News
News
X

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్‌లుక్‌ను కంపెనీ టీజ్ చేసింది.

FOLLOW US: 

ఎంజీ మోటార్ తమ కొత్త హెక్టార్ ఫేస్ లిఫ్ట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ముందువైపు పెద్ద డైమండ్ గ్రిల్ డిజైన్‌తో చూడగానే ఆకట్టుకునేలా ఎంజీ హెక్టార్ ఫేస్ లిఫ్ట్ ఉండటం విశేషం. గతంలో ఉన్న డీఆర్ఎల్ సెటప్‌నే కొత్త హెక్టార్‌లో కూడా కంటిన్యూ చేశారు. ఈ కొత్త గ్రిల్ మరింత పెద్దగా, ఆకట్టుకునేలా ఉంది. ముందువైపు ఎక్కువ భాగాన్ని మెష్ ప్యాటర్నే కవర్ చేసింది.

దీని హెడ్ ల్యాంప్స్ మాత్రం కొంచెం కిందకే ఉన్నాయి. స్కిడ్ ప్లేట్ కూడా కొత్త తరహాలో ఉంది. గతంలో ఉన్న హెక్టార్‌తో పోలిస్తే ఇందులో గ్రిల్ పెద్దగా ఉంది. ఈ కొత్త హెక్టార్ మనదేశంలో సంవత్సరం చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంజీ హెక్టార్‌లో కొత్త అలోయ్ వీల్స్ కూడా అందించనున్నారు.

ఎంజీ ఈ సంవత్సరం మార్చిలో మనదేశంలో తన కొత్త  జెడ్ఎస్ ఈవీని లాంచ్ చేసింది. దీని ధర రూ.21.99 లక్షల (ఎక్స్‌-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. జెడ్ఎస్ ఈవీ రెండు సంవత్సరాల క్రితమే అధికారికంగా లాంచ్ అయింది. మొట్టమొదట మనదేశంలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇది కూడా ఒకటి. గతంలో లాంచ్ అయిన మోడల్ కంటే ఎక్కువ రేంజ్ ఇందులో అందించారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త వెర్షన్‌లో స్టైలింగ్‌ను అప్‌డేట్ చేశారు.

ఈ వెహికిల్ రేంజ్ పెంచడంతో పాటు... ఫీచర్లు కూడా యాడ్ చేశారు. ఇది చూడటానికి ఆస్టర్ తరహాలో ఉండనుంది. కానీ ముందువైపు కవర్ చేసిన గ్రిల్, షార్ప్ బంపర్ దీనికి ఎలక్ట్రిక్ వాహనం లుక్‌ను తీసుకొచ్చాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా ఇందులో ఉన్నాయి. డిజిటల్ కీ ద్వారా వెనకవైపు ఆర్మ్ రెస్ట్, ఏసీ వెంట్లను కూడా ఆపరేట్ చేయవచ్చు.

చార్జింగ్ సాకెట్ ఎంజీ లోగోకు ఎడమవైపు ఉంది. ఈ కొత్త జెడ్ఎస్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ను అందించారు. వీటిలో 17 అంగుళాల అలోయ్ వీల్స్ అందించారు. దీంతోపాటు వెనకవైపు కొత్త బంపర్, కొత్త ల్యాంప్స్ కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న జెడ్ఎస్ నుంచి వేరుగా ఉండేలా దీన్ని రూపొందించారు.

అన్నిటికంటే పెద్ద మార్పు ఏంటంటే డాష్ బోర్డుకు కొత్త లుక్ వచ్చింది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండనుంది. దీని టచ్ స్క్రీన్‌లో 10.1 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ ఉండనుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి సాధారణ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 11 Aug 2022 09:46 PM (IST) Tags: 2022 MG Hector Facelift 2022 MG Hector Facelift First Look 2022 MG Hector MG Hector

సంబంధిత కథనాలు

Project Titan Apple: పట్టాలెక్కబోతున్న ఆపిల్ ‘ప్రాజెక్ట్ టైటాన్’, శరవేగంగా ఎలక్ట్రిక్ కారు నిర్మాణ పనులు!

Project Titan Apple: పట్టాలెక్కబోతున్న ఆపిల్ ‘ప్రాజెక్ట్ టైటాన్’, శరవేగంగా ఎలక్ట్రిక్ కారు నిర్మాణ పనులు!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

Electric Aircraft: అద్భుతం, గాల్లో చక్కర్లు కొట్టిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌ క్రాఫ్ట్ 'ఆలిస్'

Electric Aircraft: అద్భుతం, గాల్లో చక్కర్లు కొట్టిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌ క్రాఫ్ట్ 'ఆలిస్'

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Airbags Mandatory: కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాల్సిందే, ఈ రూల్ వర్తించేది అప్పటి నుంచే

Bengaluru: చారాణా కోడికి బారాణా మసాలా! రూ. 11 లక్షలు పెట్టికొన్న కారుకు రూ. 22 లక్షల రిపేర్ బిల్లు

Bengaluru: చారాణా కోడికి బారాణా మసాలా! రూ. 11 లక్షలు పెట్టికొన్న కారుకు రూ. 22 లక్షల రిపేర్ బిల్లు

టాప్ స్టోరీస్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్