అన్వేషించండి

2026లో నెక్ట్స్‌ జనరేషన్‌ బజాజ్‌ పల్సర్ క్లాసిక్‌ లాంచ్‌.. కొత్త ప్లాట్‌ఫామ్‌, మోనోషాక్‌, మోడ్రన్‌ ఫీచర్లు

2026లో బజాజ్‌ పల్సర్ క్లాసిక్‌ బైక్స్‌కు భారీ అప్‌డేట్‌ రానుంది. కొత్త చాసిస్‌, మోనోషాక్‌, మోడ్రన్‌ డిజైన్‌, LED ఫీచర్లతో పల్సర్ 125, 150 లాంచ్‌కు సిద్ధమైంది.

Bajaj Pulsar Classic 2026: బజాజ్‌ పల్సర్... భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఒక ఐకానిక్‌ నేమ్‌. 2001లో పల్సర్ ప్రవేశించినప్పటి నుంచి యువతతో పాటు కుటుంబ వినియోగానికి కూడా బాగా ఆదరణ పొందింది. ఇక 2026లో పల్సర్ బ్రాండ్‌కు 25 ఏళ్లు పూర్తి కానుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్‌ జనరేషన్‌ బజాజ్‌ పల్సర్ క్లాసిక్‌ మోడళ్లను లాంచ్‌ చేయడానికి బజాజ్‌ సిద్ధమవుతోంది.

బజాజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, CEO రాజీవ్‌ బజాజ్‌, “2026 పల్సర్ సంవత్సరం” అని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ స్టేట్‌మెంట్‌కు అనుగుణంగా, పల్సర్ క్లాసిక్‌ రేంజ్‌లో, గత రెండు దశాబ్దాల్లోనే అతి పెద్ద అప్‌డేట్‌ రానుందని సమాచారం.     

కొత్త ప్లాట్‌ఫామ్‌పై పల్సర్ క్లాసిక్‌
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లు పాత డబుల్‌ క్రేడిల్‌ ఫ్రేమ్‌, ట్విన్‌ రియర్‌ షాక్‌ అబ్జార్బర్లతో కొనసాగుతున్నాయి. అయితే 2026లో రానున్న కొత్త మోడళ్లు సరికొత్త చాసిస్‌పై రూపొందనుండటం కీలక మార్పు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పల్సర్ N సిరీస్‌లో ఈ సెటప్‌ మంచి రైడ్‌, హ్యాండ్లింగ్‌ బ్యాలెన్స్‌ను చూపించింది. అదే అనుభవాన్ని ఇప్పుడు క్లాసిక్‌ పల్సర్‌లకు తీసుకురావాలని బజాజ్‌ యోచిస్తోంది.

ఇంజిన్‌లో మార్పులు
కొత్త చాసిస్‌ వస్తే, ఇంజిన్‌లో కూడా మార్పులు సహజం. ఈసారి ఇంజిన్‌ను స్ట్రెస్డ్‌ మెంబర్‌గా ఉపయోగించే అవకాశం ఉంది. అయితే 125cc, 150cc సెగ్మెంట్‌లను మాత్రం బజాజ్‌ మార్చే అవకాశం తక్కువ. ఎందుకంటే ఈ ఇంజిన్‌ సామర్థ్యాలే పల్సర్ క్లాసిక్‌ అమ్మకాలకి ప్రధాన బలం.

డిజైన్‌లో గుర్తించదగిన మార్పులు
2006లో వచ్చిన వుల్ఫ్‌ ఐ డిజైన్‌ పల్సర్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పటికీ పల్సర్ 150, 125 మోడళ్లలో అదే డిజైన్‌ స్పూర్తి కనిపిస్తుంది. కొత్త మోడళ్లలో కూడా ఇదే మ్యాచ్‌ లుక్‌ను కొనసాగిస్తూ, ఎవల్యూషనరీ డిజైన్‌ తీసుకురానున్నారు. ఇంకా... పెద్ద ఫ్యూయల్‌ ట్యాంక్‌, షార్ప్‌ లైన్స్‌, అగ్రెసివ్‌ స్టాన్స్‌ కొనసాగుతాయని అంచనా. అదనంగా LED హెడ్‌ల్యాంప్స్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి మోడ్రన్‌ ఫీచర్లు అందే అవకాశం ఉంది.        

లాంచ్‌ టైమ్‌లైన్‌
నెక్స్ట్‌ జనరేషన్‌ పల్సర్ క్లాసిక్‌ బైక్స్‌ 2026 రెండో అర్ధ భాగంలో, అంటే ఆగస్టు ప్రాంతంలో లాంచ్‌ కావచ్చని అంచనా. పండుగల సీజన్‌ను టార్గెట్‌గా చేసుకుని బజాజ్‌ ఈ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్లాన్‌ చేస్తోంది.        

అంచనా ధరలు
కొత్త పల్సర్ 125 ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ.80,000 నుంచి రూ.90,000 మధ్య ఉండొచ్చు. పల్సర్ 150 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.15 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి, రెండు దశాబ్దాల తర్వాత పల్సర్ క్లాసిక్‌కు రానున్న ఈ భారీ అప్‌డేట్‌తో... 2026లో పల్సర్ పేరు మళ్లీ రోడ్లపై గట్టిగా వినిపించనుంది.       

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.                   

టాప్ హెడ్ లైన్స్

Driving Licence Renewal: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా? ఇంట్లోనే ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోండి.. కేవలం 12 స్టెప్స్‌లో!
Kia Carens Clavisలో ఏ వేరియంట్‌ ధర ఎంత? మిడ్‌ వేరియంట్‌లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavis లో 11 వేరియంట్లు.. ధర, ఫీచర్ల పరంగా మీకు ఏది బెస్ట్?
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
AdBlue In Cars: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
డీజిల్ కారులో AdBlue అంటే ఏమిటి? ఇది అయిపోతే ఇంజిన్ మళ్లీ స్టార్ట్ కాదా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget