అన్వేషించండి

Tata Tiago సర్వీస్‌ కోసం భారీగా ఖర్చు చేయాలా? పెట్రోల్, CNG, AMT కార్ల నిర్వహణ వ్యయాల వివరణ

టాటా టియాగో సర్వీస్ & నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది? పెట్రోల్, CNG, AMT వేరియంట్ల సర్వీస్ ఖర్చులు, 5 ఏళ్ల నిర్వహణ వ్యయాన్ని తెలుసుకోండి.

Tata Tiago Maintenance Tips: టాటా టియాగో కొనాలని అనుకున్నప్పుడు.. కారు ధర, ఫీచర్లు, మైలేజీ మాత్రమే కాదు, నిర్వహణ ఖర్చును కూడా ముందుగానే లెక్కించడం చాలా ముఖ్యం. కారు కొనుగోలు చేసిన తర్వాత ప్రతి ఏడాది సర్వీస్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలి. అప్పుడే అసలు కారు యాజమాన్య ఖర్చు ఎంత అనేది అర్థమవుతుంది.

నిజానికి, టాటా టియాగో కారు తక్కువ ఖర్చుతో నిర్వహించగల హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. బలమైన నిర్మాణం, మంచి భద్రత ఫీచర్లు & అవసరమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అయితే కారు కొనుగోలు చేసిన తర్వాత సర్వీస్ ఖర్చులు ఎలా ఉంటాయి? పెట్రోల్, CNG & AMT వేరియంట్లలో ఏమైనా తేడా ఉంటుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

సర్వీసింగ్‌ లెక్క

టియాగోకు సాధారణంగా ప్రతి 10,000 కి.మీ.కు లేదా 12 నెలలకు ఒకసారి సర్వీస్ చేయించాలి. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే దాని ప్రకారం సర్వీస్ చేయించుకోవాలి. మొదటి రెండు సర్వీసుల్లో లేబర్‌ ఛార్జీలు ఉండవు. అయితే, వినియోగ వస్తువులకు కొంత ఖర్చు కావచ్చు.

మొదటి సర్వీస్ సాధారణంగా 1,000 నుంచి 2,000 కి.మీ. మధ్య ఉంటుంది. ఇందులో వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేస్తారు. ఫ్లూయిడ్ల స్థాయిని కూడా పరిశీలిస్తారు. ఈ సర్వీస్‌కు సాధారణంగా ప్రత్యేక లేబర్‌ ఛార్జీ ఉండదు.

రెండో సర్వీస్ 5,000 నుంచి 7,500 కి.మీ. మధ్య ఉంటుంది. ఇందులో వాహన తనిఖీతో పాటు చక్రాల అమరికను పరిశీలిస్తారు. వినియోగ వస్తువులకు కొంత ఖర్చు కావచ్చు.

10,000 కి.మీ. లేదా 12 నెలల తర్వాత సాధారణ చెల్లింపు సర్వీసులు మొదలవుతాయి. ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ మార్పు & ఇతర సాధారణ తనిఖీలు చేస్తారు. ఒక్కో సర్వీస్‌కు సుమారు రూ.2,800 నుంచి రూ.4,500 వరకు ఖర్చు కావచ్చు.

ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే సాధారణ నిర్వహణకు సుమారు రూ.20,000 నుంచి రూ.25,000 వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందులో టైర్లు, క్లచ్ & బ్యాటరీ వంటి ఖర్చులు ఉండవు.

ఇది కూడా చదవండి: Tata Aerisలో ఏ వేరియంట్‌ మీ బడ్జెట్‌కు సరిపోతుంది? వేరియంట్ల వారీగా ఫీచర్లు, ధరల వివరాలు

పెట్రోల్, CNG & AMT వేరియంట్లు

పెట్రోల్ టియాగోలో నిర్వహణ ఖర్చులు సాధారణంగా అంచనా వేయడానికి సులభంగా ఉంటాయి. సాధారణ సర్వీసులకు రూ.5,000 లోపే ఖర్చు కావచ్చు. ఫిల్టర్లు & ఇతర విడిభాగాలు కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి.

CNG టియాగోలో ఇంధన ఖర్చు తగ్గుతుంది. అయితే సర్వీస్ సమయంలో కొన్ని అదనపు తనిఖీలు అవసరం. స్పార్క్ ప్లగ్స్, CNG ఫిల్టర్ & ఒత్తిడి వ్యవస్థను పరిశీలించాలి. దీంతో పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే నిర్వహణ ఖర్చు కొంత ఎక్కువ కావచ్చు.

AMT టియాగోలో సాధారణ సర్వీస్ ఖర్చు మాన్యువల్ మోడల్‌కు దగ్గరగానే ఉంటుంది. అయితే అధిక ట్రాఫిక్‌లో తరచూ ఆపడం & ముందుకు కదలడం వల్ల క్లచ్ త్వరగా అరిగే అవకాశం ఉంది. క్లచ్ మార్చాల్సిన అవసరమైతే అదనపు ఖర్చు వస్తుంది.

బ్రేక్ ప్యాడ్లకు సుమారు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు ఖర్చు కావచ్చు. బ్యాటరీకి రూ.4,000 నుంచి రూ.8,000 వరకు ఖర్చు అవుతుంది. టైర్ల పూర్తి సెట్‌కు సుమారు రూ.14,000 నుంచి రూ.25,000 వరకు ఖర్చు కావచ్చు. క్లచ్ మార్పుకు రూ.8,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: టాటా కొత్త సెడాన్‌లో అదిరిపోయే ఫీచర్లు.. Tata Tigorలో లేనివి, Aerisలో ఉన్నవి ఇవే

ఐదేళ్లకు ఎంతవుతుంది?

ఈ ఖర్చులు ప్రతి ఏడాది రావు. అయితే ఐదేళ్ల కాలాన్ని లెక్కించేటప్పుడు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణ సర్వీసులు, బ్రేక్ ప్యాడ్లు, బ్యాటరీ వంటి వాటిని కలిపితే మొత్తం నిర్వహణ వ్యయం సుమారు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు చేరవచ్చని అంచనా.

టాటా అందించే AMC ద్వారా ముందుగానే సర్వీస్ ఖర్చులను నిర్ణయించుకోవచ్చు. సర్వీస్ ఛార్జీల పెరుగుదల నుంచి కొంత రక్షణ లభిస్తుంది. కారును అమ్మకుండా ఎక్కువ కాలం ఉంచుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడవచ్చు.

ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా పరిశీలించవచ్చు. ముఖ్యంగా AMT మోడల్ తీసుకునేవారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. గేర్‌బాక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇతర ఖరీదైన భాగాల్లో సమస్యలు వస్తే అదనపు రక్షణ లభించవచ్చు.

నిర్వహణ ఖర్చును తగ్గించుకోవాలంటే సమయానికి సర్వీస్ చేయించాలి. టైర్లను క్రమం తప్పకుండా మార్చి, ఎలైన్‌మెంట్‌ను చెక్‌ చేయాలి. టైర్లలో గాలి ఒత్తిడిని సరైన స్థాయిలో ఉంచాలి. డ్యాష్‌బోర్డ్‌లో హెచ్చరిక లైట్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

మొత్తంగా చూస్తే.. టాటా టియాగో నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండదు. సాధారణ సర్వీసులకు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు కావచ్చు. పెద్ద సర్వీసుల్లో ఖర్చు రూ.7,500 వరకు అయ్యే అవకాశం ఉంది. ఐదేళ్లలో అదనపు నిర్వహణ ఖర్చులను కలిపి చూస్తే మొత్తం వ్యయం పెరుగుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget