అన్వేషించండి

ABS In Bikes: ABS అంటే ఏంటి, ఎందుకు అవసరం? - బైకులు, స్కూటర్లలో ఎలా పనిచేస్తుంది?

New Bike Rules: వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని కొత్త ద్విచక్ర వాహనాలలో ABS తప్పనిసరిగా ఉంటుంది. ABS అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది & అది ఎందుకు ముఖ్యం?

ABS Safety System For Two Whellers: భారతదేశంలో ద్విచక్ర వాహనాల (బైకులు & స్కూటర్ల) రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. చాలా సందర్భల్లో, రైడర్‌ ప్రాణాలు కోల్పోతున్నాడు & అతని కుటుంబం రోడ్డున పడుతోంది. దీనిని నివారించడానికి, కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం, 2026 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో విక్రయించే ప్రతి కొత్త బైక్ & స్కూటర్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండటం తప్పనిసరి, 

ABS ఎందుకు అవసరమైంది?
దేశంలో జరుగుతున్న మొత్తం రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 44% ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే. అంతేకాదు, ద్విచక్ర వాహనాల అమ్మకాలలో దాదాపు 45% సేల్స్‌ 125cc కంటే తక్కువ కేటగిరీలోనే ఉన్నాయి. ఇప్పటివరకు, ఈ విభాగంలోని బైక్‌లు & స్కూటర్లలో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) మాత్రమే ఉంది, ఇది రెండు బ్రేక్‌లను ఒకేసారి యాక్టివేట్‌ చేస్తుంది. CBS అనేది ఒక బేసిక్‌ సేఫ్టీ ఫీచర్‌, సమర్ధవంతంగానే పని చేస్తుంది. అయినప్పటికీ, దీనికంటే ABS ఇంకా చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ముఖ్యంగా అధిక వేగంలో ఉండి ఒక్కసారిగా బ్రేక్‌ వేసినప్పుడు రైడర్‌ ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేయబోతోంది.

ABS ఎలా పనిచేస్తుంది?
ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఒక అధునాతన భద్రత వ్యవస్థ. షార్ప్‌ బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ అవ్వకుండా ఇది నిరోధిస్తుంది. ఉదాహరణకు... రైడర్‌ వేగంగా వెళుతున్నప్పుడు మరేదైనా బండి, జంతువు, స్పీడ్‌ బ్రేకర్‌ లేదా గుంత వంటివి అతి దగ్గరలో అకస్మాత్తుగా కనిపించినప్పుడు వెంటనే బ్రేక్‌ వేస్తాడు. దీనివల్ల ఆ టూవీలర్‌ చక్రాలు లాక్ అవ్వవచ్చు లేదా స్కిడ్‌ కావచ్చు. ఈ రెండిటిలో ఏది జరిగినా ఆ బండి ఒక్కసారిగా పడిపోతుంది, రైడర్‌కు ఎక్కువ గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. టూవీలర్‌లో ABS సేఫ్టీ ఉంటే ఇలాంటి ప్రమాద తీవ్రత చాలావరకు తగ్గిపోతుంది. ABS నిరంతరం సెన్సార్ ద్వారా చక్రాల వేగాన్ని పర్యవేక్షిస్తుంది. రైడర్‌ బ్రేక్‌ వేసినప్పుడు చక్రం లాక్ అవ్వడం ప్రారంభించిన వెంటనే, ABS ఆ బ్రేక్ ఒత్తిడిని తగ్గించడం, పెంచడం చేస్తుంది & దానిని పల్సింగ్ యాక్షన్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియ చక్రాలు లాక్ అవ్వకుండా చూస్తుంది & బండిని రైడర్‌ కంట్రోల్‌లో ఉంచుతుంది. ఈ ఫీచర్ ముఖ్యంగా తడిసిన, జారుతున్న & అసమానంగా ఉన్న రోడ్లపై అద్భుతంగా పని చేస్తుంది & ప్రమాదాల అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. అంటే.. ABS ఉన్న బైక్‌ రైడర్‌కు అదనపు రక్షణ కవచం ఉన్నట్లే.

కొత్త నియమం ఏ వాహనాలకు వర్తిస్తుంది?
కేంద్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం,  2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి లాంచ్ అయ్యే ప్రతి కొత్త బైక్ & స్కూటర్‌లో ABS తప్పనిసరి. అది 100cc ఎంట్రీ-లెవల్ బైక్ అయినా లేదా 250cc హై-ఎండ్ స్పోర్ట్స్ బైక్ అయినా, అన్నింటికీ ABS ఫీచర్‌ను కంపెనీ అందిస్తుంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ మార్పును మొదలు పెట్టాయి. ఉదాహరణకు.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R భారతదేశంలోనే అత్యంత చవకైన 125cc ABS బైక్.

టాప్ హెడ్ లైన్స్

పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget