అన్వేషించండి

New Honda Unicorn: మార్కెట్లోకి కొత్త యూనికార్న్ - ఏమేం మార్చారు? రేటు ఎంత ఉంది?

New Honda Unicorn Launched: మార్కెట్లో కొత్త హోండా యూనికార్న్ బైక్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను కంపెనీ అందించింది. అవేంటో మనం తెలుసుకుందాం.

Honda New Motorcycle: హోండా యునికార్న్ అప్‌డేటెడ్ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. హోండా ఈ మోటార్‌సైకిల్‌లో అనేక ఫీచర్లను పొందుపరిచింది. తద్వారా ఇది మార్కెట్లో ఉన్న మిగిలిన బైకులకు గట్టి పోటీనిస్తుంది. ఈ బైక్ గత 20 ఏళ్లుగా మార్కెట్‌లో ఉంది. ఈ 20 ఏళ్లలో వాహన తయారీదారులు హోండా యునికార్న్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. హోండా యునికార్న్‌లో ఏయే కొత్త ఫీచర్లను పొందుపరిచారు? ఈ ఫీచర్లను జోడించిన తర్వాత ఈ బైక్ ధరలో ఎంత తేడా వచ్చిందో తెలుసుకుందాం. 

హోండా యునికార్న్ కొత్త ఫీచర్లు
హోండా యునికార్న్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్‌స్టాల్ చేశారు. దీంతో పాటు ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సర్వీస్ రిమైండర్, 15W యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు. బైక్‌లో గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో ఇండికేటర్ కూడా ఉన్నాయి. మోటార్‌సైకిల్‌లో ఈ కొత్త ఫీచర్లన్నీ రావడంతో హోండా ఈ బైక్ అమ్మకాల ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటోంది.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

హోండా బైక్ ఇంజిన్ ఎలా ఉంది?
ఈ హోండా బైక్‌లో 163 ​​సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ అందించారు. బైక్‌లోని ఈ ఇంజన్ 13 బీహెచ్‌పీ పవర్, 14.6 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది. దీంతో పాటు ఓబీడీ2 (ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ 2) కూడా ఇన్‌స్టాల్ అయింది. దీని కారణంగా ఈ బైక్ లిమిట్‌కి మించి పొల్యూట్ చేయదు.

ఈ కొత్త మోడల్ ధర ఎంత?
ముంబైలో హోండా యునికార్న్ కొత్త మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 1.34 లక్షల నుంచి మొదలై రూ. 1.45 లక్షల వరకు ఉంటుంది. హోండా తీసుకొచ్చిన ఈ కొత్త బైక్ మూడు కలర్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, రేడియంట్ రెడ్ మెటాలిక్ కలర్‌లను కలిగి ఉంది.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Embed widget