స్‌ ఉన్నాయి. ఇది అడ్వెంచర్‌ బైక్‌ లక్షణాలను మరింత స్పష్టంగా చూపిస్తోంది. కొత్తగా గమనించిన అంశం ఏమిటంటే, ఇంజిన్‌కు రెండు వైపులా క్రాష్‌ బార్స్‌ ఏర్పాటు చేయడం. ఇవి కఠినమైన రైడింగ్‌ పరిస్థితుల్లో ఇంజిన్‌ను రక్షించేందుకు ఉపయోగపడతాయి.

స్లీక్‌ టెయిల్‌ సెక్షన్‌

ఈ టెస్ట్‌ మ్యూల్‌లో టెయిల్‌ సెక్షన్‌ మరింత స్లీక్‌గా కనిపిస్తోంది. టెయిల్‌ల్యాంప్‌ ఇండికేటర్లలోనే ఇంటిగ్రేట్‌ అయినట్లు అనిపిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ బైక్‌లో లగేజ్‌ మౌంటింగ్‌ ర్యాక్‌ లేదు. దీని ఆధారంగా ఇది టూరింగ్‌ కంటే ఎక్కువగా స్పోర్టీ అడ్వెంచర్‌ వేరియంట్‌గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇంజిన్‌, హార్డ్‌వేర్‌ వివరాలు

నార్టన్ Atlas GTలో 585cc ప్యారలల్‌ ట్విన్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 65 నుంచి 70 hp శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా. బైక్‌ బరువు సుమారు 200 కిలోల దగ్గర ఉండొచ్చని సమాచారం.

Atlas GT వేరియంట్‌లో 17 ఇంచ్‌ అలాయ్‌ వీల్స్‌ అందిస్తారు. అదే సాధారణ Atlas మోడల్‌లో ముందు 19 ఇంచ్‌, వెనుక 17 ఇంచ్‌ క్రాస్‌ స్పోక్‌ వీల్స్‌ ఉంటాయి. EICMAలో ప్రదర్శించిన బైక్‌లు Michelin టైర్లతో వచ్చాయి. అయితే భారత మార్కెట్‌లో విడుదలయ్యే మోడళ్లకు Eurogrip టైర్లు ఇచ్చే అవకాశం ఉంది.

లాంచ్‌ టైమ్‌లైన్‌, మార్కెట్‌ ప్లాన్‌

నార్టన్ Atlas GT ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా నార్టన్ V4 మోడళ్లు అమ్మకాలకు వచ్చిన తర్వాత Atlas, Manx మోడళ్లను ప్రవేశపెట్టే ప్లాన్‌లో కంపెనీ ఉంది.

భారత్‌తో పాటు యూరప్‌, UK, US వంటి కీలక మార్కెట్లలో 200కి పైగా టచ్‌పాయింట్లతో డీలర్‌ నెట్‌వర్క్‌ ద్వారా నార్టన్ బైక్‌లను విక్రయించనున్నారు. అంతేకాదు, Atlas మోడల్‌ను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయడం విశేషం.

మొత్తానికి, నార్టన్ Atlas GT టెస్టింగ్‌ మ్యూల్‌ కనిపించడం భారత అడ్వెంచర్‌ బైక్‌ మార్కెట్‌లో మరో ఆసక్తికరమైన అధ్యాయానికి నాంది పలికినట్టే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget