అన్వేషించండి

Car Polish vs Wax: కారు మెరుపు కోసం పాలిష్ మాత్రమే సరిపోదు! పెయింట్ రక్షణకు వ్యాక్స్ కూడా అవసరమే!

కారు పాలిష్ & వ్యాక్స్ రెండూ ఒకటే కాదు. పెయింట్‌పై గీతలు, మచ్చలను పాలిష్ తగ్గిస్తే.. మెరుపును కాపాడుతూ పెయింట్‌కు రక్షణ కల్పిస్తుంది వ్యాక్స్.

Car Polish vs Wax Details In Telugu: కారు కొత్తగా ఉన్నప్పుడు దాని మెరుపు ప్రత్యేకంగా కనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ పెయింట్‌పై గీతలు, మచ్చలు, దుమ్ము ప్రభావం కనిపిస్తాయి. దీంతో కారు మెరుపు తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో చాలామంది కారు పాలిష్ చేయిస్తారు. మరికొందరు వ్యాక్స్ వేయిస్తారు. ఈ రెండూ ఒకటేనా? అంటే కాదు.

కారు పాలిష్ & వ్యాక్స్ రెండింటి పని వేర్వేరు. ఒకటి పెయింట్‌పై ఉన్న లోపాలను తగ్గించి మెరుపును తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. మరొకటి ఆ మెరుపును ఎక్కువకాలం కాపాడటంతో పాటు పెయింట్‌కు రక్షణ కల్పిస్తుంది. అందుకే కారు సంరక్షణలో రెండింటికీ ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.

కారు పాలిష్ అంటే ఏమిటి?

కారును ముందుగా పూర్తిగా శుభ్రం చేయాలి. ఇందుకోసం మంచి నాణ్యత ఉన్న కార్ షాంపూతో వాష్ చేయడం అవసరం. కారు శుభ్రం చేసిన తర్వాత కూడా పెయింట్‌పై చిన్న మచ్చలు, స్విర్ల్ మార్క్స్, నీటి మరకలు కనిపించవచ్చు. వీటి కారణంగా పెయింట్ మసకగా కనిపిస్తుంది.

ఇలాంటి లోపాలను తగ్గించేందుకు కారు పాలిష్ ఉపయోగిస్తారు. కొన్ని పాలిష్‌లలో స్వల్ప రాపిడి లక్షణాలు ఉంటాయి. ఇవి పెయింట్‌పై ఉన్న చిన్న గీతలు & ఇతర చిన్న లోపాలను కొంతవరకు తగ్గించడంలో సహాయపడతాయి.

అయితే రాపిడి ఉన్న పాలిష్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి. సరైన విధానం తెలియకుండా ఎక్కువగా రుద్దితే పెయింట్‌కు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరాన్ని బట్టి నిపుణులతో పాలిష్ చేయించడం మంచిది.

కారు వ్యాక్స్ అంటే ఏమిటి?

కారు వ్యాక్స్ ప్రధానంగా పెయింట్‌పై రక్షణ పొరను ఏర్పరచడానికి ఉపయోగిస్తారు. ఇది పెయింట్‌పై ఒక పలుచని పూతలా పనిచేస్తుంది. వ్యాక్స్ ఆరిన తర్వాత మైక్రోఫైబర్ క్లాత్‌తో అదనపు పొరను సున్నితంగా తొలగిస్తారు.

వ్యాక్స్ పూత వల్ల నీరు & ఇతర మలినాలు నేరుగా పెయింట్‌పై ప్రభావం చూపకుండా కొంత రక్షణ లభిస్తుంది. వర్షపు నీరు, కారు వాష్ సమయంలోని నీరు, దుమ్ము వంటి వాటి ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

అంతేకాదు.. వ్యాక్స్ కారు పెయింట్‌కు మరింత మెరుపును అందిస్తుంది. పెయింట్ రంగు లోతుగా కనిపించేలా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. మంచి నాణ్యత కలిగిన కార్నాబా వ్యాక్స్ వంటి ఉత్పత్తులు ఈ విషయంలో ఉపయోగకరంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: Tata Tiago సర్వీస్‌ కోసం భారీగా ఖర్చు చేయాలా? పెట్రోల్, CNG, AMT కార్ల నిర్వహణ వ్యయాల వివరణ

ముందుగా ఏది చేయాలి?

కారును ముందుగా పాలిష్ చేయాలి, ఆ తర్వాతే వ్యాక్స్ వేయాలి. ఎందుకంటే.. పాలిష్ అనేది పెయింట్‌పై ఇప్పటికే ఉన్న చిన్న లోపాలను తగ్గిస్తుంది. వ్యాక్స్ మాత్రం పాలిష్ చేసిన ఉపరితలంపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది.

వ్యాక్స్‌ను నేరుగా వేసినంత మాత్రాన చిన్న గీతలు లేదా స్విర్ల్ మార్క్స్ తొలగిపోవు. అదే విధంగా ఒక్క పాలిష్ మాత్రమే చేసినంత మాత్రాన పెయింట్‌కు దీర్ఘకాలిక రక్షణ లభించదు. అందుకే సరైన క్రమంలో రెండింటినీ ఉపయోగించడం ముఖ్యం.

పాలిష్‌తో కారు పెయింట్ మసకదనం తగ్గి మెరుపు తిరిగి రావచ్చు. చిన్న గీతలు & స్విర్ల్ మార్క్స్ కూడా కొంతవరకు తగ్గుతాయి. వ్యాక్స్ వల్ల ఆ మెరుపును నిలబెట్టుకోవడంతో పాటు పెయింట్‌కు అదనపు రక్షణ లభిస్తుంది.

అయితే తరచూ పాలిష్ చేయడం మంచిది కాదు. ముఖ్యంగా రాపిడి ఉన్న పాలిష్‌ను అవసరానికి మించి ఉపయోగిస్తే పెయింట్‌పై ప్రభావం పడవచ్చు. వ్యాక్స్ వేసేటప్పుడు కూడా సరైన విధానాన్ని పాటించాలి. వ్యాక్స్ పూర్తిగా ఆరిన తర్వాత దాన్ని సరిగ్గా బఫ్ చేయాలి.

ఇది కూడా చదవండి: సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 1338 km ప్రయాణం.. Audi A6 e-tron సంచలనం

మొత్తంగా చూస్తే.. కారు పాలిష్ & వ్యాక్స్‌ను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా చూడకూడదు. కారు మెరుపు & పెయింట్ సంరక్షణ కోసం ముందుగా పాలిష్ చేసి, ఆ తర్వాత నాణ్యమైన వ్యాక్స్ వేయడం సరైన విధానం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renault Duster, Kiger, Triber, Kwid కార్లపై రూ.2.10 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
రెనాల్ట్‌ డస్టర్‌ మీద రూ.2.10 లక్షలు, క్విడ్‌ మీద రూ.40,000 వరకు తగ్గింపు.. ఇంకొన్ని రోజులే!
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Engine Warm Up: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?
చలికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేయొచ్చా? ఇంజిన్‌ వేడెక్కేవరకు వెయిట్‌ చేయాలా?
Electric Scooter Sales: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటారా? ప్రస్తుతం దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 కంపెనీలు ఇవే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Tragedy Story: బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Cashews For Health : జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Embed widget