అన్వేషించండి

New Maruti Suzuki Dzire: మారుతి సుజుకి కొత్త డిజైర్ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?

New Maruti Suzuki Dzire Launch Date: కొత్త మారుతి సుజుకి డిజైర్ మనదేశంలో నవంబర్ 11వ తేదీన లాంచ్ కానుంది. ఈ కారుకు సంబంధించిన ఫొటో ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

New Maruti Dzire: మారుతి సుజుకి భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన డిజైర్‌కు సంబంధించిన కొత్త తరం మోడల్‌ను తీసుకురానుంది. ఈ కారు నవంబర్ 11వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. మారుతి లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ కారు కొత్త లుక్, స్టైల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కొత్త తరం డిజైర్ మోడల్ పాత కారుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కారు కొత్త డిజైన్‌తో భారతదేశంలోకి రాబోతోంది.

మారుతి డిజైర్ డిజైన్
మారుతి డిజైర్ లీక్ అయిన ఫోటోను చూస్తుంటే ఈ కారు మునుపటి కంటే ఎక్కువ ప్రీమియం కావచ్చని స్పష్టమవుతుంది. ఈ కారు స్లిమ్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. వీటిని క్రోమ్ లైన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ మారుతి కారు మునుపటి మోడల్ కంటే పెద్ద గ్రిల్ కలిగి ఉంటుంది. మారుతి డిజైర్ పొడవు మునుపటిలాగా నాలుగు మీటర్ల పరిధిలో ఉంటుంది. కారు వెనుక భాగంలో పెద్ద క్రోమ్ లైన్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇది టెయిల్ ల్యాంప్‌లతో అనుసంధానం అయి ఉంటుంది.

Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!

డిజైర్ ఇంటీరియర్
కొత్త మారుతి డిజైర్ లోపలి భాగం స్విఫ్ట్‌ని పోలి ఉంటుంది. కానీ ఆటోమేకర్ ఈ కొత్త కారును వేరే కలర్ స్కీమ్‌తో అందించవచ్చు. ఈ కారులో కనిపించే టచ్‌స్క్రీన్ స్విఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఈ కారులో ఉన్న అతిపెద్ద ఫీచర్ సన్‌రూఫ్. ఇది ప్రస్తుత డిజైర్‌లో లేదు. ఇంకా ఇండియన్ మార్కెట్లో ఉన్న ఏ కాంపాక్ట్ సెడాన్‌లో కూడా సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో లేదు. ఈ కారు అన్ని ఫీచర్ల గురించి ఖచ్చితమైన సమాచారం డిజైర్ లాంచ్ సమయంలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

మారుతి డిజైర్ పవర్
మారుతి డిజైర్ ఈ కొత్త తరం మోడల్ పవర్‌ట్రెయిన్‌ను మార్చవచ్చు. కొత్త స్విఫ్ట్ మాదిరిగానే ఈ కారులో జెడ్ సిరీస్ 3 సిలిండర్ ఇంజన్ ఉండవచ్చు. ఈ ఇంజన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను కూడా అందించవచ్చని తెలుస్తోంది. దాని స్టాండర్డ్ మోడల్‌లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండే అవకాశం ఉంది. మారుతి తీసుకురానున్న ఈ కొత్త మోడల్ కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారు పెర్ఫార్మెన్స్ ఎలా ఉండనుందో బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతోనే తెలుస్తందని అనుకోవచ్చు.

Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!

టాప్ హెడ్ లైన్స్

వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Embed widget