Kia Seltos Diesel Automatic Review: కియా సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ రివ్యూ: మంచి పవర్, సూపర్ మైలేజ్ - కొనవచ్చా?
New Kia Seltos Diesel Automatic Review: కియా సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ ఎలా ఉంది? కొనవచ్చా?
Kia Seltos Diesel Automatic: కియా కార్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్ సెల్టోస్. ఇప్పటి వరకు కంపెనీ లాంచ్ చేసిన ఉత్తమ మోడల్ కూడా ఇదే. ఈ ఎస్‌యూవీ ఈ సంవత్సరం కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అప్‌డేట్ అయింది. దీని డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ చాలా ఆసక్తికరంగా బాగుంటుందని అందరికీ తెలుసు. కాంపాక్ట్ ఎస్‌యూవీ స్పేస్‌లో ఇది ఉత్తమ ఆప్షన్లలో ఒకటి.
ఇప్పుడు చాలా మంది కార్ల తయారీదారులు డీజిల్ ఆప్షన్ నుంచి మెల్లగా బయటకు వస్తున్నారు. అయితే కియా ఇప్పటికీ సెల్టోస్‌లో డీజిల్ వెర్షన్‌ను విక్రయిస్తుంది. ఎందుకంటే దీని అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్, ఆటోమేటిక్ కాంబో రివ్యూ ఇప్పుడు చూద్దాం.
శక్తివంతమైన, సైలెంట్ ఇంజిన్
సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్న డీజిల్ ఇంజన్ 115 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం టార్క్‌ను డెలివర్ చేస్తుంది. ఇది 1.5 లీటర్ యూనిట్. పాడిల్ షిఫ్టర్‌లతో కూడిన 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఈ కారులో చూడవచ్చు. డీజిల్ ఇంజిన్ లో పిచ్, లో స్పీడ్ వద్ద చాలా క్లీన్‌గా, స్మూత్‌గా వెళ్లిపోతుంది. అధిక వేగంలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ డీజిల్ ఇంజిన్ లాగా ఉంటుంది. ల్యాగ్‌ను మాత్రం ఇది బాగా నియంత్రిస్తుంది. ఆ సమయంలో ఇది 'సాధారణ డీజిల్' ఇంజిన్ లాగా అనిపించదు. తక్కువ వేగంలో ఇంజిన్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. లీనియర్ పవర్ డెలివరీతో దీన్ని ఉపయోగించడం చాలా సులభం.
బలమైన మైలేజీ కూడా...
హైవేపై సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ క్రూయిజ్‌లు అధిక వేగంతో సాఫీగా ప్రయాణిస్తాయి. అయితే ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎడిషన్ డౌన్‌షిఫ్టింగ్‌లో కొంచెం నెమ్మదిగా ఉంటుంది. అలాగే తక్కువ పవర్ డెలివరీని కూడా కలిగి ఉందని గమనించాలి. సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్... సౌకర్యవంతమైన క్రూయిజర్‌గా చాలా బాగా పనిచేస్తుంది. దీని మైలేజీక కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. సిటీలో, హైవేలో లీటరుకు 14 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందవచ్చు. ఆటోమేటిక్ డీజిల్ సెల్టోస్‌కు సంబంధించిన టాప్ ఎండ్ వేరియంట్‌గా ఉంది. అంటే మీరు కియా సెల్టోస్‌లో లభించే అన్ని ఫీచర్లనూ పూర్తిగా పొందుతారని అర్థం.
సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 20 లక్షల కంటే తక్కువగా ఉంది. ఈ కారు అద్భుతమైన లాంగ్ రేంజ్ క్రూయిజర్ అని చెప్పవచ్చు. డీజిల్ కార్లు ఈ రోజుల్లో తక్కువ జనాదరణ పొందుతున్నాయి. కానీ లాంగ్ డ్రైవ్‌లకు ఆటోమేటిక్ కావాలనుకునే వారికి, సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్ మంచి ఆప్షన్. అదే సమయంలో ఫ్రెష్ లుక్‌ను, ఫీచర్ ప్యాక్డ్ క్యాబిన్‌ను కూడా అందిస్తుంది. మీరు ఎక్కువ లాంగ్ డ్రైవ్‌లు చేస్తూ డీజిల్ ఇంజిన్ ఉన్న కారు కోసం చూస్తుంటే కచ్చితంగా సెల్టోస్‌ను ఎంచుకోవచ్చు.