టాటా మోటార్ లాంచ్ చేసిన టాటా సియెర్రా టాప్ స్పీడ్ ఎంత?

Published by: Shankar Dukanam

టాటా సియెర్రా ఒక మోడ్రన్, లేటెస్ట్ SUV. టాటా మోటార్స్ భారత్‌లో రీ లాంచ్ చేసింది.

కారు 1.5 లీటర్ హైపరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో టెస్టులో అత్యధిక వేగం చూపింది

ఈ SUV టెస్ట్ ట్రాక్ NATRAX పై గంటకు 222 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించింది

ఈ వేగం సాధారణ రహదారి డ్రైవింగ్ కోసం కాదు, కేవలం టెస్ట్ ట్రాక్‌లో నమోదైన వేగం ఇది

రోడ్లపై జర్నీలో వేగం గంటకు 190 కిలోమీటర్ల వరకు పరిమితం కానుంది

టాటా సియెర్రాను ఎక్స్-షోరూమ్ ధర 11.49 లక్షల రూపాయలతో విడుదల చేశారు.

రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ కలిపిన తరువాత ఆన్-రోడ్ ధర పెరుగుతుంది.

ఢిల్లీలో Tata Sierra బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర దాదాపు 13.30 లక్షల రూపాయలు.

హైదరాబాద్‌లో టాటా సియెర్రా బేస్ మోడల్ ధర రూ. 14,10,861గా ఉంది