అన్వేషించండి

మళ్లీ కొత్త లుక్‌తో రానున్న మహీంద్రా థార్‌ - ఈసారి C-షేప్‌ DRLs, కొత్త గ్రిల్‌, భారీ అల్లాయ్ వీల్స్‌ కూడా

కొత్త డిజైన్‌ అప్‌డేట్‌తో మహీంద్రా థార్‌ స్పై అయ్యింది. C-షేప్‌ DRLs, కొత్త గ్రిల్‌, పెద్ద అల్లాయ్ వీల్స్‌, అదనపు ఫీచర్లతో మరో రిఫ్రెష్‌ రానుందని సంకేతాలు కనిపించాయి.

New Mahindra Thar Update: రోడ్డుపై ప్రత్యేక గుర్తింపుతో & ప్రతి ఒక్కళ్లూ కన్నార్పకుండా చూసే SUVల్లో మహీంద్రా థార్‌ ఒకటి. ఈ కారు అంటే భారతీయులకు పిచ్చ క్రేజ్‌. రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌, ఆఫ్‌రోడ్‌ సామర్థ్యం, స్ట్రాంగ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌… ఇవన్నీ కలిసి థార్‌ను యూత్‌తో పాటు అడ్వెంచర్‌ ప్రియులకు దగ్గర చేశాయి. ఇప్పటికే, 2025 అక్టోబర్‌లో, ప్రస్తుత జనరేషన్‌ థార్‌కు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి కొత్త డిజైన్‌ మార్పులతో థార్‌ టెస్టింగ్‌ మోడల్‌ కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల రోడ్లపై కనిపించిన థార్‌ టెస్ట్‌ మ్యూల్‌… కొంతమేర క్యామఫ్లాజ్‌తో కనిపించినప్పటికీ, ఇందులో ఉన్న కొన్ని డిజైన్‌ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా థార్‌ Roxx తరహా డిజైన్‌ ఎలిమెంట్స్‌ ఇందులో ఉండొచ్చనే చర్చ మొదలైంది.

కొత్త డిజైన్‌ మార్పులు ఏమిటి?
ఇప్పటివరకు బయటపడిన స్పై ఫోటోల ప్రకారం, కొత్త థార్‌లో ప్రోజెక్టర్‌ LED హెడ్‌ల్యాంప్స్‌తో C-షేప్‌ డే టైమ్‌ రన్నింగ్‌ ల్యాంప్స్‌ (DRLs) కనిపిస్తున్నాయి. ఇది థార్‌ లుక్‌ను మరింత మోడ్రన్‌గా, షార్ప్‌గా చూపించే అవకాశం ఉంది. అదే విధంగా... ఇప్పటి వరకు ఉన్న 7-స్లాట్‌ గ్రిల్‌కు బదులుగా డబుల్‌ స్టాక్డ్‌ 6-స్లాట్‌ గ్రిల్‌ రానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది థార్‌ Roxx డిజైన్‌ను గుర్తు చేసేలా ఉంది. అదనంగా, కొత్త డైమండ్‌ కట్‌ అల్లాయ్ వీల్స్‌ కూడా కనిపించాయి. ఇవి సుమారు 19 ఇంచ్‌ సైజ్‌లో ఉండొచ్చని అంచనా.           

ఇంటీరియర్‌లో ఏమి మారొచ్చు?
స్పై ఫోటోలలో ఇంటీరియర్‌ పూర్తిగా కనిపించకపోయినా, ఈసారి థార్‌లో కొన్ని ప్రీమియం ఫీచర్లు జోడించే అవకాశం ఉంది.        

వాటిలో ముఖ్యంగా –

  • ముందు సీట్లకు వెంటిలేటెడ్‌ ఫంక్షన్‌
  • ఆటో డిమ్మింగ్‌ IRVM
  • పవర్‌ ఫోల్డింగ్‌ ORVMs
  • పుష్‌ బటన్‌ స్టార్ట్‌
  • వైర్‌లెస్‌ చార్జర్‌

ఇలాంటి ఫీచర్లు వస్తే, థార్‌ డైలీ యూజ్‌కి మరింత కంఫర్ట్‌ కలిగించే SUVగా మారుతుంది.

ఇంజిన్‌, గేర్‌బాక్స్‌లో మార్పులుంటాయా?
ఈ అప్‌డేట్‌లో ఇంజిన్‌ పరంగా పెద్ద మార్పులు వచ్చే అవకాశం తక్కువ. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌, 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు అలాగే కొనసాగొచ్చు. పెట్రోల్‌ వేరియంట్‌కు ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ ఆప్షన్‌గా, శక్తిమంతమైన డీజిల్‌ వేరియంట్‌కు స్టాండర్డ్‌గా ఇవ్వడం కొనసాగవచ్చని అంచనా.

లాంచ్‌ ఎప్పుడు?
ఈ కొత్త అప్‌డేట్‌కు సంబంధించిన లాంచ్‌ టైమ్‌లైన్‌ ఇంకా స్పష్టంగా లేదు. అయితే, ఇది రోడ్డుపై కనిపించడాన్ని బట్టి చూస్తే, రాబోయే నెలల్లో మహీంద్రా అధికారికంగా ఈ రిఫ్రెష్‌ మోడల్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే, థార్‌ అభిమానులకు ఇది మరో ఆసక్తికరమైన వార్త. Roxx తరహా డిజైన్‌ టచ్‌తో, మోడ్రన్‌ ఫీచర్లతో వచ్చే ఈ కొత్త థార్‌… మార్కెట్‌లో మరింత హీట్‌ పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget